పాఠశాలల్లో జంక్ ఫుడ్ పై నిషేధం
Published Fri, Jul 15 2016 1:54 PM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM
ఛండీగఢ్: పంజాబ్ లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జంక్ ఫుడ్ ను పూర్తిగా నిషేధిస్తూ బాలల హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అనేక కమిటీల నివేదికల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కమిషన్ చైర్మన్ సుకేష్ కాలియా పేర్కొన్నారు. జంకు ఫుడ్ లో చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న కారణంగా హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబెసిటీ, మానసిక సమస్యలు వస్తున్నాయని అందుకే ఈనిర్ణయం తీసుకున్నామని కాలియా తెలిపారు.
Advertisement
Advertisement