దాని ఆధారంగానే బడ్జెట్ కేటాయింపులు నాణ్యత, ప్రమాణాలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీలలో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం వాటి పనితీరుపై సూచనలు రాబోతున్నాయి. దాని ఆధారంగానే నిధులు కేటాయించే అంశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. తమ నిధులతో కొనసాగే వర్సిటీల్లో ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. పనితీరు, నాణ్యతా ప్రమాణాల్లో పాయిం ట్ల విధానం ప్రవేశపెట్టి వాటి ఆధారంగా సూచికలు ఏర్పాటుచేస్తారు.
మరోవైపు ఉన్నత విద్యామండలి కూడా వర్సిటీలపై నియంత్రణ, నాణ్యతా ప్రమాణాల పెంపునకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. నేషనల్ అసేస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్), నేషనల్ ఎడ్యుకేషన్ బోర్డు ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ విభాగాల మార్గదర్శకాలు, అవి వివిధ కాలేజీలు, వర్సిటీలకు ఇస్తున్న గుర్తింపునకు ప్రాతిపదికగా తీసుకుంటున్న అంశాలపై మండలి అధ్యయనం చేస్తోంది. ఈ అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. గత ఏడాది బడ్జెట్ ఎంత? ఈసారి అంతకంటే ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలంటే నాణ్యతా ప్రమాణాల్లో సదరు యూనివర్సిటీ ఏ స్థాయిలో ఉందన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలనే నిబంధనలు విధించాలని భావిస్తోంది.
వర్సిటీలకు పనితీరు సూచికలు!
Published Fri, Aug 22 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM
Advertisement
Advertisement