కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15 శాతం నిధులు మైనారీ్టలకే
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో మోదీ ధ్వజం
నాసిక్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 15 శాతం నిధులను మైనారీ్టలకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులను తాము అనుమతించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. అలాగే విద్య, ఉద్యోగాల్లో మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని స్పష్టంచేశారు.
2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్‌లో 15 శాతం నిధులను వారికి ప్రీతిపాత్రమైన ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టడానికి ప్రయతి్నంచిందని చెప్పారు. అప్పట్లో బీజేపీ గట్టిగా ప్రతిఘటించడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తాను కాంగ్రెస్ ప్రతిపాదనను వ్యతిరేకించానని తెలిపారు.
కానీ, మైనారీ్టలకు 15 శాతం నిధుల ఆలోచనను కాంగ్రెస్ ఇప్పటికీ విరమించుకోలేదని, ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయాలని యోచిస్తోందని విమర్శించారు. బుధవారం మహారాష్ట్రలోని పింపాల్‌గావ్ బస్వంత్, థానే పట్టణాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు అనేది చాలా ప్రమాదకరమైన ఆలోచన అని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ మత ఆధారంగా దేశాన్ని ఇప్పటికే ఒకసారి విభజించిందని, మరో సారి అలాంటి పథకమే రచిస్తోందని ధ్వజమెత్తారు. తాము మతాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు కేవలం ఎంపీలను ఎన్నుకోవడం కోసం కాదని అన్నారు. దేశం కోసం బలమైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం గల ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి జరుగుతున్నాయని ఉద్ఘాటించారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని వివరించారు. గత పదేళ్లలో తన పని తీరును ప్రజలు గమనించారని. వికసిత్ భారత్ కోసం తనను మూడోసారి గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment