Child Rights Commission
-
దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు
మంగళగిరి: రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ప్రకటించిన దసరా పండుగ సెలవుల నిబంధనలను అన్ని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు తప్పని సరిగా పాటించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ కేసలి అప్పారావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరిలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కార్యాలయంలో మాట్లాడారు. ప్రభుత్వ నియమ నిబంధనలును కొన్ని ప్రైవేటు, కార్పోరెట్ పాఠశాలలు పాటించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, మరికొన్ని విద్యా సంస్థలు మొబైల్ ఫోన్ ద్వారా హోమ్ వర్కులు చేయమని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడైనా పాఠశాలలు ప్రత్యేక తరగతులు లేదా ఆన్లైన్ తరగతులు లేదా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే apscpcr2018@gmail.com మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మండల, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోంది: సీఎం జగన్ -
హెచ్చరిక..: ధర్నాలు, నిరసనలకు బాలలను తీసుకెళ్తే ఉపేక్షించం
సాక్షి, అమరావతి: బాలలను రాజకీయ పార్టీల ప్రచారాలకు, ధర్నాలు, నిరసనలకు తీసుకెళ్తే ఉపేక్షించబోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ హెచ్చరించింది. అందుకు బాధ్యులైన నిర్వాహకులపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అవినీతి కేసులో అరెస్టు అయిన చంద్రబాబుకు మద్దతుగా నారా భువనేశ్వరి నిర్వహించిన సభలో ఒక బాలుడితో మాట్లాడించిన అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. టీడీపీ సభలో సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసేలా ఆ పిల్లాడిని ప్రేరేపించడం సరికాదని అభిప్రాయ పడింది. మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు సభ్యులు జంగం రాజేంద్రప్రసాద్, త్రిపర్ణ ఆదిలక్ష్మీ, ఎం.లక్ష్మీదేవితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ కేసలి అప్పారావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కొందరు రాజకీయ నాయకులు చిన్నారులను తమ రాజకీయాలకు వాడుకోవడంపై తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. బాలలను రాజకీయ ప్రచారాలకు, ప్రసంగాలకు, వేడుకలకు, ధర్నాలకు, ఊరేగింపులకు ఉపయోగిస్తే వారికి బాలల హక్కుల కమిషన్ నుంచి సంజాయిషీ నోటీసులు జారీ చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అసభ్యకర పదజాలంతో, అసహ్యకర వ్యాఖ్యలతో ప్రసంగాలు చేయించటం ద్వారా బాలల మనస్సులో విష బీజాలు నాటడం సరికాదన్నారు. ఇటువంటి చర్యల వల్ల పిల్లలు చదువుపై ఆసక్తి సన్నగిల్లి పెడతోవ పట్టే ప్రమాదం ఉందన్నారు. బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం 18 ఏళ్లలోపు వారిని చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు, సదస్సులు, సమావేశాల్లో భాగస్వామ్యం చేయకూడదని స్పష్టం చేశారు. బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడే వారిపై సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బాల్య వివాహాలు చేసేవారిపై కేసులు పెట్టండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల్య వివాహాలు చేసేవారిపై కేసులు పెట్టాలని జిల్లా ఎస్పీలను ఏపీ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రాన్ని బాల్య వివాహాలు రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ఇటీవల కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఆ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా బాల్య వివాహాలు జరిపిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న బాలలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడంతో వారి ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు దేశాభివృద్ధికి దోహదం చేసే యువశక్తి నిర్వీర్యమైపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. బాల్య వివాహాల వల్ల బాలల భవిష్యత్ అంధకారంలోకి నెట్టివేయబడుతుందని, మాతా, శిశు మరణాల రేటు పెరిగే ప్రమాదం ఉందన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. -
దళిత చిన్నారి మృతి వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!
జైపూర్: నీళ్ల కుండను తాకాడని ఓ దళిత చిన్నారిని టీచర్ దండించడం.. ఆ దెబ్బలకు ఆ చిన్నారి మరణించడం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో, మీడియాలో విస్తృతంగా చర్చ కూడా నడిచింది. అయితే.. ఈ ఘటనపై శుక్రవారం షాకింగ్ రిపోర్ట్‌ను సమర్పించింది రాజస్థాన్ చైల్డ్ ప్యానెల్. అసలు ఈ వ్యవహారంలో దళిత కోణం ప్రస్తావనే లేదని తేల్చేసింది. జలోర్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడిని.. భోజన సమయంలో మంచి నీళ్ల కుండ తాకాడంటూ అగ్రకులానికి చెందిన ఒక టీచర్ తీవ్రంగా కొట్టాడని, ఆ దెబ్బలకు ఆ చిన్నారి మరణించాడని, దళితుడు కావడంతోనే అతనిపై అలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడన్నది ఆ ఘటనపై మీడియాలో వచ్చిన కథనం. అయితే.. డ్రాయింగ్ బుక్ విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ విషయం తనదాకా రావడంతో.. ఆ ఇద్దరు విద్యార్థులను టీచర్ విపరీతంగా కొట్టాడు. అందులో ఒక చిన్నారే బాధితుడు. కంటికి, చెవికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆ తొమ్మిదేళ చిన్నారికి చికిత్స అందించారు. ఆ సమయంలోనే మృతి చెందాడు. ఇదీ.. రాజస్థాన్ బాలల హక్కుల సంఘం.. రాజస్థాన్ ప్రభుత్వానికి, విద్యాశాఖకు ఇచ్చిన నివేదిక సారాంశం. ఈ మేరకు స్కూల్‌ను సందర్శించిన చైల్డ్ ప్యానెల్ సభ్యులు.. బాధిత చిన్నారి తోటి విద్యార్థులను, టీచర్లను ఆరా తీసినట్లు తెలుస్తోంది. అంతేకాదు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జిల్లా పరిపాలనాధికారి అందించిన వివరాల ప్రకారం ఆ స్కూల్లో కుండనే లేదని, తాగు నీటి కోసం ఓ ట్యాంకర్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. బాధితుడి సోదరుల వాదన అయితే బాధితుడి సోదరులు ఇద్దరూ నరేష్ కుమార్, నాపారాంలు అదే స్కూల్లో చదువుతున్నారు. వాళ్లు మాత్రం తమ తమ్ముడు మధ్యాహ్న భోజన సమయంలో మంచి నీటి కుండ నుంచి నీళ్లు తీసుకున్నందుకే టీచర్ చితకబాదాడంటూ చెప్తున్నారు. వీళ్ల స్టేట్‌మెంట్‌నూ కూడా నివేదికలో జత చేసింది చైల్డ్ ప్యానెల్. అంతేకాదు.. ఒకవేళ స్కూల్ అనుమతుల్ని విద్యాశాఖ గనుక రద్దు చేస్తే పిల్లలను మరో స్కూల్లో అడ్మిషన్లకు అనుమతించాలంటూ సూచించింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ పార్టీని తీరును విమర్శిస్తూ.. దళిత సంఘాలు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నాయి. బీజేపీ సైతం ఈ ఘటనను ఆధారంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. ఇదీ చదవండి: చిన్నారి మృతి కేసు.. అధికార కాంగ్రెస్‌లో ముసలం -
రేప్‌లు జరుగుతున్నది స్త్రీల పొట్టిబట్టల వల్ల కాదు
‘మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్ (రిప్డ్ జీన్స్) ధరించిన ఆడవాళ్లు తమ పిల్లలకు మంచి ఉదాహరణగా నిలువలేరు’... ఇది ఉత్తరాఖండ్ సి.ఎం తిరత్‌సింగ్ రావత్ కామెంట్. వెంటనే స్త్రీలు ప్రతిస్పందించారు. ‘హాష్స్టాగ్రిప్డ్జీన్స్’ మూవ్‌మెంట్‌ను ట్విటర్లో వరదలా వెల్లువెత్తించారు. అందరూ తమ రిప్డ్ జీన్స్‌తో ట్విటర్లో ఫొటోలు పెట్టి ‘ఏమంటారు సి.ఎం గారూ’ అని అడగడమే. మగవాళ్లు ఎందుచేత తమకు స్త్రీల బట్టల మీద వ్యాఖ్యానించే ఆధిపత్యం ఉందని అనుకుంటారో అని వీరు ప్రశ్నిస్తున్నారు. కంగనా రనౌత్ ఇదే సమయంలో ఒక కామెంట్ చేసింది. కుర్రకారును ఇంకో రకంగా హెచ్చరించింది. ఈ మొత్తం ట్రెండ్‌పై కథనం. మంగళవారం (మార్చి 16) డెహ్రాడూన్‌లో బాలల హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సి.ఎం. పాల్గొని మాట్లాడారు. బాలల హక్కుల గురించిన కార్యక్రమం కాబట్టి బాలల విషయంలో తల్లిదండ్రులకు హితవు చెప్పాలనుకున్నారు. అయితే ఆ హితవు స్త్రీల దుస్తులకు సంబంధించిందిగా మారి వ్యతిరేకత ఎదురైంది. ‘నేనొకసారి ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్న మహిళ ఇద్దరు పిల్లలతో ప్రయాణిస్తోంది. ఆమె తన మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్ ధరించింది. ఆమె తన పిల్లలకు ఈ ‘కత్తిరింపుల సంస్కృతి’ ద్వారా ఏం చెప్పదలుచుకుంది. ఇటువంటి వారు తమ పిల్లలకు మంచి ఉదాహరణగా నిలువలేరు’ అన్నారు. ఉత్తరాఖండ్ సి.ఎం తిరత్‌సింగ్ రావత్ ‘పాశ్చాత్యులు మనల్ని చూసి యోగా చేస్తున్నారు. ఒంటి నిండా బట్టకప్పుకుంటున్నారు. మనం నగ్నత్వం వైపు వెళుతున్నాం’ అని కూడా ఆయన అన్నారు. వెంటనే అక్కడి ప్రతిపక్షం వారు దీనిని ఖండించారు. ‘మహిళలను అవమానించే ఈ వ్యాఖ్య చేసినందుకు సి.ఎం క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. మరోవైపు స్త్రీల దుస్తులపై గతంలో వచ్చిన పురుషాధిపత్య వ్యాఖ్యల వంటివే ఇవి కూడా అని వెంటనే స్త్రీల వైపు నుంచి వ్యతిరేక స్పందన మొదలైపోయింది. క్షణాల్లో ‘హ్యాష్స్టాగ్రిప్డ్జీన్స్ట్విటర్’ అంటూ ట్విటర్లో సెలబ్రిటీలు, సాధారణ స్త్రీలు రిప్డ్ జీన్స్‌లో ఉన్న తమ ఫొటోలను పోస్ట్ చేశారు. వీరిలో యువత ఉంది. తల్లులూ ఉన్నారు. ‘దేశంలో రేప్‌లు జరుగుతున్నది స్త్రీల పొట్టిబట్టల వల్ల కాదు. స్త్రీ ద్వేష వ్యాఖ్యలు చేసే పురుషుల వల్ల’ అని వారు వ్యాఖ్యలు రాశారు. ‘సోచ్ బద్లో దేశ్ బద్లేగా’ (ఆలోచనాధోరణి మారిస్తే దేశం మారుతుంది) అని కూడా వారు రాశారు. ‘బిజెపి ఇంకో 50 ఏళ్లు పరిపాలించవచ్చు. కాని రిప్డ్ జీన్స్ ఎప్పటికీ ఉంటాయి’ అని ఒకరు రాశారు. ఒకామె ‘జీన్స్ సంగతి వదిలిపెట్టండి. నేను రిప్డ్ స్కర్ట్ వేసుకుంటాను’ అని పెట్టింది. ఇంకా ఎన్నో వ్యాఖ్యలు. పదవిలోకి వచ్చిన పదిరోజుల్లోనే సి.ఎం తిరత్‌సింగ్ ఈ వివాదంలో పడ్డారు. రిప్డ్ జీన్స్‌తో ఫొటోలు పెట్టినవారిలో అమితాబ్ మనవరాలు నవేలి నందా కూడా ఉంది. అయితే ఆ తర్వాత ఆమె ఆ పోస్ట్ తొలగించింది. ఆమె అమ్మమ్మ జయభాదురి ‘ఇలాంటి వ్యాఖ్యలు ఒక సి.ఎంకు తగవు. అధికారంలో ఉన్నవారు ఇలా మాట్లాడటం వల్ల స్త్రీల మీద నేరాలకు ఊతం దొరుకుతుంది’ అని విమర్శించారు. ఎందుకు ఈ ట్రెండ్ రిప్డ్ జీన్స్ 1870లలోనే తయారైనా 1970లలో ఇవి ఫ్యాషన్ అయ్యాయి. వ్యవస్థ మీద కోపం, నిదర్శన ప్రదర్శించడానికి నాటి కుర్రకారు తమ జీన్స్ ప్యాంట్లను చించి తొడుక్కునేవారు. గాయని మడోనా ఈ ధోరణిని విస్తృతం చేసింది. ఆమె అభిమానులు ఆ ఫ్యాషన్ ఫాలో అయ్యారు. ఆ తర్వాత జీన్స్ కంపెనీలు చిరిగిన జీన్స్‌ను తయారు చేసి మార్కెట్ చేయడం మొదలెట్టాయి. భారతదేశంలో కొత్తల్లో ఇవి అవహేళనకు గురైనా ‘ఎయిర్పోర్ట్ ఫ్యాషన్’గా గుర్తింపు పొందాయి. ప్రయాణాలు చేసే వారు వీటిని ధరించేవారు. ఇవాళ ఈ జీన్స్ ఇతర అన్ని జీన్స్ వలే సర్వసాధారణం. కంగనా ప్రమేయం ఒకవైపు హ్యాష్స్టాగ్ రిప్డ్జీన్స్ ట్రెండ్ నడుస్తుంటే మరోవైపు ఇవే జీన్స్ గురించి నటి కంగనా రనౌత్ వాటితో ఉన్న తన ఫొటోలు ట్విటర్లో పెట్టి కామెంట్ రాసింది. ‘రిప్డ్ జీన్స్ వేసుకున్నా మీరు అవి మీ కూల్‌నెస్‌ను స్టయిల్‌ను తెలిపేలా ఉన్నవే వేసుకోండి. అంతేతప్ప (అమ్మాయిలైనా అబ్బాయిలైనా) దిక్కులేని బిచ్చగాళ్ల వలే కనిపించే రిప్డ్జీన్స్ వేసుకోకండి’ అని చెప్పింది. ఈ కామెంట్స్‌కు ప్రతిస్పందన ఇంకా మొదలు కాలేదు.దేశ సంస్కృతి సభ్యత స్త్రీల బట్టల్లోనే ఉంది అని పురుషులు మాట్లాడుతున్న ప్రతిసారీ స్త్రీల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను చూసైనా పురుషులు తమ వ్యాఖ్యల్లోని అసంబద్ధతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల కోసం ఎదురు చూడక తప్పదు. -
దేశానికే ఏపీ ఆదర్శం అంటూ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ రాష్ట్ర ప్రజలకు విశేష సేవలందిస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి జరుగుతోందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సభ్యుడు డాక్టర్ ఆర్జీ ఆనంద్ కితాబిచ్చారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన మంగళవారం పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని డీజీపీతో చర్చించారు. ‘బాలల హక్కులు, రక్షణ, అక్రమ రవాణా నివారణ’ అంశాలపై డీజీపీ సవాంగ్‌తో కలిసి వెబినార్ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ ఆఫీసర్లు, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు, దిశ పోలీస్ స్టేషన్ల అధికారులతో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో మహిళలు, బాలల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇంత మంచి కార్యక్రమాల రూపకల్పన చేస్తున్న సీఎం జగన్, డీజీపీ సవాంగ్ అభినందనీయులన్నారు. ‘దిశ’ పనితీరు అద్భుతం ఆపరేషన్ ముస్కాన్ నిరంతర ప్రక్రియతో బాలబాలికలకు విముక్తి కల్పించడం, పునరావాసం కల్పించడంలో ఏపీ పోలీస్ శాఖ దేశంలోనే ముందుందన్నారు. మహిళల రక్షణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో ఏపీ పోలీసుల పనితీరు దేశానికే రోల్ మోడల్ అన్నారు. దిశ చట్టం మహిళల రక్షణకు ఉపయోగపడుతున్న తీరు తెలుసుకుని ఆశ్చర్యపోయానన్నారు. కోవిడ్ సమయంలో పోలీసులు సమర్థంగా పనిచేసి బాలల అక్రమ రవాణాను అడ్డుకున్నారని తెలుసుకున్నానన్నారు. పిల్లలకు మానసిక, సాంఘిక సమస్యల గురించి ఏపీ పోలీస్ చేపట్టిన సైకో సోషల్ కౌన్సెలింగ్ సెంటర్ పనితీరు అద్భుతమన్నారు. పిల్లలకు కౌన్సెలింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 18001212830 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉందన్నారు. చదవండి: (అమరావతి అందరిదీ కాకుంటే ఎలా?) సచివాలయ వ్యవస్థ భేష్ గుంటూరు వెస్ట్: రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆర్.జి.ఆనంద్ కొనియాడారు. గుంటూరు కలెక్టరేట్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా చిన్నారులకు చక్కని పోషకాహారం లభిస్తోందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని ప్రశంసించారు. గుంటూరులో జాతీయ బాలల హక్కుల కమిషన్ బెంచ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. -
అచ్యుతరావుకు కరోనా సోకిందిలా...
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ మహమ్మారికి బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు బలికావడం ఆయన కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. నలుగురు అన్నదమ్ములతో కలిసి ఉంటూ ఉమ్మడి కుటుంబాలకు ఆదర్శంగా నిలుస్తోన్న అచ్యుతరావు ఫ్యామిలీలో తొలుత అతడి కుమారుడు కోవిడ్ బారిన పడ్డారు. సమీపంలోనే నివాసం ఉండే అతను ప్రతిరోజూ రాత్రి డిన్నర్ సమయంలో ఉమ్మడి కుటుంబంలో ఉండే అచ్యుతరావు నివాసానికి వచ్చి భోజనం చేసి వెళ్లేవాడు. కుమారుడు జూన్ 15న కోవిడ్ బారిన పడినా..తొలుత ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఆ తర్వాత స్వల్ప లక్షణాలు కనిపించడంతో హోం ఐసోలేషన్‌లో ఉండి పూర్తిగా కోలుకున్నారు. (మూగబోయిన ‘బాలల’ గొంతు) అచ్యుతరావుకు జూలై 13న కోవిడ్ నిర్ధారణ అయ్యింది. అస్తమాతో బాధపడుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో చికిత్స కోసం మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. పది రోజులు కోవిడ్‌తో పోరాడి బుధవారం తనువు చాలించారు. అతని సోదరుడు సైతం కరోనా బారిన పడి అదే ఆస్పత్రిలో రెండురోజులపాటు చికిత్సపొంది ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. అయితే చింతలకుంటలో నివాసం ఉంటున్న అచ్యుతరావు కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు, వారి భార్యలు, పిల్లలు మొత్తంగా పది మంది ఉంటారు. వీరంతా కోవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం అందరూ హోం క్వారంటైన్లో ఉండి కోవిడ్‌ను జయించడం విశేషం. కొందరిలో కనిపించని లక్షణాలు.. కోవిడ్ మహమ్మారి చాపకింద నీరులా ప్రవేశించి పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. ఆయా కుటుంబాల్లో యువకులు, ఆరోగ్యవంతులకు కోవిడ్ సోకినా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో వారంతా ఇతర కుటుంబ సభ్యులతో కలిసే ఉంటున్నారు. టిఫిన్, భోజనం, డిన్నర్ కలిసే చేస్తున్నారు. తద్వారా ఇంట్లో ఉన్న అందరూ కరోనా బారినపడుతున్నారు. ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధులు, అస్తమా తదితర శ్వాసకోశ వ్యాధులున్నవారికి కోవిడ్ ప్రాణాంతకంగా మారుతోంది. మరోవైపు కోవిడ్‌పై అన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న సమాచారంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న కోవిడ్ రోగులు సడెన్ కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు విడుస్తుండటం గమనార్హం. (వాడిన మాస్క్‌లను ఎలా పడేయాలంటే..) కలిసి భోజనం చేయడంతో... ప్రతిరోజూ అచ్యుతరావు కుటుంబ సభ్యులంతా రాత్రి భోజనం కలిసే చేస్తారు. ఈ సమయంలో తొలుత అతని కుమారుడు కోవిడ్ బారినపడటం, అతనికి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో రోజూ అందరూ కలిసి భోజనానికి కూర్చోవడంతో కోవిడ్ ఆ కుటుంబం మొత్తానికి సోకినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోవిడ్ లక్షణాలున్నవారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని..హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా కోవిడ్‌ను జయించవచ్చని చెబుతున్నారు. -
జిల్లాకు చేరుకున్న కమిషన్ సభ్యులు
సాక్షి, విజయనగరం: జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బృందం మంగళవారం జిల్లాకు చేరుకుంది. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పరేష్ షా ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృందం చేపట్టిన మూడు రోజుల పర్యటన ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలుత జిల్లా కేంద్ర ఆసుపత్రిని బృంద సభ్యులు సందర్శించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. ఇక పర్యటన చివరి రోజైన 8వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో... బాలల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించనున్నారు. ఈ బృందంలో ఇతర సభ్యులుగా మానసిక నిపుణురాలు ఊర్వశి, కల్పన, సుకన్య తదితరులు ఉన్నారు. -
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య
హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడి గట్టి, హత్య చేశాడో కామాంధుడు. హోలీ సంబరాల్లో ఉన్న చిన్నారిని నమ్మించి ఎత్తుకెళ్లి ఈ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత అత్యంత క్రూరంగా హత్య చేశాడు. దారుణమైన ఈ ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిన్నారి ప్రవళ్లిక మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 గంటల వ్యవధిలోనే ఛేదించారు. శుక్రవారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ పద్మజారెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. చిన్నారి ఇంటి పక్కనే ఉండే ధర్మేంద్ర, అతని స్నేహితులు రోషన్, రాజేష్‌కుమార్, సురేంద్ర, సుబ్రహ్మణ్యం కలసి హోలీ ఆటలో మునిగారు. అప్పటికే మద్యం సేవించిన వీరితో ఓ బాబు, చిన్నారి ప్రవళ్లిక సైతం ఆడుకున్నారు. చిన్నారి అదృశ్యం కావడంపై ధర్మేంద్రను పోలీసులు వివరాలు అడిగారు. ఈ క్రమంలో రాజేష్‌కుమార్ కూడా కనిపించడంలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్‌కు 20 ఫీట్ల దూరంలో ఓ బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అదృశ్యమైన చిన్నారి తల్లిదండ్రులకు మృతదేహాన్ని చూపించగా అది తమ బిడ్డదే అని గుర్తించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన డీసీపీ పద్మజారెడ్డి నిందితుడు తప్పించుకోకుండా 3 బృందాలను నియమించారు. ఈ క్రమంలో బొల్లారం సమీపంలోని కృష్ణనగర్‌లో ఓ గది ఉన్న రాజేష్‌ను శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నమ్మించి ఎత్తుకెళ్లాడు.. స్నేహితులతో హోలీ సంబరాల్లో ఉన్న రాజేష్‌కుమార్ వారితో ఉన్న బాబును తీసుకెళ్లి రంగులు కొనిచ్చాడు. చిన్నారి ప్రవళ్లికను ఇలాగే నమ్మించి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎత్తుకెళ్లాడు. సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఉన్న నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. భయంతో బోరున విలపిస్తున్న చిన్నారి మెడపై ఇనుప రాడ్డుతో కోశాడు. లైంగిక దాడి, మెడపై గాటుతో తీవ్ర రక్తస్రావం జరిగి చిన్నారి అక్కడే మృతి చెందింది. అనంతరం రాజేష్‌కుమార్ ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు. బిహార్‌కు చెందిన రాజేష్‌కుమార్ 2 నెలల క్రితమే ఇక్కడికి వచ్చాడు. బొల్లారంలోని నందిని టెంట్ హౌస్‌లో పని చేస్తూ వాల్మీకి నగర్లో ఉంటున్నాడు. గురువారం సాయంత్రం గదికి వచ్చిన రాజేష్‌కుమార్ శుక్రవారం బిహార్ పారిపోవాలని అనుకున్నాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఆలోపే చిక్కాడు. మీడియా సమావేశంలో ఏసీపీ నర్సింహరావు, సీఐ మట్టయ్య, డీఐ ఎన్.శంకర్, ఎస్సై వరప్రసాద్ పాల్గొన్నారు. మరణశిక్ష విధించాలి: అచ్యుతరావు అల్వాల్ పీఎస్ పరిధిలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి, దారుణహత్య ఘటనపై స్పందించిన బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు దుండగుడికి మరణశిక్ష విధించాలన్నారు. నగరం, పరిసరాల్లో ఆడ పిల్లలపై జరుగుతున్న దారుణాలకు ఈ ఉదంతం ఓ పరాకాష్ట అని అన్నారు. కేవలం ఫిబ్రవరి, మార్చి.. 2 నెలల వ్యవధిలో 42 మంది బాలికలపై లైంగిక దాడులు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అధికారులు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. -
రాయితో రుద్దితే తెల్లగా మారతాడని..
భోపాల్ : తెలుపు అంటే చాలామందికి విపరీతమైన పిచ్చి. ఈ పిచ్చి బాగా ముదిరితే ఎలా ఉంటుందో ఈ మహిళని చూస్తే అర్థం అవుతుంది. రాయితో రుద్దితే తెల్లగా మారతారని నమ్మి తన అయిదేళ్ల కొడుకుని తీవ్రంగా హింసించింది. చివరకు బాలల సంరక్షణ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి, బాలుడిని కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం... నిషత్‌పూర్ ప్రాంతంలో నివాసం ఉండే సుధా తివారి పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఆమె భర్త ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కాంట్రక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీరికి పిల్లలు లేకపోవడంతో సుధా తివారి ఏడాదిన్నర క్రితం ఉత్తరాఖండ్‌లోని ‘మాతృచ్ఛాయ’ ఆశ్రమం నుంచి ఒక బాలుడిని దత్తత తీసుకుంది. బాలుడు నల్లగా ఉండటంతో సుధా అత్తగారు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో సుధా ఆ పిల్లవాడిని తెల్లగా మార్చడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. దానిలో భాగంగా రాయితో రుద్దితే తెల్లగా అవుతారని ఎవరో చెప్పిన సలహ విని పసివాడిని రాయితో రుద్దడం ప్రారంభించింది. దీంతో ఆ చిన్నారికి ఛాతీ, భుజం, వీపు, కాళ్ల మీద గాయాలయ్యాయి. పసివాడిని అలా హింసించవద్దంటూ సుధా సోదరి కూతురు శోభన శర్మ ఆమెకు ఎన్నోసార్లు చెప్పింది. అయినా సుధ వినకపోవడంతో శోభన శర్మ ఆదివారం బాలల సంరక్షణ అధికారులకు ఫోన్ చేసింది. సమాచారం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారులు, నిషత్‌పూర్ పోలీసులు... సుధ ఇంటి నుంచి బాలుడిని విడిపించి... హమిదియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం తదుపరి విచారణ నిమిత్తం ఆ చిన్నారిని బాలల సంరక్షణా కేంద్రానికి తరలించారు. తన సుధా తివారి తనను ఆమె పనిచేసే పాఠశాలకు తీసుకెళ్లేదని... అయితే చదివించడానికి కాదంటూ విచారణలో తెలిపాడు. (ఇవాళ) బాలుడిని బాలల సంరక్షణ కమిషన్ సభ్యుల ముందు హజరుపరచనున్నారు. కాగా నిబంధనల ప్రకారం దత్తత తర్వాత ఆశ్రమం వారు ఆ పిల్లల బాగోగుల గురించి ఆరా తీయాలి. కానీ ‘మాతృచ్ఛాయ’ ఆశ్రమం వారు ఆ పని చేయలేదని శోభన ఆరోపించారు. దీని గురించి ‘మాతృచ్ఛాయ’ జాయింట్ సెక్రటరీ అమిత్ జైన్‌ను విచారించగా ‘మేము పిల్లలను దత్తత ఇచ్చిన అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిల్లల క్షేమ సమాచారం తెలుసుకుంటాము. మేము సుధకు ఫోన్ చేసి అడిగినప్పుడు ఆమె మాకు దీని గురించి చెప్పలేదు’ అన్నారు. మధ్యప్రదేశ్ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ చైర్మన్ రాఘవేంద్ర శర్మ మాట్లాడుతూ ‘ఈ విషయం గురించి నాకు ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. కానీ దోషుల మీద కఠిన చర్యలు తీసుకుంటానని’ తెలిపారు. -
పట్టపగలే మరో ప్రేమోన్మాదం!
హైదరాబాద్: రాజధానిలో పట్టపగలే మరో ప్రేమోన్మాదం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులకు దిగిన యువకుడు ఆమె తిరస్కరించడంతో కక్షకట్టాడు. యువతి ఇంట్లోనే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టి పరారయ్యాడు. 60 శాతం కాలిన గాయాలైన ఆమె ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. హైదరాబాద్ గోల్నాక గంగానగర్‌లో నివసించే అర్షియాబేగం భర్త రియాజుద్దీన్ అన్సారీ కొంతకాలం క్రితం మృతిచెందారు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కూలీగా పని చేస్తున్న అర్షియా.. తన కుమార్తె తబస్సుమ్ బేగం (17), ఇద్దరు కుమారుల్ని పోషిస్తోంది. పదో తరగతితో చదువు మానేసి, ఇంట్లోనే ఉంటున్న తబస్సుమ్‌ను గోల్నాక మార్కెట్లో కూరగాయల వ్యాపారైన సోహెల్ ప్రేమ పేరుతో వేధించడం మొదలెట్టాడు. తబస్సుమ్‌కు ఇటీవలే మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఇది తెలుసుకున్న సోహెల్ మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంట్లోకి ప్రవేశించి ప్రేమించాలంటూ వేధించాడు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి, యువతి ఇంట్లోని కిరో సిన్ తీసుకొని ఆమెపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. మంటలు తాళలేకపోయి న ఆమె కేకలు వేసింది. చుట్టుపక్కలవారు మంటలార్పి ‘108’ సాయంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడు సోహెల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. తబస్సుమ్‌కు నిప్పంటించే క్రమంలో అతనికీ గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడి, హత్యాయత్నం చేసిన నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. -
శిశువులు మరణిస్తుంటే ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శిశు గృహాల్లో చోటు చేసుకుంటున్న శిశు మరణాల వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. శిశు గృహాల్లో 40 మంది శిశువులు చనిపోయిన విషయం వాస్తవమో కాదో తెలపాలని పేర్కొంది. ఒకవేళ నిజమే అయితే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. మరణాలను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గృహాల్లో పెద్ద ఎత్తున శిశు మరణాలు సంభవిస్తున్నాయని, శిశు విక్రయాలు కూడా జరుగుతున్నాయని, ఇందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లోని శిశు గృహాల్లో చిన్నారులు పెద్ద సంఖ్యలో మరణించారని పేర్కొన్నారు. ఇక్కడి శిశువులకు లాక్టోజన్ పాలను వాడాల్సి ఉండగా, సాధారణ గేదె పాలను వాడుతున్నారని, దీంతో సమస్యలు తలెత్తి మృత్యువాత పడుతున్నారని వివరించారు. ఒక్క నల్లగొండ జిల్లాల్లోనే ఏడాదిలో దాదాపు 32 మంది చిన్నారులు మృతి చెందారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది శిశువుల వరకు మరణించారని పేర్కొన్నారు. -
బాలుర మధ్య ఘర్షణ
హైదరాబాద్: ఇద్దరు బాలుర మధ్య తలెత్తిన ఘర్షణలో కత్తిపోటుకు గురై ఒకరు గాయపడ్డారు. నాచారంలోని ఎర్రకుంటకు చెందిన అరవింద్ (16), సాయి నాథ్ (16) స్నేహితులు. వీరిద్దరూ అక్కడి ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఇదే స్కూల్లో అరవింద్ సోదరి సైతం చదువుతోంది. కొన్నాళ్లుగా అరవింద్ సోదరిని సాయినాథ్ వేధిస్తున్నాడనేది ఆరోపణ. ఇదే విషయంపై మందలించేందుకు అరవింద్ మంగళవారం ఉదయం సాయినాథ్ ఇంటికి వెళ్లాడు. ఇరువురి మధ్యా మాటామాటా పెరగడంతో ఆవేశానికి లోనైన సాయినాథ్ కత్తితో అరవింద్ కడుపులో పొడిచాడు. అనంతరం భయపడి పారిపోయాడు. గాయపడిన అరవింద్‌ను స్థానికులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తు న్నారు. ఈ ఘటన నేపథ్యంలో విద్యాశాఖ ప్రతి పాఠశాలలో మానసిక శాస్త్ర నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో అభంశుభం తెలియని బాలలు నేరస్తులుగా మారుతున్నారని అన్నారు. -
లిఫ్ట్ మీద పడి బాలుడి దుర్మరణం
హైదరాబాద్: అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఓ బాలుడు బలయ్యాడు. తెరిచి ఉన్న సెల్లార్ లిఫ్ట్ క్యాబిన్లోకి తొంగిచూసిన చిన్నారిపై లిఫ్ట్ వచ్చి పడింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం హైదరాబాద్ చంపాపేట డివిజన్ దుర్గానగర్‌లో జరిగింది. దుర్గానగర్‌లోని శ్రీ సత్యసాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ వాచ్‌మన్ చొల్లంగి శ్రీనివాస్, సూర్యకుమారి దంపతులకు ఇద్దరు సంతానం. వీరి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాజులూరులోని తర్లంపుడి గ్రామం. ఆదివారం ఉదయం శ్రీనివాస్ పెద్ద కుమారుడు వెంకట తస్వంత్(8) ఆడుకుంటూ వెళ్లి ఎలాంటి రక్షణ లేని లిఫ్ట్ సెల్లార్ క్యాబిన్లోకి తొంగి చూస్తున్నాడు. అదే సమయంలో పైఅంతస్తు నుంచి దూసుకువచ్చిన లిఫ్ట్ బాలుడిపై పడింది. దీంతో తస్వంత్ తలకు తీవ్ర గాయమైంది. తల్లి గమనించి కుమారుడిని బయటకు తీసుకువస్తుండగా అప్పటికే మృతిచెందాడు. ఆడుతూ కనిపించిన కుమారుడు క్షణాల్లో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తస్వంత్ మరణానికి అపార్ట్మెంట్ నిర్వాహకు ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. సెల్లార్లో లిఫ్ట్ చుట్టూ రక్షణ చర్యలు తీసుకోలేదని, దీంతో బాలుడు ప్రమాదానికి గురయ్యాడని అన్నారు. శ్రీను కుటుంబాన్ని అపార్ట్మెంట్ నిర్వాహకులు, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అపార్ట్మెంట్ నిర్వాహకులే బాధ్యత వహించాలి: బాలల హక్కుల సంఘం తస్వంత్ మృతికి అపార్ట్మెంట్ నిర్వాహకులు బాధ్యత వహించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత్‌రావు డిమాండ్ చేశారు. సెల్లార్లో లిఫ్ట్ చుట్టూ రక్షణ గోడలు లేకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని, అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల నగరంలో తరచూ లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బాలుడి కుటుంబానికి నిర్వాహకులు నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
‘బాలల కమిషన్’పై సర్కారుకు ఎదురుదెబ్బ!
సాక్షి, హైదరాబాద్: బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్, సభ్యుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చైర్పర్సన్, ఇతర సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేసింది. వారి నియామకం చట్ట నిబంధనలకు అనుగుణంగా జరగలేదని పేర్కొంది. బాలల హక్కుల రంగంలో కనీసం 10 సంవత్సరాల అనుభవం, బాలల హక్కుల విషయంలో చిత్తశుద్ధి ఉన్న వారిని చైర్పర్సన్, సభ్యులుగా నియమించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ నియామకాలపై గతంలోనే హైకోర్టు స్టే విధించగా.. తాజా గా నియామక జీవోలను రద్దు చేశారు. నచ్చిన వారిని నియమించుకున్నారు..! బాలల హక్కుల సంఘం చైర్‌పర్సన్‌గా రవికుమార్ నియామకపు జీవో 18ని సవాలు చేస్తూ పి.అచ్యుత్‌రావు ఒక పిటిషన్ దాఖలు చేయగా.. సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ నారా నాగేశ్వరరావు, డి.రాము, ఎంఎన్వీ శ్రీనివాసరావులు వేర్వేరుగా మూడు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ చల్లా కోదండరామ్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్లు తమ అభ్యంతరాలను కోర్టుకు వివరించారు. ‘‘చైర్‌పర్సన్‌గా నియమితులైన రవికుమార్ వరంగల్‌లో న్యాయవాది. టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి. సభ్యులుగా నియమితులైన వారిలో అనుమందుల శోభారాణి హుజూరాబాద్ ఎంపీడీవో కార్యాయలంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎం.జయశ్రీ ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తె, బండ రామలీల వరంగల్‌లోని మానసిక వైకల్య కేంద్రంలో ఉద్యోగిని, పొనుగంటి అంజన్‌రావు ఎల్బీనగర్లో టీఆర్ఎస్ కార్యకర్త, పి.రేవతిదేవి హైదరాబాద్ సీఐడీకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, జోగినపల్లి శ్రీనివాసరావు హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ టీఆర్ఎస్ కార్యకర్త. వీరిలో ఏ ఒక్కరూ కూడా బాలల హక్కుల కోసం పోరాటం చేయలేదు. ఎవరికీ బాలల హక్కుల సంరక్షణలో కనీస అనుభవం లేదు. ఇటువంటి వారిని చైర్పర్సన్, సభ్యులుగా నియమించడం బాలల హక్కుల చట్టం–2005కు విరుద్ధం..’’అని నివేదించారు. అంతేగాకుండా కమిషన్ ఎంపిక కమిటీకి మంత్రి చైర్మన్‌గా ఉండాలని.. కానీ మంత్రి లేకుండానే చైర్పర్సన్, ఇతర సభ్యుల నియామకం జరిగిందని వివరించారు. ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధమే.. పిటిషనర్ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ సరిగా లేదని స్పష్టం చేశారు. నియమితులైన వారు ఆ పోస్టులకు అర్హులా.. కాదా? అన్న అంశాల జోలికి వెళ్లడం లేదని.. కానీ ఎంపిక ప్రక్రియ మాత్రం చట్ట నిబంధనలకు లోబడి జరగలేదని పేర్కొన్నారు. ఎంపిక చేసే త్రిసభ్య కమిటీకి శిశు సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్‌గా ఉంటారని.. మంత్రి సమావేశానికి హాజరుకాకుండానే మిగతా ఇద్దరు సభ్యుల కమిటీ కమిషన్ చైర్‌పర్సన్‌ను సిఫార్సు చేశారని పేర్కొన్నారు. ఇక నియామకమయ్యే వారికి పదేళ్ల పాటు బాలల హక్కుల రంగంలో అనుభవం ఉండాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయలేదని ఎత్తిచూపారు. బాలల హక్కుల కమిషన్ చట్టం, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల చట్ట నిబంధనలకు అనుగుణంగా... బాలల హక్కుల కోసం పోరాడిన వారిని, బాలల సంక్షేమం, విద్య కోసం చిత్తశుద్ధితో పాటుపడిన వారిని నియమించాలని సూచించారు. -
‘బాలల హక్కుల కమిషన్’ నియామకంపై స్టే
► మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బాలల హక్కుల కమిషన్ సభ్యుల నియామకాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన చైర్మన్ నియామకంపై గతంలో స్టే ఇచ్చిన హైకోర్టు.. తాజాగా కమిషన్ సభ్యులుగా ఆరుగురిని నియమించిన తీరును తప్పుపడుతూ స్టే ఉత్తర్వులిచ్చింది. నారా నాగేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల ఈ ఆదేశాలు జారీ చేశారు. జీవో 3 ప్రకారం సంబంధిత శాఖ మంత్రి చైర్మన్‌గా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించే జడ్జి, అసెంబ్లీ స్పీకర్ సిఫార్సు చేసే ఎమ్మెల్యే సభ్యులుగా ఉండే కమిటీ... కమిషన్ సభ్యుల్ని ఎంపిక చేయాలని, అందుకోసం నిర్వహించిన ఇంటర్వ్యూకు మంత్రి తుమ్మల హాజరు కాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చాపరాల శ్రీరామ్ ధర్మాసనానికి విన్నవించారు. బాలల హక్కుల చట్టం–2005కు విరుద్ధంగా నియామకం జరిగిందని, బాలల హక్కులకు చెందిన వివిధ రంగాల్లో సేవలు చేసిన అనుభవం ఉండాలనే చట్ట నిబంధనను పాటించలేదన్నారు. -
పాఠశాలల్లో జంక్ ఫుడ్ పై నిషేధం
ఛండీగఢ్: పంజాబ్ లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జంక్ ఫుడ్ ను పూర్తిగా నిషేధిస్తూ బాలల హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అనేక కమిటీల నివేదికల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కమిషన్ చైర్మన్ సుకేష్ కాలియా పేర్కొన్నారు. జంకు ఫుడ్ లో చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న కారణంగా హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబెసిటీ, మానసిక సమస్యలు వస్తున్నాయని అందుకే ఈనిర్ణయం తీసుకున్నామని కాలియా తెలిపారు. -
ఆడపిల్ల పుట్టిందని..
హైదరాబాద్ : ఆడపిల్ల పుట్టిందనే కోపంతో భర్త ఇంటివారు తనను ఇంట్లోకి రానివ్వడంలేదని ఓ మహిళ బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. నగరానికి చెందిన అర్చన అనే మహిళకు ఆడపిల్ల పుట్టడంతో.. భర్త ఇంటివారు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో బాధితురాలు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన బాలల హక్కుల సంఘం రంగారెడ్డి కలెక్టర్‌కు నోటీసులు పంపించింది. ఈ విషయం పై జూన్ 16లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది. -
పెళ్లికి పట్టుబడుతున్న.. కేసీఆర్ దత్తపుత్రిక
సాక్షి, హైదరాబాద్: సొంత తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన ప్రత్యూష త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందా..? తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చిన యువకుడితో చిగురించిన ప్రేమ, పెళ్లి వరకు వెళ్లబోతోందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కన్నతల్లి మరణంతో, సవతి తల్లి పెంపకంలో నిత్యం నరకాన్ని అనుభవిస్తున్న సమయంలో ప్రత్యూషను మీడియా, బాలల హక్కుల సంఘాలు చొరవతో ఆస్పత్రిలో చేర్పించటం, ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్, హై కోర్టుల స్పందనతో ప్రభుత్వ ఆధీనంలోని సంరక్షణ కేంద్రంలో నివసిస్తున్నఆమె యోగక్షేమాలను అధికారుల ప్రత్యేకంగా చూస్తూవస్తున్నారు. ప్రత్యూష ఇటీవలే ఇంటర్ వోకేషనల్ పరీక్ష సైతం పాసైయ్యారు. అయితే, బీఎస్సీ నర్సింగ్ చేయటమే లక్ష్యంగా చెబుతూ వచ్చిన ప్రత్యూష.. తాజాగా తాను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకట మద్దిలేటి రెడ్డిని ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకున్నాకే చదువుకుంటానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించారు. ఈ విషయాన్ని మహిళ సంక్షేమ శాఖ డెరైక్టర్ విజయేంద్రకు కూడా ప్రత్యూష తెలిపారు. ఈ విషయమై ఆమె న్యాయవాది ప్రత్యూషకు పలు మార్లు కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నపటికీ.. ప్రస్తుతం తనకు ఇరవై ఏళ్లని, మేజర్‌నంటూ.. నా ఇష్టప్రకారం నేను కోరుకున్నది చేయాలంటూ ప్రత్యూష పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఎవరీ మద్దిలేటి రెడ్డి.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆచారీకాలనీకి చెందిన మద్దిలేటి రెడ్డి(27) బీఎస్సీ చదివి ఓ ఆటోమొబైల్ షాపులో స్టోర్ కీపర్‌గా పనిచేస్తున్నారు. గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుని పరామర్శకు హైదరాబాద్‌కు వచ్చి అక్కడే చికిత్స పొందుతున్న ప్రత్యూషను పలకరించాడు. ఏ ఇబ్బంది ఉన్నా తనకు ఫోన్ చేయాలంటూ నంబర్ ఇచ్చాడు. నగరంలో ఉన్న రెండు రోజుల ప్రత్యూష వద్దకు వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకుని ఆళ్లగడ్డకు వెళ్లిపోయాడు. తర్వాత ప్రత్యూష ప్రభుత్వ సంరక్షణ గృహంలో చేరింది. అప్పటినుంచి మద్దిలేటికి ఫోన్లు చేస్తుండటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. హాస్టల్లో ఉండలేను.. పెళ్లి చేసుకుంటా ప్రత్యూష ప్రస్తుతం తాను హాస్టల్లో ఉండలేకపోతున్నానని, హాస్టల్ భోజనంలో సోడా ఉప్పు వేస్తున్నారని, ఉడకని బియ్యంతో అన్నం తినడం వల్ల ఆరోగ్యం ఇబ్బంది పెడుతోందని బాలల హక్కుల కమిషన్ సభ్యులు అచ్యుతరావుకు ఆమె ఫోన్ చేసి చెప్పారు. మద్దిలేటిని పెళ్లి చేసుకున్నాకే తాను బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తానని వివరించారు. తాను ప్రేమించిన మద్దిలేటితోనే వివాహం జరిపించాలని కోరారు. ఆమెనే పెళ్లి చేసుకుంటా: మద్దులేటిరెడ్డి అవును.. ప్రత్యూషను ప్రేమించాను. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పి అమ్మ తులసమ్మను ఒప్పించాను. నేను పేదవాడినైనా, మాట తప్పే వాడిని కాదు. ఆమే తొలుత నాకు ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అందుకు మేమంతా అంగీకరించాం. కోర్టు, ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తే అందరి సమక్షంలో ప్రత్యూషను పెళ్లి చేసుకుంటానని మద్దిలేటి తెలిపారు. ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలి : అచ్యుతరావు, బాలల హక్కుల కమిషన్సభ్యులు ప్రత్యూషను ఆస్పత్రి నుండి తీసుకెళ్లి సంరక్షణ కేంద్రంలో పెట్టిన తర్వాత, ఆమెకు మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించ లేదు. పరిసరాలు, చుట్టూ ఉన్న వాతావరణం కారణంగా ఆమె వాటన్నింటి నుంచి ఇప్పటికిప్పుడు బయటపడాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆమెకు నిపుణులైన మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ అవసరమని అభిప్రాయపడ్డారు. -
నరరూప రాక్షసులు...
హైదరాబాద్ : కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రులే నరరూప రాక్షసులుగా మారారు. బాలికను మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో తనకు రక్షణ కల్పించాలని బాధితురాలు సోమవారం నారాయణగూడలోని బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. బాధిత బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ ఇందిరానగర్‌కు చెందిన జ్యోతిరాణి, శ్రీనివాస్‌ల కూతురు (13) లాలాగూడలోని హైస్కూల్లో 7వ తరగతి చదువుతోంది. తండ్రి ఆటో డ్రైవర్. తల్లిదండ్రులు మద్యానికి బానిసై బాలికను స్కూల్ మాన్పించి కొద్దిరోజులు పనిలో చేర్పించారు. చిన్నారితో మద్యం తెప్పించుకుని, ఆమెతోనే గ్లాసుల్లో పోయించుకొని తాగేవారు. తండ్రి శ్రీనివాస్ లైంగికదాడికి పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన కన్నతల్లే అతడికి మద్దతు తెలుపుతూ బాలికను చిత్రహింసలకు గురి చేసేది. తరచూ దుర్భాషలాడుతూ హింసించేది. తండ్రితో బాలికను కొట్టించేంది. బాలికను చంపేందుకు ఒకసారి బస్సు కిందకు నెట్టేందుకు యత్నించింది. దీంతో తల్లిదండ్రుల వద్ద ఉంటే తనను చంపేస్తారని భావించిన చిన్నారి తనకు ప్రభుత్వం ద్వారా రక్షణ కల్పించాలని కోరుతూ బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. అమ్మమ్మ లేదా పెద్దమ్మ వద్ద ఉంటానని, అందుకు ఏర్పాట్లు చేయాలని వేడుకుంటోంది. బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు సహాయంతో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో తన తల్లిదండ్రుపై బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు మాట్లాడుతూ... బాలికను వేధిస్తున్న తల్లిదండ్రులపై కేసు నమోదు చేయించామని, వారికి శిక్షపడేందుకు కృషి చేస్తామన్నారు. ముందుగా బాలికకు రక్షణ కల్పించి, చదువుకునేందుకు అవకాశాలు కల్పిస్తామన్నారు. బాధితురాలిని రంగారెడ్డి జిల్లా ఐద్వా ఉపాధ్యక్షురాలు నన్నపనేని సృజన కలిసి పరామర్శించారు. బాలిక తల్లిదండ్రలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
'హెరిటేజ్'కు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నోటీసులు
హైదరాబాద్: పిల్లల ఆరోగ్యంపైన దుష్ర్పభావం చూపే నాణ్యత లేని, గడువుతీరిన తినుబండారాల విక్రయించడం క్రిమినల్ చర్య కిందకు వస్తుందని భావించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హెరిటేజ్ సంస్థకు మంగళవారం నోటీసులు జారీచేసింది. జూన్ 20వతేదీలోగా దీనికి వివరణ ఇవ్వాలని సంస్థ మేనేజింగ్ డెరైక్టర్‌ను ఆదేశించింది. సోమవారం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు స్వయంగా వనస్థలిపురంలోని హెరిటేజ్ సూపర్మార్కెట్లోని వస్తువుల నాణ్యతను పరిశీలించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన పిల్లలు తినే ఆహారపదార్థాలు, శీతల పానీయాల గడువు తీరిపోయినా విక్రయిస్తున్నట్లు గుర్తించి సదరు సంస్థకు నోటీసులు జారీ చేశారు. -
మదర్సా ఉదంతంపై కదిలిన యంత్రాంగం
సాక్షి, ఏలూరు : దెందులూరు మండలం గంగన్నగూడెంలోని మౌలానా అబ్దుల్‌కలాం ఆజాద్ యూపీ స్కూల్(మదర్సా)లో నాలుగో తరగతి విద్యార్థిని కరస్పాండెంట్ చితకబాదిన ఉదంతాన్ని ‘సాక్షి’ కథనం ఆధారంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఈ నెల 30 లోగా విచారణచేసి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి, విద్యాశాఖ అధికారులను ఆదేశించడంతో యంత్రాంగం కదిలింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు.కరస్పాండెంట్ వసీవుల్లా కొట్టడంతో విద్యార్థి వజీర్ వీపుపై తేలిన వాతలను ప్రభుత్వాసుపత్రి డాక్టర్ సీహెచ్ ప్రవీణ్ పరీక్షించారు. చికిత్స చేస్తున్నారు. కరస్పాండెంట్‌పై బాలల చట్టం ప్రకారం కేసు విద్యార్థి వజీర్‌ను విచక్షణారహితంగా కొట్టిన స్కూల్ కరస్పాండెంట్ వసీవుల్లాపై బాలల న్యాయ చట్టం సెక్షన్ 23, బాలల విద్యాహక్కు చట్టం సెక్షన్-17, భారత శిక్షాస్మృతి సెక్షన్-14 కింద కేసు నమోదు చేయించనున్నట్టు బాలల సంక్షేమ న్యాయమూర్తుల కోర్టు చైర్మన్ టి.స్నేహన్ ఆదివారం తెలిపారు.వ జీర్ నుంచి వివరాలు సేకరించాల్సిందిగా జిల్లా బాలల సంరక్షణాధికారిణి సీహెచ్ సూర్యచక్రవేణిని న్యాయమూర్తుల పీఠం ఆదేశించటంతో ఆమె ఆదివారం బాలుడితో పాటు అతని తల్లి నజీమున్నీసా, అమ్మమ్మ బషీర్ఉన్నీసాల నుంచి వివరాలు సేకరించారు. ఎస్సై విచారణ గంగన్నగూడెం (దెందులూరు) : గంగన్నగూడెంలోని మదర్సాలో విద్యార్థిని కరస్పాండెంట్ కొట్టిన ఘటనపై ఎస్పీ ఆదేశాల మేరకు దెందులూరు ఎస్సై కె.వెంకటరమణ ఆదివారం సాయంత్రం పాఠశాలలో విచారణ నిర్వహించారు. ఘటన ఎప్పుడు, ఎలా జరిగింది, విద్యార్థి, కరస్పాండెంట్ ప్రవర్తనపై ఆరా తీశారు. విచారణలో ఉపాధ్యాయులు మౌలానా జాఫర్‌సాబ్, అబ్దుల్ రెహమాన్, అఫీజుల్లాఖాన్ మాట్లాడుతూ పాఠశాలలో బాలురు 178 మంది, బాలికలు 261 మంది మొత్తం 439 మంది ఉన్నారన్నారు. యూపీ పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు, ముగ్గురు ఉపాధ్యాయినులు పనిచేస్తున్నారని చెప్పారు. పాఠశాల ప్రారంభించి 13 ఏళ్లు అయిందని, ఇప్పటివరకు ఏ రిమార్కు లేదన్నారు. వజీర్ ఈ నెల 11న తరగతి గదిలో పాస్ పోశాడని, అతడిని కరస్పాండెంట్ రూమ్‌కు తీసుకువెళితే అక్కడ కూడా పాస్ పోశాడన్నారు. గతంలో ఎప్పుడూ ఈ విధంగా చేసిన ఘటనలు లేవన్నారు. ఈ విషయాన్ని కరస్పాండెంట్ వజీర్ తల్లిదండ్రులకు చెప్పడంతో చింతలపూడి రావడానికి ప్రయత్నిస్తున్నాడని, ఒకటి తగిలించి మందలించాలని వారు చెప్పారన్నారు. పాస్ పోసిన అనంతరం కరస్పాండెంట్ విద్యార్థిని కొట్టడం వాస్తవమేనన్నారు. కరస్పాండెంట్ విధి నిర్వహణలో విద్యార్థులతో వ్యవహరించే తీరులో ఇప్పటివరకు ఎవరి నుంచీ ఫిర్యాదు లేదని, భోజనం, మౌలిక వసతులు కల్పించడంతోపాటు అందరినీ బాగా చూస్తారని ఎస్సైకి వివరించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తానని ఎస్సై కె.వెంకటరమణ తెలిపారు. మదర్సాపై దుష్ర్పచారం తగదు గంగన్నగూడెం (దెందులూరు) : గంగన్నగూడెంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ మదర్సా(ఉర్దూ పాఠశాల)పై అనవసరంగా దుష్ర్పచారం చేస్తున్నారని ఉర్దూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్ అలీ పేర్కొన్నారు. మదర్సాలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మదర్సా విద్యార్థి వజీర్‌ను కరస్పాండెంట్ వసీవుల్లా కొట్టిన సంగతి వాస్తవమేనన్నారు. ఈ ఘటనతో మదర్సాపై దుష్ర్పచారం చేయటంలో కొందరి హస్తం ఉందని ఆరోపించారు. ఆరుగురు విద్యార్థులను కొట్టడంతో ఇద్దరు కోమాలోకి వెళ్లారని టీవీ చానల్స్‌లో రావడం తమను బాధించిందన్నారు. పాఠశాల ప్రారంభించి పదమూడేళ్లుకాగా ఇప్పటి వరకు ఉపాధ్యాయులు, కరస్పాండెంట్‌పై ఎటువంటి రిమార్కు లేదన్నారు. ఈ నెల 11న ఈ ఘటన జరిగితే విద్యార్థి తండ్రి ఈ నెల 22న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఆ విద్యార్థికి ముందు నుంచే మానసిక ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేనందున ఏలూరులోని మానసిక వైద్య నిపుణులు స్వరూప్ వద్ద చికిత్స పొందుతున్నాడని, ఈ విషయం నిర్ధారించుకోవటానికి అధికారులు విచారణ చేపట్టవచ్చని సూచించారు. విద్యార్థి తండ్రితో కొందరు మదర్సాపై దుష్ర్పచారం చేయిస్తున్నారని ఆరోపించారు. మదర్సా ఉపాధ్యాయులు మహ్మద్ అబ్దుల్‌రెహమాన్, అఫీజుల్లా, మౌలానా జాఫర్‌ఖాన్, నుజ్జమిల్ పాల్గొన్నారు. -
గోవిందా.. గోవిందా..
సాక్షి, ముంబై: ఉట్టి ఉత్సవాల్లో 18 ఏళ్ల లతోపు పిల్లలు పాల్గొనడాన్ని నిషేధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పడంతో సార్వజనిక గోవిందా మండళ్లు ఖంగుతిన్నాయి. ఈ నెల 17వ తేదీన జరుగనున్న కృష్ణాష్టమి రోజున ఉట్టి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఆ రోజు కొన్ని వేల సార్వజనిక గోవిందా మండళ్లు ఉట్టి ఉత్సవాలను నిర్వహిస్తాయి. ఉట్టి కొట్టేందుకు నిర్ణయించిన టీంలో చిన్నపిల్లలు కూడా ఉంటారు. వారు పిరమిడ్‌లో అందరికంటే పెకైక్కి ఉట్టిని కొడతారు. బరువు తక్కువగా ఉంటారు కాబట్టి ప్రతి గోవిందా మండలిలోనూ పిల్లలు తప్పనిసరిగా పాల్గొంటారు. అయితే ఉట్టి ఉత్సవాల సమయంలో పిల్లలు పైనుంచి కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపిస్తూ ఈ ఏడాది బాలల హక్కుల కమిషన్ గోవిందా మండళ్లపై ఆంక్షలు విధించింది. 12 ఏళ్ల పిల్లలు ఉట్టి ఉత్సవాలు పాల్గొంటే అటువంటి మండళ్లపై చర్యలు తీసుకునే బాధ్యత పోలీసులదేనని ఆదేశించింది. కాగా, బాలల హక్కుల కమిషన్ నిర్ణయంపై సార్వజనిక గోవిందా మండళ్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చిన్నపిల్లలతో ఉట్టి ఉత్సవాలను నిర్విహ ంచే తీరుతామని కమిషన్‌కు,పోలీసులకు సవాల్ విసిరాయి. వీరికి కొన్ని మహిళా గోవింద మండళ్లు కూడా మద్దతు తెలపడంతో వివాదం ముదిరింది. ఇదిలా ఉండగా, హైకోర్టు తీర్పు ఈ మండళ్లపై పిడుగుపడినట్లయ్యింది. బాలల హక్కుల కమిషన్ ఉట్టి ఉత్సవాల్లో 12 ఏళ్ల లోపు పిల్లలు పాల్గొనకుండా చూడాలని పోలీసులను ఆదేశిస్తే, హైకోర్టు మరో అడుగు ముందుకేసి 18 ఏళ్ల లోపువారు ఈ ఉత్సవాల్లో పాల్గొనడాన్ని నిషేధించడంతో సార్వజనిక గోవిందా మండళ్ల పరిస్థితి ‘పెనం మీద నుంచి పొయ్యి మీద’ పడినట్లయ్యింది. ఉట్టి ఉత్సవాన్ని ప్రాణాంతక క్రీడగా పరిగణించాలని కోరుతూ ఉత్కర్ష్ మహిళ సమితి ప్రజాప్రయోజనాల (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం హైకోర్టు స్పందించింది. 18 ఏళ్లలోపు పిల్లలను ఉట్టి ఉత్సవాల్లో పాల్గొనడాన్ని నిషేధించింది. అంతటితో ఊరుకోకుండా కేవలం 20 అడుగుల ఎత్తు (ఐదంతస్తుల ) మానవ పిరమిడ్లు మాత్రమే నిర్మించాలని ఆంక్షలు విధించింది. దీన్ని కచ్చితంగా అమలు చేసేందుకు కొత్త నియమాలతో కూడిన సర్క్యూలర్ జారీ చేయాలని న్యాయమూర్తులు వి.ఎన్.కానడే, ప్రమోద్ కోదే ప్రభుత్వాన్ని ఆదేశించారు. 12 ఏళ్లలోపు పిల్లలు ఉట్టి ఉత్సవాల్లో పాల్గొనకుండా చూసే బాధ్యత నగర పోలీసులదేనని బాలల హక్కుల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. కాని ఈ వారంలో నవీముంబైలో ఒక బాలుడు (14), జోగేశ్వరిలో యువకుడు(17) ఉట్టి ఉత్సవానికి సాదన చేస్తుండగా అదుపుతప్పి కిందపడి చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టు ఈ విషయాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంది. ఉట్టి ఉత్సవాల నిర్వాహకులపై కొన్ని ఆంక్షలు కూడా విధించింది. తారు రోడ్డు లేదా కాంక్రీట్ రహదారిపై ఉట్టి కడితే.. దాని కింద నేలపై మెత్తని పరుపులు ఏర్పాటు చేయాలి.. గోవిందా బృందాలకు హెల్మెట్, సేఫ్టీ బెల్టు లాంటి రక్షణ కవచాలు అందుబాటులో ఉంచుకోవాలి.. ఉట్టి పగులగొట్టే ప్రయత్నంలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించేందుకు నిర్వాహకులే అంబులెన్స్‌లు సమకూర్చుకోవాలి.. అని న్యాయమూర్తుల బెంచి తీర్పులో స్పష్టం చేసింది. కాగా కోర్టు విధించిన ఆంక్షలపై గోవిందా బృందాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అనేక మండళ్లు ఈ ఏడాది ఉట్టి ఉత్సవాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటో రేట్ల పెంపునకు హైకోర్టు ఓకే.. ముంబై: ఆటో, ట్యాక్సీల రేట్లను రెండు రూపాయలు పెంచవచ్చని ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు సూచించింది. మీటర్‌పై రూ.2 పెంచుకునేందుకు ఆటోలు, ట్యాక్సీలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ రేట్లను ప్రభుత్వం బుధవారం నుంచి అమలుచేయవచ్చని కోర్టు సూచించింది. ప్రస్తుతం ఆటోలు, ట్యాక్సీలు రూ.15, రూ.19 వసూలు చేస్తుండగా వరుసగా రూ.17, రూ.21 వసూలు చేసేందుకు అనుమతిస్తూ జస్టిస్ అభయ్ ఓకా ఆదేశాలు జారీచేశారు. అయితే కేలిబ్రేటెడ్ (క్రమాంకనం) మీటర్లు కలిగి ఉన్న ఆటోలు, ట్యాక్సీలకే ఈ రేట్లు వర్తిస్తాయని జస్టిస్ ఓకా స్పష్టం చేశారు. కేలిబ్రేటెడ్ మీటర్లు లేని ఆటోలు చార్జీల పెంపునకు యత్నిస్తే వాటిపై ఆర్టీవో అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, నగరంలో తిరిగే అన్ని ఆటోలు,ట్యాక్సీలు కేలిబ్రేటెడ్ మీటర్లను ఏర్పాటుచేసుకునేంతవరకు చార్జీల పెంపు అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. -
‘ఉట్టి’ దిగులు..!
సాక్షి, ముంబై: కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. అన్న సామెత చందంగా ఉంది ప్రస్తుతం నగర పోలీసుల పరిస్థితి.. ఉట్టి ఉత్సవాల్లో 12 ఏళ్ల లోపు పిల్లలు పాల్గొన కుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని బాలల హక్కుల కమిషన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా పిల్లలు లేకుం డా ఉత్సవమా.. సమస్యే లేదు.. ఉట్టి ఉత్సవాల్లో పిల్లలు తప్పకుండా పాల్గొం టారని ఉత్సవ మండళ్లు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పోలీసుల పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా తయారైంది. ఈ నెల 17వ తేదీన (ఆదివారం) ఉట్టి ఉత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ ఉత్సవాల్లో పిల్లలు పాల్గొనే అంశం ఎటూ తేలకపోవడంతో మధ్యలో నగర పోలీసులు నలిగి పోతున్నారు. ఉత్సవాల్లో 12 ఏళ్లలోపు పిల్లలు పాల్గొంటే సంబంధిత ఉట్టి ఉత్స వ మండళ్లపై చర్యలు తీసుకునే బాధ్యత పోలీసులదేనని బాలల హక్కుల సంఘం ఆదేశించింది. మరోపక్క పిల్లలతోనే ఉట్టి ఉత్సవాలు నిర్వహిస్తామని మండళ్లు సవాలు చేస్తున్నాయి. మండళ్ల వైఖరిపై పోలీసులు ఏ విధంగా స్పం దిస్తారనేదానిపై అందరి ధృష్టి పడింది. ఉట్టి ఉత్సవాల్లో 12 ఏళ్లలోపు పిల్లలు పాల్గొనడంవల్ల వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఉట్టి పగులగొట్టే ప్రయత్నంలో అదుపుతప్పి పైనుంచి కిందపడడంవల్ల వారు వికలాంగులయ్యే ప్రమాదముంది. గతంలో జరిగిన ఘటనల్లో కొందరు వికలాంగులుగా మారారు. కొం దరు ప్రాణాలను పోగొట్టుకున్నారు. తాజాగా వారం కిందట నవీముంబైలోని సాన్‌పాడా ప్రాంతంలో ఉట్టిఉత్సవాలకు సాధన చేస్తుండగా కిరణ్ తల్కరే (14) అనే బాలుడు పైనుంచి కిందపడడంతో తలకు, చాతిలో గాయాలయ్యాయి. నేరుల్‌లోని సహ్యాద్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రెండు రోజులకు చనిపోయాడు. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని పిల్లలు ఉట్టి ఉత్పవాల్లో పాల్గొనడాన్ని బాలల హక్కుల సంఘం నిషేధించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వాన్ని కోరింది. అంతేగాక అలాంటి మండళ్లపై చర్యలు తీసుకునే బాధ్యత పోలీసులదేనని తేల్చిచెప్పిం ది. అయితే పిల్లలతోనే ఉట్టి ఉత్సవాలు నిర్వహిస్తామని నగరం, ఠాణే జిల్లాకు చెందిన సార్వజనిక ఉట్టి ఉత్సవ మండళ్లు ప్రభుత్వానికి, బాలల హక్కుల సంఘానికి సవాలు విసిరాయి. అందుకు మహిళ గోవిందాందాలు కూడా మద్దతు పలికాయి. దీంతో ఏం చేయాలో తెలియక మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారు. ఇదిలాఉండగా ఈ సమస్యపై త్వరలో పరిష్కారం కనుగొంటామని మహారాష్ట్ర రాష్ట్ర బాలల హక్కు ల సంరక్షణ కమిషన్ అధ్యక్షుడు ఉజ్వల్ ఉకే అన్నారు. గృహనిర్మాణ శాఖ సహా య మంత్రి సచిన్ అహిర్ సైతం ఈ వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని వా రం కిందట ప్రకటించారు. కాని ఇంతవరకు సమస్య ఓ కొలిక్కిరాకపోవడంతో ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారనేది ఉత్కంఠగా మారింది.