సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్.. తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాము. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాము. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా ప్రలజకు అందుబాటులో ఉండాలి.
అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను అప్రమత్తం చేశాము. ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్ట్ రేపు ఉదయానికల్లా నిండుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేశాము. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అవసరమైతే హెలికాప్టర్లను కూడా వాడుకోవాలని సూచించాము. మంత్రులు జిల్లా కేంద్రాల్లో ఉండి సమీక్షలు చేపట్లాలి. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment