
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిరాశ వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఢిల్లీపై సవతి తల్లి ప్రేమ చూపించారంటూ విమర్శించారు. ఢిల్లీ ప్రజలు బడ్జెట్‌పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని కానీ బీజేపీ ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఢిల్లీకి ఎలాంటి కేటాయింపులు చేయలేదని.. అలాంటపుడు బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటూ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment