budget allocation
-
వ్యవసాయానికి 64 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వాన్ని కోరింది. రుణమాఫీ, రైతు భరోసా, ఇతర పథకాల అమలు కోసం పెద్ద ఎత్తున కేటాయింపులు చేయాలంటూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందజేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.64 వేల కోట్ల మేర అవసరమని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టులో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం శాఖల వారీగా ప్రతిపాదనలను స్వీకరిస్తోంది.పథకాల వారీగా అవసరాలతో..: బుధవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా అధికారులు పథకాల వారీగా నిధుల అవసరాలను వెల్లడించారు. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు, రైతుభరోసా కోసం రూ.23 వేల కోట్లను ప్రతిపాదించారు. ఈ ఏడాది నుంచి అమలు చేయబోయే పంటల బీమాకు రూ.3 వేల కోట్లు కావాలని పేర్కొన్నారు. దీంతోపాటు రైతుబీమాకు రూ.1,500 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయ అనుబంధ విభాగాల కోసం మిగతా నిధులను కోరారు. ఆయిల్ పామ్ సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. దానికి దాదాపు వెయ్యి కోట్లు కావాలని కోరినట్టు సమాచారం.వ్యవసాయ యాంత్రీకరణ కీలకంగత పదేళ్లుగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దీంతో కూలీలు దొరకడం కష్టంగా మారింది. కానీ ప్రభుత్వం నుంచి కనీసం తైవాన్ స్ప్రేయర్ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై అందే పరిస్థితి లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. బయట మార్కెట్లో కొనాలంటే.. రైతులు ఆ ధరలు భరించడం కష్టం. కొరత కారణంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. 2018 వరకు ప్రభుత్వం ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై ఇచ్చిందని.. ఆ తర్వాత పథకం నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని కోరుతున్నారు. -
PM Narendra Modi: మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులా?
నాసిక్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 15 శాతం నిధులను మైనారీ్టలకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులను తాము అనుమతించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. అలాగే విద్య, ఉద్యోగాల్లో మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని స్పష్టంచేశారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్లో 15 శాతం నిధులను వారికి ప్రీతిపాత్రమైన ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టడానికి ప్రయతి్నంచిందని చెప్పారు. అప్పట్లో బీజేపీ గట్టిగా ప్రతిఘటించడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తాను కాంగ్రెస్ ప్రతిపాదనను వ్యతిరేకించానని తెలిపారు.కానీ, మైనారీ్టలకు 15 శాతం నిధుల ఆలోచనను కాంగ్రెస్ ఇప్పటికీ విరమించుకోలేదని, ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయాలని యోచిస్తోందని విమర్శించారు. బుధవారం మహారాష్ట్రలోని పింపాల్‌గావ్ బస్వంత్, థానే పట్టణాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు అనేది చాలా ప్రమాదకరమైన ఆలోచన అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మత ఆధారంగా దేశాన్ని ఇప్పటికే ఒకసారి విభజించిందని, మరో సారి అలాంటి పథకమే రచిస్తోందని ధ్వజమెత్తారు. తాము మతాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు కేవలం ఎంపీలను ఎన్నుకోవడం కోసం కాదని అన్నారు. దేశం కోసం బలమైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం గల ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి జరుగుతున్నాయని ఉద్ఘాటించారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని వివరించారు. గత పదేళ్లలో తన పని తీరును ప్రజలు గమనించారని. వికసిత్ భారత్ కోసం తనను మూడోసారి గెలిపించాలని కోరారు. -
రాజస్తాన్‌లో 19 కొత్త జిల్లాలు
జైపూర్: రాజస్తాన్‌లో కొత్తగా 19 జిల్లాలను, మూడు డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 50కి చేరనుంది. 2008 తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఇదే తొలిసారి. కొత్త జిల్లాల్లో అత్యధికంగా జైపూర్‌లో నాలుగు జిల్లాలు, జోథ్‌పూర్‌లో మూడు ఏర్పాటు కానున్నట్టు గహ్లోత్ వెల్లడించారు. కొత్త జిల్లాలు, డివిజన్లలో మౌలిక వసతులు, మానవ వనరుల కల్పనకు బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించామన్నారు. విస్తీర్ణపరంగా దేశంలో రాజస్తాన్ అతిపెద్ద రాష్ట్రమన్న విషయం తెలిసిందే. -
పేదలకు ఇళ్లు.. 4.4 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి.. మరో రూ.5,600 కోట్లు..
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 2023 సంవత్సరం చివరి నాటికి 30.2 లక్షల శాశ్వత గృహాలను అర్హులైన లబ్దిదారులందరికీ అందించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 18.63 లక్షల ఇళ్లకు గాను, మొదటి దశలో 16.91 లక్షల ఇళ నిర్మాణం ప్రారంభంకాగా, వీటిలో 4.4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన ఇళ్ల నిర్మాణం వివిధ దశలలో ఉంది. వైఎస్సార్ జగనన్న కాలనీలను నీటి సరఫరా, విద్యుత్, రోడ్లు, మురుగు కాల్వల ఏర్పాటు వంటి అన్ని మౌలిక సదుపాయాలతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. భారాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ, ఇ-ప్రొక్యూర్మెంట్ వేదికల ద్వారా టెండర్లను ఖరారు చేసిన మార్కెట్ ధర కంటే ధరకు 20 మెట్రిక్ టన్నుల ఇసుక, 5 మెట్రిక్ టన్నుల సిమెంట్, స్టీల్, 12 ఇతర నాణ్యమైన భవన నిర్మాణ సామగ్రిని ఉచితంగా అందిస్తోంది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 5,600 కోట్ల రూపాయలను కేటాయించింది. చదవండి: ఏపీ వార్షిక బడ్జెట్.. మహిళా సాధికారతే ధ్యేయంగా.. -
ఏపీ వార్షిక బడ్జెట్.. సంక్షేమ పథకాలకు పెద్దపీట
సాక్షి, అమరావాతి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన ఏపీ వార్షిక బడ్జెట్ రూ. రూ. 2లక్షల 79వేల 279 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు. మూలధన వ్యయం రూ.31,061కోట్లు. బడ్జెట్లో సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ కేటాయింపులు ఇలా ఉన్నాయి.. ► వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు ► వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రూ.15,882 కోట్లు ► వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020 కోట్లు ► జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు ► జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు ► వైఎస్సార్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు ► డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రూణాల కోసం రూ.1000 కోట్లు ► రైతులకు వడ్డీ లేని రుణాలు రూ.500 కోట్లు ► వైఎస్సార్ కాపు నేస్తం రూ.550 కోట్లు ► జగనన్న చేదోడు రూ.35 0 కోట్లు ► వైఎస్సార్ వాహనమిత్ర రూ.275 కోట్లు ► వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు ► వైఎస్సార్ మత్స్యకారు భరోసా రూ.125కోట్లు ► మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50కోట్లు ► రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు ► లా నేస్తం రూ.17 కోట్లు ► జగనన్న తోడు రూ.35 కోట్లు ► ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు ► వైఎస్సార్ కల్యాణమస్తు రూ.200 కోట్లు ► వైఎస్సార్ ఆసరా రూ.6,700 కోట్లు ► వైఎస్సార్ చేయూత రూ.5, 000 కోట్లు ► అమ్మఒడి రూ.6,500 కోట్లు ► జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు -
Union Budget 2023-24: బడ్జెట్లో 'ఉపాధి హామీ'కి భారీ కోత.. నాలుగేళ్లలో..
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీపీ).. కోవిడ్ సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు వచ్చిన కోట్లాది మంది వలస కూలీలకు ఉపాధి కల్పించి ఆదుకుంది. ఈ బృహత్తర పథకానికి కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో కేటాంపులను భారీగా తగ్గించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం రూ.60వేల కోట్లను మాత్రమే ఈ పథకానికి కేటాయించారు. గతేడాది సవరించిన అంచనా కేటాయింపు రూ.89,400 కోట్లలో ఏకంగా 32 శాతం తగ్గించింది. 2022-23 బడ్జెట్లో కూడా మోదీ సర్కార్ 25 శాతం మేర కోత విధించింది. రూ.98 వేల కోట్లు అంచనా కాగా రూ.73వేల కోట్లే కేటాయించింది. ఈ ఏడాది జనవరి 6 నాటికి దేశవ్యాప్తంగా 5.6 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద ఉపాధి పొందగా 225.8కోట్ల వ్యక్తి పనిదినాలు నమోదయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి 24 నాటికి 6.49 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద ఉపాధి కోరగా 6.48 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి కల్పించింది. 5.7 కోట్ల కుటుంబాలు ఉపాధి హామీ పనులను ఉపయోగించుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక కూలీలు వలసలు వెళ్లకూడదన్న ఉద్దేశంతో 2005లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పథకానికి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా కేటాయింపులు తగ్గిస్తూ వస్తోంది. గత నాలుగు బడ్జెట్లలో కేటాయింపులు ఇలా.. మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యం ఎలా తగ్గిస్తోందో గత నాలుగు బడ్జెట్లలో ఈ పథకానికి చేసిన కేటాయింపులను చూస్తే అర్థమవుతుంది. 2020-21 బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి రూ.61,500 కోట్లు కేటాయించిన బీజేపీ సర్కారు 2021-22, 2022-23 బడ్జెట్లలో రూ.70 వేల కోట్ల చొప్పున కేటాయించింది. ఇక తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి కేటాయించింది కేవలం రూ.60వేల కోట్లు. గత నాలుగు బడ్జెట్లలో ఇదే అత్యల్ప కేటాయింపు కావడం గమనార్హం. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
కేటాయింపులు ఘనం.. వ్యయం అంతంతే
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు సంవత్సరం వ్యవసాయం, సంక్షేమం, నీటిపారుదల తదితర రంగాలకు బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసిన చంద్రబాబు సర్కారు ఆ సొమ్మును ఖర్చు చేయడంలో విఫలమైంది. కేటాయింపులు, వ్యయాల మధ్య ఉన్న భారీ తేడాను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక బహిర్గతం చేసింది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, సహాయం, రోడ్లు భవనాలు, పౌరసరఫరాలు, పరిశ్రమల రంగాలకు భారీగా కేటాయింపులు చేసినా వ్యయం అంతంత మాత్రంగానే చేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. కొన్ని రంగాల్లో మిగుళ్లకు నిర్దిష్టమైన కారణాలను ప్రభుత్వం తెలియజేయలేదని కూడా వ్యాఖ్యానించింది. సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమ రంగాల కేటాయింపుల్లో సగం కూడా వ్యయం చేయలేదని తెలిపింది. బడ్జెట్లో కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప వాస్తవరూపం దాల్చలేదని కాగ్ స్పష్టం చేసింది. కేటాయింపులు చేసినా ఆ పనులు చేపట్టడానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇవ్వలేదు. కేటాయింపులకు వ్యయానికి పొంతన లేకపోవడంతో బడ్జెట్ ప్రక్రియకు అర్థం లేకుండా పోయిందని కాగ్ నివేదిక పేర్కొంది. పౌరసరఫరాల కేటాయింపుల్లో ఏకంగా 81 శాతం మేర వ్యయం చేయలేదు. అలాగే రహదారులు, భవనాలశాఖకు కేటాయించినదాన్లో 75 శాతం మేర ఖర్చుచేయలేదు. మొత్తం 11 రంగాలకు కలిపి రూ.1,05,579.16 కోట్లు కేటాయించగా రూ.57,908.50 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. రూ.47,670.66 కోట్ల రూపాయలను వ్యయం చేయలేదు. 11 రంగాలకు కేటాయింపులు, ఖర్చుచేసిన, చేయని సొమ్ము వివరాలు.. రంగం కేటాయింపు (రూ.కోట్లలో) ఖర్చుచేసిన సొమ్ము(రూ.కోట్లలో) ఖర్చు చేయని మొత్తం 1.రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సహాయం 6,942.26 3886.61 3,055.65 2. పాఠశాల విద్య 23,192.58 17,479.29 5,713.33 3. పురపాలక, పట్టణాభివృద్ధి 8,629.99 5,243.03 3,386.96 4. సాంఘిక సంక్షేమం 4,221.64 2,121.06 2,100.58 5. బీసీ సంక్షేమం 6,278.36 2,804.39 3,473.97 6. వ్యవసాయం 15,569.41 8,020.53 7,548.88 7. పంచాయతీరాజ్ 7,367.03 4,880.90 2,486.13 8. పరిశ్రమలు, వాణిజ్యం 4,696.67 1,010.12 3,686.55 9. పౌరసరఫరాలు 3,673.00 697.69 2,975.31 10. రోడ్లు, భవనాలు 4,369.72 1,087.60 3,282.12 11. నీటిపారుదల 20,638.50 10,677.32 9,961.18 మొత్తం 1,05,579.16 57,908.54 47,670.66 -
కరోనా పోటు రూ. 52,750 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా రూపంలో గట్టి దెబ్బే పడింది. ఆశించిన ఆదాయం గణనీయంగా తగ్గి... ఆర్థిక ప్రణాళిక తల్లకిందులైంది. ఇప్పుడు నికరంగా వచ్చేదెంతో చూసుకొని.. ప్రాధాన్యాలను బట్టి పద్దులను సరిచేసుకోవాల్సి వస్తోంది. కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో ప్రస్తుత (2020–21) ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్నివిధాలా కలిసి రూ.52,750 కోట్లు తగ్గనుందని ఆర్థిక శాఖ అధికారులు తేల్చారు. ఆదాయంలో భారీ తగ్గుదల నేపథ్యంలో 2020–21 బడ్జెట్ అంచనాల్లో కూడా మార్పులు, సవరణలు అనివార్యమని ప్రభుత్వానికి సూచించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ శనివా రం ప్రగతిభవన్‌లో ఆర్థికశాఖ అధికారులతో సమావేశమయ్యారు. 2020–21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు కరోనా వల్ల తలెత్తిన పరిస్థితిని వివరించారు. తల్లకిందులైన బడ్జెట్ అంచనాలు ‘రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019–20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్రానికి రూ.39,608 కోట్ల ఆదాయం వచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు 15 శాతం ఉంటుందని అంచనా వేసి 2020–21 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. ఆశించిన 15 శాతం వృద్ధి లేకపోగా.. కరోనా వల్ల గత ఏడాది వచ్చిన ఆదాయం కూడా ఈ ఏడాది రాలేదు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా మొత్తం రూ.1,15,900 కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరాంతానికి కేవలం రూ.68,781 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే స్వీయ ఆదాయం రూ.47,119 కోట్లు తగ్గనుంది’అని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. ‘రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా భారీగా తగ్గింది. తెలంగాణకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,727 కోట్లను పన్నుల్లో రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నారు. దీని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పన్నుల్లో వాటా కింద రూ.8,363 కోట్లు రావాలి. కానీ రూ.6,339 కోట్లు మాత్రమే వచ్చాయి. పన్నుల్లో వాటా ఇప్పటికే రూ.2,024 కోట్లు తగ్గింది. 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.16,727 కోట్లకు గాను కేవలం రూ.11,898 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. దీంతో పన్నుల్లో వాటా రూ.4,829 కోట్లు తగ్గనున్నాయి. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.9,725 కోట్లు రావాల్సి ఉంది. దీని ప్రకారం అక్టోబర్ నెల వరకు రూ.5,673 కోట్లు రావాలి. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.4,592 కోట్లు వచ్చాయి. అక్టోబర్ మాసం వరకే రావాల్సిన నిధుల్లో రూ.1,081 కోత పడింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 9,725 కోట్లకు గాను, రూ.8,923 కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా కేంద్ర పథకాల కింద వచ్చే నిధుల్లో రూ.802 కోట్ల కోతపడే అవకాశం ఉంది’అని ఆర్థికశాఖ అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రానికి మొత్తంగా రూ.52,750 కోట్ల ఆదాయం తగ్గుతున్నందున దానికి అనుగుణంగా ప్రాధాన్యతాక్రమాన్ని నిర్ధారించుకుని, ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇచ్చింది శూన్యం: కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానివి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే అని మరోసారి నిరూపణ అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వర్షాలు, వరదలతో భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా ఒక్క రూపాయి కూడా సాయం అందించకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తోందని విమర్శించారు. దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌కు నష్టం జరిగితే కూడా స్పందించి సాయం చేయకపోవడం దారుణమన్నారు. ‘ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా సాయం అందలేదని ఆర్థికశాఖ అధికారులు సీఎంకు తెలిపారు. ‘హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. అనేక రంగాలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం కూడా జరిగింది. దాదాపు రూ.5వేల కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసి, రూ.1,350 కోట్లను తక్షణ సాయంగా అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్టోబర్ 15న లేఖ రాశారు. వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌తో వారు స్వయంగా మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా చూసింది. ఇంత జరిగిన తర్వాత కేంద్రం నుంచి ఎంతోకొంత సాయం అందుతుందని ఆశించాం. కానీ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు’అని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్ పాల్గొన్నారు. -
కేంద్రానికి సమస్యలు ఉంటాయి: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా బాగుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమానమైన నిధులు కేటాయించిందని తెలిపారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం పక్షపాతం చూపిస్తుందనేది అవాస్తవమన్నారు. కేంద్రం రాష్ట్రాలకు నిధులకు కేటాయించకుండా ఎవరికి కేటాయిస్తుందని ప్రశ్నించారు. బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించారని, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని కేంద్రం చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనవసరంగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు సమస్యలు ఉన్నట్లే, కేంద్ర ప్రభుత్వానికి సమస్యలు ఉంటాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని, ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్.. రైతుల బడ్జెట్ అని కొనియాడారు. చదవండి: సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా.. -
ఆదిలాబాద్ జిల్లాకు వరాలివ్వని నిర్మలమ్మ
సాక్షి, ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేకమేమి లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నప్పటికీ పెద్దగా ఒనగూరిందేమి లేదు. దశాబ్ధాలుగా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వేలైన్ నిర్మాణంపై ఆ శలు పెట్టుకున్న జిల్లా వాసులకు ఈ బడ్జెట్లోనూ మొండి చేయ్యే ఎదురైంది. బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 2024 వరకూ వంద విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు ప్రకటించినప్ప టికీ అందులో ఆదిలాబాద్ జిల్లా ఉందో.. లేదో స్పష్టత లేదు. ఇక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కేటాయింపుల్లో మనకు భాగస్వామ్యం దక్కుతుందన్న ఊరట తప్పితే ప్రత్యేకంగా జిల్లాకు ఏమి దక్కలేదు. ఆశలపై నీళ్లు... రైల్వే లైన్‌పై జిల్లా ప్రజలు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుపై పెట్టుకున్న ఆశలు మరోసారి వమ్మయ్యాయి. జిల్లా నుంచి బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఉండడంతో సర్కారు కరుణిస్తుందని ప్రజలు ఆశ పెట్టుకున్నారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ రైల్వే లైన్‌ను నిర్మించేందుకు అంగీకరించాయి. దీనికోసం రూ.2,700 కోట్లు అంచనాలు వేశారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో ఈ ప్రాజెక్టు అసలు మొదలవుతుందా.. లేదా.. ఇంకెన్ని సంవత్సరాలు వేచి చూడాలన్న మీమాంస ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటుపై చిన్న ఆశ చిగురిస్తుంది. బడ్జెట్లో దేశ వ్యాప్తంగా 2024 వరకు వంద విమానాశ్రయ కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం మంజూరు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ వందలో మనది ఉంటుందా.. అనే ఆశ కలిగిస్తుంది. కొంత ఊరట... వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, పారిశుధ్యం, తాగునీరు విషయాలను ప్రాధాన్యత అంశాలుగా గుర్తించి బీజేపీ సర్కార్ నిధుల కేటాయింపు జరపగా, అందులో జిల్లాకు కూడా నిధులు అందే అవకాశం ఉంది. పౌష్టికాహారానికి దేశ వ్యాప్తంగా వేల కోట్లు కేటాయించగా, జిల్లాకు అమితంగా నిధులు అందుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనత కారణంగా ఇటీవల మాతాశిశు మరణాలు, పౌష్టికాహార లోపంతో అనేక మంది సతమతమవుతున్నారు. జిల్లాలో అనేక మంది యువత సరైన నైపుణ్యత లేక వివిధ అంశాల్లో వెనుకబడుతుండగా, ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు జిల్లాకు కూడా పెద్ద ఎత్తున అవకాశం కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మౌలిక రంగాలు.... రవాణా, మౌలిక రంగాల అభివృద్ధికి ఈ బడ్జెట్లో కేంద్రం దృష్టి పెట్టిన దృష్ట్యా జిల్లాకు కూడా ప్రయోజనం దక్కే అవకాశాలు లేకపోలేదు. పరిశ్రమల ఏర్పాటు, వాణిజ్య రంగాల ప్రోత్సాహానికి బడ్జెట్లో కేటాయింపులు జరిపిన దృష్ట్యా జిల్లాలో ఆసక్తి ఉన్న పలువురు దీన్ని అందిపుచ్చుకుంటారన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. మహిళ సంక్షేమానికి నిధుల కేటాయింపు కూడా ప్రస్తుతం అమలవుతున్న కేంద్ర పథకాలకు దోహదపడే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన దృష్ట్యా జిల్లాలోని ఆ వర్గాల ప్ర జలకు కూడా ప్రయోజనం దక్కే ఆస్కారం ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇండ్లు నిర్మిస్తామని బడ్జెట్లో పేర్కొన్న దృష్ట్యా జిల్లాలో ఇండ్లు లేనివారికి ఈ పథకం ద్వారా స్వాంతన లభిస్తుందా అనేది వేచిచూడాల్సిందే. ఆదాయ పన్నులు... మధ్య, ఎగువ తరగతికి ఊరటనిచ్చేలా ఆదాయ పన్ను స్లాబ్‌లలో మార్పులు జిల్లాలోని అనేకమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉండనుంది. ఇప్పటివరకు 0 నుంచి రూ.5లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉండగా, రూ.5లక్షలు దాటిన వారికి రూ. 2.50 లక్షల నుంచి రూ.5లక్షల వరకు 5శాతం ఆదాయ పన్ను అమలు చేసేవారు. ప్రస్తుతం కొన్ని స్లాబ్‌లను మార్చారు. రూ.5లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు 10 శాతం ఆదాయ పన్ను, అదేవిధంగా రూ.7.50 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12.50లక్షల వరకు 20శాతం, 12.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం, రూ.15 లక్షలు, ఆపై ఆదాయం ఉన్నవారికి 30 శాతం ఆదాయ పన్ను విధిస్తూ స్లాబ్‌లను అమలు పర్చారు. వ్యవ‘సాయం’పై... రైతుల ఆదాయాన్ని 2022 వరకు రెట్టింపు చేస్తామన్న ప్రకటనకు కట్టుబడి ఉన్నామని బీజేపీ సర్కార్ బడ్జెట్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రుణాలు విరివిగా ఇవ్వనున్నట్లు పేర్కొనడం జరిగింది. జిల్లాలో ప్రతిఏడాది లక్ష 30వేల మంది రైతులు బ్యాంక్ రుణాలు తీసుకొని సాగు చేస్తుండటం కనిపిస్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీ మా యోజన కింద కోట్ల మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తామని బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. జిల్లా రైతులకు కూడా ఈ ప్రయోజనం దక్కుతుందా అనేది వేచి చూడాల్సిందే. కృషి సించాయ్ యోజన ద్వా రా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం అందిస్తామని బడ్జెట్లో ప్రకటించారు. జిల్లాలో సూక్ష్మ సాగునీటికి ఆదరణ లభించే అవకాశం లేకపోలేదు. వైద్య నిపుణుల కొరత తీర్చేందుకు ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటిది ఏర్పాటు చేస్తే పేదలకు ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాష్ట్రానికి మొండిచేయి కేంద్రం బడ్జెట్‌తో రాష్ట్రానికి, జిల్లాకు ఓరిగిందేమీ లేదు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే బీజేపీ.. ఈ బడ్జెట్లో రైతుల సంక్షేమానికి నిధులు నామామాత్రంగానే కేటాయించింది. విద్య, వైద్యానికి పెద్దపీట వేశామని గొప్పలు చెబుతున్నారు. ఆదిలాబాద్‌కు నయాపైసా కేటాయించలేదు. – జోగు రామన్న, ఆదిలాబాద్ ఎమ్మెల్యే -
సీతమ్మ శీతకన్ను..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈసారి కేంద్ర బడ్జెట్లోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొండిచెయ్యే ఎదురైంది. ఏ ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయింపు జరగకపోగా.. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడారం జాతరకు జాతీయ హోదా కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఈసారి కూడా పచ్చజెండా ఊగలేదు. కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి నిధులు దక్కలేదు. రైల్వే డివిజన్ ఏర్పాటు అంశానికైతే బడ్జెట్లో స్థానమే లభించలేదు. ఇక వరంగల్ రూరల్ జిల్లాలో 1,200 ఎకరాల్లో ఏర్పాటవుతున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీకి మోక్షం కలగలేదు. ఈ మేరకు పార్లమెంట్లో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కథనం. దక్కని జాతీయ హోదా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కొన్నేళ్లుగా కేంద్రాన్ని కోరుతోంది. అయినా ఫలితం లేకుండా పోయింది. భారీ వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందనే ప్రభుత్వం నమ్మకంతో ఉన్నా నిరాశే ఎదురైంది. ఇక గిరిజన కుంభమేళాగా ములుగు జిల్లాలోని మేడారం జాతరకు కూడా జాతీయ హోదా కలగానే మిగిలిపోతోంది. కొన్నేళ్లుగా జాతరకు జాతీయ హోదా కోసం కోరుతున్నా మోక్షం కలగడం లేదు. గిరిజన యూనివర్సిటీ రాష్ట్రాల విభజన చట్టం ప్రకారం రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి ములుగు జిల్లా అనువైన ప్రాంతం కావడంతో అక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతయేడు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.4కోట్లను మాత్రమే కేటాయించారు. ఇక యూనివర్సిటీకి అవసరమైన 500 ఎకరాల్లో 497 ఎకరాలకు పైగా గుర్తించారు. కానీ ఈసారి బడ్జెట్లో ని«ధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకు సాగేలాల లేవు. బయ్యారం ఊసేది? ఇనుపరాయి గనులు విస్తారంగా ఉన్న బయ్యారంలో ఉక్కుపరిశ్రమ నిర్మాణం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మానుకోట జిల్లావాసులకు ఈ బడ్జెట్లో కూడా నిరాశే ఎదురైంది. రెండోసారి సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఏన్డీయే ప్రభుత్వం బయ్యారం పరిశ్రమపై ఏదైనా ప్రకటన చేస్తుందనుకున్న వారికి ఎదురుచూపులే మిగిలాయి. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన ఖనిజ నిక్షేపాలు 200 టన్నులకు పైగా ఉన్నట్లు అధికారులు గతంలో సర్వే ద్వారా గుర్తించారు. పరిశ్రమకు బయ్యారం చెరువు ద్వారా నీటి సదుపాయం, రైల్వే రవాణ సౌకర్యాలు ఉన్నా కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే, జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేది. అలాగే, ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులు ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లాల్సి ఇబ్బందులు తప్పేవి. టెక్స్టైల్ పార్కు పరిస్థితీ అంతే... వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుకొండ – సంగెం మండల్లో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం కోసం 22 అక్టోబర్ 2017లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. పార్కు నిర్మాణం కోసం 1200 ఎకరాల భూమి సేకరించారు. పార్కులో అంతర్గత రోడ్ల నిర్మానం ఇప్పటికే జరుగుతుండగా.. పలు కంపెనీలు ఎంఓయూ కూడా చేసుకున్నాయి. ఈ పార్కు నిర్మాణం పూర్తయితే లక్ష మందికి పైగా ఉపాధి లభించే అవకాశముంది. టెక్స్టైల్ పార్కు అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినా స్పందించలేదు. ఇండస్ట్రియల్ కారిడార్.. హైదారాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండ్రస్టీయల్ కారిడార్ అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కో రింది. కానీ ఈసారి బడ్జెట్లో స్థానం దక్కలేదు. రైల్వే డివిజన్, వ్యాగన్ షెడ్ దశాబ్దకాలానికి పైగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వే డివిజన్ కేంద్రం ఏర్పాటుపై బడ్జెట్లో ప్రకటన వస్తుందనుకున్నా అలాంటిదేమీ జరగలేదు. అదేవిధంగా రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా కాజీపేటకు మంజూరైన వ్యాగన్ పీరియాడిక్ల్ ఓవర్ హాలింగ్(పీఓహెచ్) షెడ్‌కు సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో జిల్లా వాసులతో పాటు రైల్వే కార్మికులు నిరాశ చెందారు. అంతేకాకుండా బల్లార్షా – విజయవాడకు కాజీపేట మీదుగా వెళ్లే మూడో లైన్‌కు కూడా కేటాయింపు చేయలేదు. ఫిట్‌లైన్ ప్రస్తావన, ఎలక్ట్రిక్, డీజిల్ లోకోషెడ్ల ఊసు ఎత్తలేదు. కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణానికి కేటాయింపులు, రైల్వే కార్మికులు, వారి పిల్లల సంక్షేమంపై ఎలాంటి ప్రకటన ఆర్థిక మంత్రి చేయలేదు. అయితే, రైల్వే ఉద్యోగులకు ఆదాయపు పన్నును కొద్దిమేర తగ్గించనున్నట్లు చెప్పడం, రైతుల కోసం కిసాన్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించడం కొంత ఆశాజనకంగా కనిపించింది. తెలంగాణపై కేంద్రం వివక్ష తెలంగాణపై ఈ బడ్జెట్లోనూ కేంద్రప్రభుత్వం వివక్ష చూపింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సైతం అన్యాయం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని కోరినా పట్టించుకోలేదు. ఇతర కేటాయింపుల్లోను ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్రానికి రావాలి్సన ప్రాజెక్టులకు కేటాయింపులు చేయలేదు. రైల్వే పరంగా మొండిచేయి చూపారు. – పసునూరి దయాకర్, వరంగల్ ఎంపీ -
ప్రాధాన్యతలిస్తే పరిశీలిస్తాం..
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం కోత పెట్టిన నేపథ్యంలో శాఖల వారీగా ప్రాధాన్యతలకు అదనపు నిధులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో శాఖల వారీగా సమీక్షలు నిర్వహించిన అధికారులు.. తాజాగా అత్యవసర కేటగిరీలో ఉన్న కార్యక్రమాలను పూర్తిచేసుకునేం దుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శాఖల వారీగా ప్రాధాన్యత అంశాలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రతిపాదనలు స్వీకరించే పనిలో పడ్డారు. ఈ మేరకు సంక్షేమ శాఖలకున్న ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా వారం రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలని సంక్షేమ శాఖలకు ఆర్థిక శాఖ సూచనలు చేసింది. డైట్‌కు.. రైట్ రైట్.. సంక్షేమ శాఖల పరిధిలో అత్యవసర కేటగిరీలో వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, స్టడీ సర్కిళ్లను చేర్చారు. వీటిల్లో డైట్ చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధ్యానత ఇస్తుంది. ఈ క్రమంలో బడ్జెట్ కేటాయింపుల్లో కోత పడటంతో డైట్ చార్జీల చెల్లింపులకు ఇబ్బందులు రాకుంగా జాగ్రత్త వహించాలని ఆయా శాఖలకు సూచనలు చేసింది. ఈ క్రమంలో డైట్ చెల్లింపుల్లో జాప్యం జరగకుండా వీటిని అవసరమైనంత త్వరితంగా పరిష్కరిస్తామని, నిధుల అవసరాలను ఎప్పటికప్పుడు వివరించాలని ఆదేశించింది. అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో నిర్వహణను కూడా ప్రాధాన్యత కేటగిరీలో చేర్చింది. తాజా బడ్జెట్లో గురుకుల సొసైటీలకు గతేడాది కంటే కేటాయింపులు తక్కువగా జరిగాయి. అయినప్పటికీ వీటి నిర్వహణకు సంబంధించి నిధులను గ్రీన్‌చానల్ పద్ధతిలో ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సుముఖత తెలిపింది. విద్యార్థుల ఉపకారవేతనాలకు కూడా ఇబ్బందులు లేకుండా సంక్షేమ శాఖల వారీగా అంచనాలను పంపితే త్రైమాసిక నిధుల్లో విడుదల చేయనున్నట్లు వివరించింది. సంక్షేమ శాఖల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే స్వయం ఉపాధి పథకాలు, రాయితీ పథకాలకు సంబం ధించి ఈ ఏడాది కేటాయింపులు లేవని స్పష్టమవుతోంది. అదేవిధంగా సివిల్ వర్క్స్‌కు కూడా ఈ వార్షికంలో అనుమతులు ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఈ కేటగిరీల్లో ఎలాంటి ప్రతిపాదనలు పంపడం లేదని తెలుస్తోంది. ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు రూపొం దించి వారంలోగా ప్రభుత్వానికి సమర్పిస్తే వాటిని పరిశీలించి ఆమోదిస్తుందని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. -
వలలో వరాల మూట
సాక్షి, అమరావతి బ్యూరో/నిజాంపట్నం: ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. సీఎం వైఎస్ జగన్ బడ్జెట్లో మత్స్యకారులకు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మత్స్యకారుల కుటుంబాల సంక్షేమం కోసం ఎన్నడూ లేని రీతిలో బడ్జెట్లో అధిక శాతం కేటాయింపులు చేశారు. దీని ద్వారా జిల్లాలో వేలాది మంది మత్స్యకార కుటుంబాలకు మేలు చేకూరనుంది. సీఎం నిర్ణయంతో జిల్లాలోని మత్స్యకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో 161 మత్స్యకార సొసైటీలు, 25,280 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వేట సమయంలో మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇంతకు మునుపు కేవలం లక్ష రూపాయలు పరిహారం మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని ప్రభుత్వం రూ.10 లక్షలు పెంచారు. నిజాంపట్నం, బాపట్ల, రేపల్లె మండలాల్లో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.4 వేలు నుంచి 10 వేలకు పెంచారు. దీని ద్వారా జిల్లాలో 7968 మంది మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారు. ఏడాదికి రూ.15 కోట్ల డీజిల్ రాయితీ జిల్లాలో మత్స్యకారులకు సంబంధించి పెద్ద బోట్లు 218 ఉన్నాయి. వీటికి నెలకు 3 వేల లీటర్ల డీజల్‌ను సబ్సిడీపై ఇస్తారు. 1874 చిన్న బోట్లకు నెలకు 300 లీటర్ల డీజల్‌ను సబ్సిడీపైన ఇవ్వనున్నారు. ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని రూ.6.03 పైసల నుంచి రూ.12.06 పైసలకు పెంచింది. గతంలో కేవలం పెద్ద బోట్లకు మాత్రమే సబ్సిడీపై డీజిల్ ఇచ్చేవారు. ప్రస్తుతం చిన్న బోట్లకూ సబ్సిడీపై డీజిల్ అందించనున్నారు. దీంతో ఏడాదికి దాదాపు రూ.15 కోట్ల డీజిల్ సబ్సిడీని మత్స్యకారులు పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రొయ్యల చెరువులు 8123 హెక్టార్లు, చేపల చెరువులు 500 హెక్టార్ల విస్తీర్ణంలో 5500 మంది రైతులు సాగు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ యూనిట్ రూ.6 చార్జీ ఉండేది. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీని యూనిట్‌కు రూ.2.70 పైసలకు తగ్గించారు. ప్రస్తుతం సీఎం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ చార్జీని యూనిట్‌కు రూ.1.50లకు తగ్గించారు. నిజాంపట్నం హార్బర్ అభివృద్ధి కోసం.. నిజాపట్నం హార్బర్ అభివృద్ధికి మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రత్యేకంగా కృషి చేశారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న నిజాంపట్నం హార్బర్‌కు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు. హార్బర్లో జెట్టీలను నిర్మించనున్నారు. ప్రస్తుతం బోట్లు నిలుపుకొనేందుకు స్థలం సరిపోవడం లేదు. హార్బర్ రేవు సముద్రంలో కలిసే చోట ఇసుక మేట వేయడంతో బోట్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. కేవలం సముద్రపు పోటు సమయంలో మాత్రమే బోట్లు హార్బర్‌కు వస్తున్నాయి. హార్బర్ పక్కనే ఉన్న రేవులో డ్రెడ్జింగ్ చేసిన ఇసుక దిబ్బలు తొలగించాలి. హార్బర్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలి. ప్రధాన రహదారిలో వీధి దీపాలు వెలగడం లేదు. మంచినీటి సదుపాయం లేదు. ప్రస్తుతం బడ్జెట్లో నిధుల కేటాయింపుతో ఈ సమస్య తీరనుంది. -
రాష్ట్రానికి మొండిచేయి చూపిన మోదీ ప్రభుత్వం
సాక్షి, విజయవాడ: మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో మొండిచేయి చూపిందని సీపీఎం నాయకులు విజయవాడ బీసెంట్ రోడ్లో తమ నిరసన తెలిపారు. ప్రజలకు మోదీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందంటూ కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలు, నూతన రాజధానికి నిధుల ప్రస్తావనే రాలేదన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రవేటీకరణ చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యులపై పెనుభారం మోపారని విమర్శించారు. జాతీయ సంపదను కార్పొరేట్ వ్యక్తుల చేతులకు కట్టబెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. -
ఆరోగ్యమంత్రం పఠించనున్న బడ్జెట్..!
సాక్షి, హైదరాబాద్: ఈసారి రాష్ట్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనను ఆ శాఖ సిద్ధం చేసింది. 2019–20 బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ ఆలోచిస్తుంది. ఆ మేరకు వైద్య ఆరోగ్య రంగానికి కేటాయింపులు కూడా భారీగా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతోంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కొలిక్కి వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గత బడ్జెట్లో ఈ రంగానికి రూ.7,370 కోట్లు కేటాయించింది. ఇవికాకుండా ఆరోగ్యశ్రీకి రూ.699 కోట్లు కేటాయించటంతోపాటు, ఆస్పత్రులను అభివృద్ధి చేయటంలో భాగంగా రూ. 600 కోట్లతో వైద్య పరికరాలను కొనుగోలు చేసింది. ఈసారి దానికి అదనంగా మరో రూ. మూడు వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని వైద్య ఆరోగ్యశాఖ కోరింది. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రధానంగా మూడు నాలుగు ప్రాధాన్యరంగాలను ప్రభుత్వం ఎంచుకొన్నట్టు సమాచారం. వీటిలో మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేయబోతోంది. అలాగే కేసీఆర్ కిట్ల పంపిణీకి కూడా నిధులు పెంచాలని యోచిస్తుంది. సర్కారీ దవాఖానాల్లో ప్రసవాల శాతం పెంచడం, రోగ నిర్ధారణ పరీక్షల కోసం డయాగ్నస్టిక్స్పై ఎక్కువ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. -
మున్సిపల్ ఆస్తుల తాకట్టుతో భారీ అప్పు
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూములను తాకట్టు పెట్టి వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్లు అప్పు చేసేందుకు ఇప్పటికే అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మునిసిపల్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి భారీగా అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. బడ్జెట్లో అప్పులు చేసేందుకు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలు అంగీకరించకపోవడంతో బడ్జెట్ బయట వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సర్కారే గ్యారెంటీ ఇస్తూ భారీ అప్పులకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. బడ్జెట్ బయట అప్పులకు ముగిసిన గ్యారెంటీ పరిమితి మున్సిపాలిటీల్లో నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ, అంతర్గత రహదారులు, పార్కులు, శ్మశానవాటికలు తదితర మౌలిక సదుపాయాల కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.11,340 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే బడ్జెట్ బయట అప్పులకు సర్కారు గ్యారెంటీ పరిమితి ఇప్పటికే పూర్తి కావటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.3.000 కోట్ల అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. మిగతా మొత్తం అప్పులకు తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో గ్యారెంటీ ఇవ్వనున్నట్లు మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి కరికాలవలవన్ సోమవారం జీవో జారీ చేశారు. మునిసిపాలిటీల ఆస్తులు తాకట్టు.. రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తున్నప్పటికీ మున్సిపాలిటీలే అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని జీవోలో స్పష్టం చేశారు. మున్సిపాల్టీల ఆస్తులను తాకట్టు పెట్టుకుని వాణిజ్య బ్యాంకులు అప్పు ఇవ్వనున్నాయి. ఫలితంగా భవిష్యత్‌లో మున్సిపాల్టీలు భారీ అప్పుల పాలు కానున్నాయి. దీంతో ఈ అప్పులు తీర్చడానికి పౌర సేవలపై భారీగా చార్జీలను వసూలు చేయనున్నాయి. దీనివల్ల మున్సిపాలిటీల్లో అన్నిరకాల చార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారానే లక్షన్నర కోట్ల రూపాయల మేర అప్పులు చేసింది. ఇప్పుడు బడ్జెట్ బయట వివిధ సంస్థల పేరుతో సర్కారు గ్యారెంటీ ఇస్తూ భారీగా అప్పులు చేయడాన్ని అధికార వర్గాలు తప్పుబడుతున్నాయి. ఈ గ్యారెంటీలు కూడా ప్రభుత్వ అప్పు కిందకే వస్తాయని, ఆ సంస్థలు తీర్చకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అసలు కంటే వడ్డీ భారమే అధికం.. మునిసిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టు వ్యయం రూ.12,600 కోట్లు కాగా ఇందులో 90 శాతం అంటే రూ.11,340 కోట్లను వాణిజ్య బ్యాంకుల నుంచి 8.23 శాతం వడ్డీపై అప్పు చేయనున్నారు. మిగతా పది శాతం అంటే రూ.1,260 కోట్లను ఈక్విటీ కింద ప్రభుత్వం సమకూర్చుతుంది. జీవోలో పేర్కొన్న మేరకు తీసుకునే రూ.11,340 కోట్ల అప్పును తొలి రెండు సంవత్సరాల్లో చెల్లించనవసరం లేదు. ఆ తరువాత నుంచి 13 ఏళ్లలో అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 8.23 శాతం వడ్డీ అంటే 13 ఏళ్లలో వడ్డీ కిందే రూ.12,265 కోట్లు కట్టాల్సి ఉంటుంది. అంటే అప్పు కన్నా వడ్డీ భారం ఎక్కువగా అవుతుండటం గమనార్హం. -
మహాసంకల్పం వ్యయం రూ.3.05 కోట్లు
-
బాబు గారి స్నానం చాలాకాస్ట్లీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటనలు, కార్యక్రమాల ఖర్చు చూస్తే అధికార యంత్రాంగానికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. కేవలం వేల రూపాయలు ఖర్చయ్యే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు రూ.లక్షలు వెచ్చిస్తుండడం గమనార్హం. ఏ కార్యక్రమాన్నెనా ఒక మెగా ఈవెంట్ తరహాలో నిర్వహించి, భారీగా ప్రచారం పొందాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని, అందుకే ఖర్చు విపరీతంగా పెరిగిపోతోందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. చంద్రబాబు కార్యక్రమాల ఖర్చు ఒక్కోసారి లక్షలు దాటిపోయి కోట్ల రూపాయలకు చేరుతోంది. ఒక్క గుంటూరు జిల్లాలోనే ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సదస్సులు తదితర కార్యక్రమాలకు ఏకంగా రూ.18,26,73,821 ఖర్చు చేశారు. ఈ బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కార్యక్రమాల ఏర్పాట్లు చేసిన ఏజెన్సీలు జిల్లా కలెక్టర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో సంబంధిత శాఖలు కూడా నిధులను విడుదల చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కార్యక్రమాల ఖర్చులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించడానికి తక్షణమే నిధులు విడుదల చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా చంద్రబాబు స్నానం ఏర్పాట్ల కోసం రూ.2,41,91,500 ఖర్చయిందని, ఈ బిల్లు 2016 నుంచి పెండింగ్‌లో ఉందని లేఖలో స్పష్టం చేశారు. కేవలం ఒక్క గుంటూరు జిల్లాలోనే చంద్రబాబు కార్యక్రమాల ఖర్చు ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇంకెంత వ్యయం చేశారో చూస్తే గుండె గుబిల్లుమనడం ఖాయం. -
చైనా పొగపెడుతున్నా..
సాక్షి, న్యూఢిల్లీ : సైనిక పాటవంపై పొరుగున చైనా విపరీతంగా వెచ్చిస్తున్న నేపథ్యంలో 2018-19 బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయించిన నిధులపై ఆర్మీ అసంతృప్తి వ్యక్తం చేసింది. డిఫెన్స్ కేటాయింపులపై సైనిక బలగాల వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ విస్మయం వ్యక్తం చేశారు. రక్షణ రంగ ఆధునీకరణకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని..పలు మేకిన్ ఇండియా ప్రాజెక్టులు నిధుల లేమితో కుంటుపడతాయని రక్షణరంగంపై పార్లమెంటరీ కమిటీకి ఆయన తేల్చిచెప్పారు. ఆధునీకరణకు కేటాయించిన రూ 21,388 కోట్లు ఎందుకూ సరిపోవని..ప్రస్తుత స్కీమ్‌లపైనే రూ 29,033 కోట్ల చెల్లింపులు జరపాల్సిఉందని శరత్ చంద్ పేర్కొన్నారు. ‘2018-19 బడ్జెట్ మా ఆశలను తుంచేసింది..ఇప్పటివరకూ సాధించిన పురోగతికి ఎదురుదెబ్బ తగిలింద’ని ఆయన పెదవివిరిచారు. ప్రస్తుత సైనిక పరికరాల ఆధునీకరణ, యుద్ధ వాహనాల కొనుగోలు నిధుల లభ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. సైనిక బడ్జెట్లో 63 శాతం వేతనాల చెల్లింపులకే సరిపోతుందని చెప్పుకొచ్చారు. సైనిక పరికరాల్లో కేవలం 8 శాతం అత్యాధునిక ఫీచర్లతో ఉందని, 68 శాతం పురాతనమైనవని చెప్పారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ రంగానికి గత ఏడాది కంటే 7.81 శాతం వృద్ధితో రూ 2.95 లక్షల కోట్లు కేటాయించారు. అయితే 1962 నుంచి జీడీపీలో రక్షణ బడ్జెట్ శాతం పరంగా ఇది అతితక్కువ కావడం గమనార్హం. -
ఈ లెక్కలెలా నమ్మాలి బాబూ!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాలతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశ్వసనీయత కనిపించడం లేదని.. ఇంత తప్పుల తడకలతో కూడిన బడ్జెట్‌ను ఎన్నడూ చూడలేదని అధికార వర్గాలు నోరెళ్లబెడుతున్నాయి. బడ్జెట్ గణాంకాలు కూడా వారి వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు రావాలని అందరం కోరుకుంటామని.. కానీ కేంద్రం నుంచి రాని నిధులు కూడా వస్తాయంటూ బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించడం ప్రజల్ని మోసం చేయడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు భర్తీ కింద కేవలం రూ.138 కోట్లు మాత్రమే వస్తాయని కేంద్రం ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేసిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా బడ్జెట్ పెట్టడానికి ముందు కూడా ముఖ్యమంత్రి ఈ విషయం చెప్పారని.. అయినా కూడా రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం నుంచి రూ.12,099 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ముందుగానే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. మన రాష్ట్రానికి ఏఏ నిధులు వస్తాయో అందులో స్పష్టం చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో రెవెన్యూ లోటు భర్తీ కింద కేటాయింపులు చేయకుండా.. రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేసుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమేనని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అలాగే రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు వస్తాయని ప్రతిపాదించడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. అలాగే వెనుకబడిన ఏడు జిల్లాలకు కేంద్ర బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో మాత్రం కేంద్రం నుంచి రూ.350 కోట్లు వస్తాయని ప్రతిపాదించడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రాని నిధులను కూడా వస్తాయంటూ భారీగా ప్రతిపాదించడాన్ని కూడా తప్పుపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.9000 కోట్లు వస్తాయని పేర్కొనడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. ఇలాంటి అంకెల వల్ల రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి ప్రయోజనం ఉండదని.. కేవలం ప్రచారం చేసుకోవడానికే పనికివస్తుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఆ రాష్ట్రాలకు చేయూతనివ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ముడిపడి ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు నిదర్శనంగా, సహకార సమాఖ్య స్ఫూర్తికి అద్దంపట్టేలా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ప్రీ బడ్జెట్, జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న ఈటల అనంతరం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు రూ.40 వేల కోట్ల ఖర్చుతో మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. రూ.85 వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తోందని పేర్కొన్నారు. భగీరథ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించడమే కాకుండా ఈ పథకానికి రూ.19,205 కోట్ల నిధులు ఇవ్వాలని, చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకానికి రూ.5 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కోరామని చెప్పారు. గొప్ప ఆవిష్కరణలతో పురోగతి సాధిస్తున్న రాష్ట్రాలకు సహకారం ఇచ్చేలా కేంద్రం బడ్జెట్ రూపొందించాలని సూచించారు. అలాగే విభజన చట్టంలో ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐరన్ ఓర్ పరిశ్రమ, గిరిజన, హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, తెలంగాణకు ప్రకటించిన ఎయిమ్స్‌కు నిధులు, వ్యవసాయ పెట్టుబడి పథకానికి నిధులివ్వాలని కోరామని వివరించారు. డ్రిప్ ఇరిగేషన్‌పై పన్ను తగ్గింపు.. జీఎస్టీ కౌన్సిల్ 25వ సమావేశంలో వివిధ వస్తువులపై పన్ను తగ్గింపునకు ఫిట్మెంట్ కమిటీ అంగీకరించింది. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న డ్రిప్ ఇరిగేషన్‌పై గతంలో విధించిన 18 శాతం పన్నును 12 శాతానికి తగ్గించింది. బీడీలపై పన్ను తగ్గింపును మాత్రం ఫిట్మెంట్ కమిటీ పట్టించుకోలేదు. ఈవే బిల్లుల విషయంలో పాత విధానాన్ని అమలు చేసుకొనే అధికారం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు కోరాయని ఈటల తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఐదు నెలలు పూర్తయిన నేపథ్యంలో పేద ప్రజలకు భారంగా పరిణమించిన వివిధ వస్తువులపై పన్ను స్లాబ్‌లను పున:సమీక్షించాలని కోరినట్లు చెప్పారు. పన్ను ఎగవేతలకు ఆస్కారం ఇవ్వకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని, అందుకు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలని సూచించామన్నారు. ఇక తెలంగాణకు జీఎస్టీఎన్ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్)లో కేంద్రం సభ్యత్వం ఇచ్చింది. అది కామన్‌సెన్స్‌కు సంబంధించిన విషయం.. హైదరాబాద్‌లో పన్ను చెల్లిస్తున్న 40 శాతం మంది ఆంధ్రా ప్రజలే అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఈటలను మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందింస్తూ.. ‘అమెరికాలో ఉన్న వారు అమెరికాలో పన్ను చెల్లిస్తారు. ఢిల్లీలో ఉన్న వారు ఢిల్లీలో కడతారు. హైదరాబాద్‌లో ఉన్న వారు హైదరాబాద్‌లోనే చెల్లిస్తారు. ఆయన వ్యాఖ్యలు కామన్ సెన్స్‌కు సంబంధించినవి. అంత ఉన్నత వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై మనం ఏం మాట్లాడతాం’అని వ్యాఖ్యానించారు. -
నిధులతోనే ‘స్వచ్ఛ’మైపోదు
‘స్వచ్ఛ భారత్’పై మోదీ న్యూఢిల్లీ: బడ్జెట్ కేటాయింపులతోనే ‘స్వచ్ఛ భారత్’ సాకారమవ్వదని, అది ప్రజా ఉద్యమంగా మారినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రోడ్లపైనున్న చెత్త ఫొటోలు తీసి ‘స్వచ్ఛ భారత్’ విఫల క్యాంపెయిన్ అంటున్న వారినుద్దేశించి మాట్లాడుతూ... కనీసం ఈ కార్యక్రమంవల్ల ప్రజల్లో పరిశుభ్రతపైఅవగాహన వచ్చిందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. రోడ్లపై చెత్త వేయడానికి తానూ వ్యతిరేకమేనన్నారు. స్వచ్ఛభారత్‌కు రెండేళ్లయిన సందర్భంగా శుక్రవారమిక్కడ జరిగిన సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. నాడు మహాత్మాగాంధీ ‘సత్యాగ్రహ’ స్ఫూర్తితో ‘స్వచ్ఛాగ్రహ’గా పలికిన మోదీ... పరిశుభ్రతను పరమాత్మతో పోల్చారు. మత సంబంధిత ప్రదేశాల్లోని వ్యర్థాలను కంపోస్టుగా మార్చాలని సూచించారు. చెత్తను రీసైక్లింగ్‌తో సంపద, ఉపాధి కల్పించే వనరుగా మలచవచ్చన్నారు. ఓ అంగన్వాడీ వర్కర్ తన పాత చీరను కర్చీఫ్లుగా చేసి చిన్నారులకు ఇచ్చారని, తద్వారా వారిలో పరిశుభ్రతపై అవగాహన పెంచారన్నారు. ‘ఈ సమావేశానికి వచ్చే క్రమంలో చాలామంది బస్సు సీట్లకు వేళ్లతో రంధ్రాలు చేసుంటారు. ప్రజాసంపదను సొంత ఆస్తిగా అనుకోవాలి’ అని అన్నారు. -
27న ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపు అంశాలను చర్చించేందుకు నీతి ఆయోగ్ ఈనెల 27న అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్, కేంద్ర ప్రాయోజిత పథకాలు, సుస్థిర అభివృద్ధి ప్రణాళికలు, ఎఫ్ఆర్బీఎం వంటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య హాజరవనున్నారు. ప్రతి 6 నెలలకోసారి ఈ సమావేశాన్ని నిర్వహించే ఆనవాయితీని నీతి ఆయోగ్ కొనసాగిస్తోంది. సీఎస్ రాజీవ్‌శర్మ గురువారం ఉదయాన్నే ఢిల్లీకి వెళ్లనున్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ భేటీలో ఆయన పాల్గొంటారు. -
సర్కారీ వైద్యమే సూపర్ అనాలి
సాక్షి, హైదరాబాద్: ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు...’ అని పాటలు పాడుకునే జనం కచ్చితంగా సర్కారు దవాఖానలో వైద్యం చేయించుకుంటాం.. అనే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో పూర్తి స్థాయిలో సంస్కరణలు తెస్తామని, ప్రభుత్వ ఆసుపత్రులకు మంచిపేరు తేవాల్సిన బాధ్యతను వైద్యులే తీసుకోవాలని సూచించారు. చాలినన్ని నిధులివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పీహెచ్‌సీలు మొదలు బోధనాసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో పరిస్థితి మెరుగుపడాలన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందన్న మాట ప్రజల నుంచి రావాలని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్, గైనకాలజీ, పీడియాట్రిక్ విభాగాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఖాళీగా ఉన్న డాక్టర్, ఇతర పోస్టులను వంద శాతం భర్తీ చేస్తామన్నారు. వైద్యశాలల్లో మందులు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. చీపురు కొనాలన్నా సెక్రటేరియట్ అనుమతి తీసుకోవాల్సిన దుస్థితిని తొలగిస్తామని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్‌పై సీఎం బుధవారం క్యాంపు కార్యాలయంలో పునఃసమీక్ష నిర్వహించారు. మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఎంపీ బి.వినోద్ కుమార్, సీఎస్ రాజీవ్ శర్మ, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖ, విద్యుత్ శాఖలపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల వారీగా బడ్జెట్.. ఆసుపత్రుల వారీగా బడ్జెట్ కేటాయించాలని సీఎం నిర్ణయించారు. కేటాయించిన డబ్బులను వినియోగించుకునే హక్కును సూపరింటెండెంట్లకు ఇవ్వాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి వరకు తన పరిధిలో పనులను తామే చేసుకునే అవకాశం ఇస్తామన్నారు. ‘‘ఆసుపత్రుల వారీగా నిర్వహణ నిధులు కేటాయించి, నెలవారీగా వాటిని విడుదల చేయాలి. ఆ డబ్బులతో బెడ్స్, ఆసుపత్రి ప్రాంగణం, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలి. మంచినీటి సౌకర్యం అందించాలి’’ అని సీఎం ఆదేశించారు. ప్రతినెలా 25లోగా ఈ నిర్వహణ వ్యయం ఆసుపత్రులకు అందేలా చూడాలని పేర్కొన్నారు. హాస్పిటళ్లలో కావాల్సిన పరికరాలన్నీ కొనివ్వాలని సీఎం నిర్ణయించారు. పరికరాల కొనుగోలుకు రాష్ట్రస్థాయిలో మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్, పబ్లిక్ హెల్త్ డెరైక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్లతో కూడిన కమిటీ రేట్లు ఖరారు చేసి, నాణ్యతను నిర్ణయించాలని ఆదేశించారు. మారుమూల ప్రాంత డాక్టర్లకు వెసులుబాటు ‘‘గ్రామీణ, ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో పని చేసే వారికి అదనపు నగదు ప్రోత్సాహకం ఇవ్వాలి. స్థానికంగా నివాసం ఉండాలనే నిబంధన సడలించి పక్క పట్టణంలో ఉండే అవకాశం కల్పించాలి. పీహెచ్సీలో వైద్యుల సంఖ్యను పెంచి షిప్ట్ సిస్టంలో పని చేయిం చాలి’’ అని కేసీఆర్ వివరించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను వైద్య విధాన పరిషత్‌లోకి తెచ్చి, పీహెచ్‌సీలను పబ్లిక్ హెల్త్ పరిధిలోనే ఉంచాలన్నారు. 108, 104 సేవలను మరింత పటిష్టం చేయాలని సూచించారు. పరీక్షల బాధ్యత సర్కారుదే: ప్రైవేటు డయాగ్నసిస్ సెంటర్లు ప్రజల్ని దోపిడీ చేస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకే ఆసుపత్రుల స్థాయిని బట్టి రోగ నిర్ధారణ పరీక్షలు జరగాలన్నారు. ఇందుకు ఆసుపత్రుల్లో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సహా పరికరాలన్నీ ఉంచాలన్నారు. మందులు ఉచితంగా అందజేయాలని, రాష్ట్రవ్యాప్తంగా విరివిగా జెనరిక్ మందుల దుకాణాలు ప్రారంభించాలని ఆదేశించారు. విద్యుత్తు సంస్థలపై పడే భారం భరిస్తాం రైతులు, ఇతర వర్గాలకు అందిస్తున్న విద్యుత్ సబ్సిడీల వల్ల విద్యుత్ సంస్థలపై పడే భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఎవరెన్ని ఒత్తిళ్లు తెచ్చినా ప్రైవేటు కంపెనీలకు విద్యుత్తు ఉత్పత్తి అప్పగించలేదని, జెన్కోకు మాత్రమే ఆ అవకాశం ఇచ్చామన్నారు. భవిష్యత్తులో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందని, అప్పుడు జెన్కో లాభాలు గడిస్తుందని, దాని ఫలితం ప్రజలకు దక్కుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కట్టాల్సిన విద్యుత్ బకాయిలు వంద శాతం వచ్చేలా చర్యలు తీసుకుంటామని, వాటికి ప్రీపెయిడ్ మీటర్లు పెడతామని చెప్పారు. ప్రజాపంపిణీలో అక్రమాలు అరికట్టాలి ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు, దుర్వినియోగం అరికట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. పేదలకు చేరాల్సిన సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయని, పౌర సరఫరాల శాఖలో అన్ని విభాగాలు కుమ్మ క్కవడం వల్లే ఇలా జరుగుతోందన్నారు. దుబారా తగ్గాలని, నిత్యావసరాల ధరలు పెరిగితే పౌరసరఫరాలశాఖ జోక్యం చేసుకుని ప్రజలకు సరుకులందించాలన్నారు. -
ఉపాధి హామీకి ఓకే..
2015-16 బడ్జెట్ కేటాయింపు రూ. 34,699 కోట్లు(12 శాతం పెంపు) 2014-15 బడ్జెట్ కేటాయింపు రూ. 31,000 కోట్లు(సవరించిన అంచనా) 2013-14 బడ్జెట్ కేటాయింపురూ. 33,000 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2005లో దీనికోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) కార్యరూపం దాల్చింది. 2006 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకాన్ని 2008 నాటికి దేశంలోని అన్ని జిల్లాలకూ విస్తరించారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఫ్లాగ్షిప్ పథకాల్లో కీలకంగా నిలిచిన ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. అయితే, భారీగా నిధులను వెచ్చిస్తున్నప్పటికీ వనరుల కల్పనలో పెద్దగా ప్రభావం చూపడం లేదన్నది ప్రధాన విమర్శ. అయితే, మోదీ సర్కారు దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పెంపు, ఆర్థికాభివృద్ధికి జత చేస్తామని చెబుతోంది. క్రీడా ప్రాంగణాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం వంటివి కూడా ఈ పథకంలోకి చేర్చింది. సబ్సిడీలకు ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ)ని అమలు చేసేందుకు ఎంపిక చేసిన 51 జిల్లాలకు గాను 46 జిల్లాల్లో ఉపాధి హామీ వేతనాల చెల్లింపును ఆధార్ కార్డులతో లింక్ చేశారు. అనుకున్న విధంగా ఖజానాకు నిధులు సమకూరితే మరో రూ.5,000 కోట్లను అదనంగా కేటాయిస్తామని కూడా జైట్లీ ప్రకటించారు. గ్రామీణ పేదల్లో ఏ ఒక్కరూ ఉపాధి లేకుండా ఉండకూడదన్నదే తమ ధ్యేయమని చెప్పారు. యూపీఏ పథకాలను మోదీ సర్కారు నీరుగారుస్తుందన్న విమర్శలను, ముఖ్యంగా ఈ పథకాన్ని నిలిపేస్తారన్న ఊహాగానాలను పక్కకునెడుతూ ఉపాధి హామీకి దండిగా నిధులను కేటాయించడం చెప్పుకోదగ్గ విషయం.