
సాక్షి, విజయనగరం: జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బృందం మంగళవారం జిల్లాకు చేరుకుంది. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పరేష్ షా ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృందం చేపట్టిన మూడు రోజుల పర్యటన ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలుత జిల్లా కేంద్ర ఆసుపత్రిని బృంద సభ్యులు సందర్శించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. ఇక పర్యటన చివరి రోజైన 8వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో... బాలల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించనున్నారు. ఈ బృందంలో ఇతర సభ్యులుగా మానసిక నిపుణురాలు ఊర్వశి, కల్పన, సుకన్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment