న్యూఢిల్లీ: మెట్రోపాలిటన్ సిటీల్లో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరగిపోయింది. కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేని స్థితిలో ఈ నగరాల ప్రజలు బతుకుతున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ అయితే గ్యాస్ చాంబర్‌లా మారిపోయిందంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టు అనేక సార్లు కామెంట్ చేసింది. వాయు కాలుష్యం దెబ్బకి స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాయు కాలుష్యాన్ని తగ్గింఏందుకు సరి బేసి లాంటి విధానాలతో రోడ్లపైకి వస్తున్న వాహనాలను నియంత్రిస్తున్నారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్)
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కాలుష్య నివారణ, స్వచ్ఛమైన గాలి కోసం బడ్జెట్‌లో ఒక పథకాన్ని ప్రకటించారు. మెట్రోపాలిటన్ నగరాల్లో 'క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్' కోసం రూ.4,400 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. పెద్ద పెద్ద నగరాల్లో కాలుష్యం కోరలు చాచడం వల్ల.. ప్రజలు స్వచ్చమైన గాలి పీల్చుకోలేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ నిధులను అందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కల పెంపుతో పాటు కొత్త విధానాల రూపకల్పనకు ప్రోత్సాహం అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment