rains forecast
-
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
-
హైదరాబాద్‌లో వర్షం.. వానలోనే గణనాథుల నిమజ్జనం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం ప్రారంభమైంది. ట్యాంక్ బండ్లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్న సందర్భంగా వర్షం కురుస్తుండటం ఇబ్బందికరంగా మారింది. వర్షంలోనే ట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. బషీర్‌బాగ్, ఎంజే మార్కెట్, ట్యాంక్ బండ్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక, వర్షంలోనే గణనాథులు ట్యాంక్ బండ్‌పైకి తరలి వస్తున్నాయి. వర్షంలోనే వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విగ్రహాల తరలింపునకు ఆటంకం కలుగుతోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్ గణనాథుల నిమజ్జనం ముగిసింది. #28SEP 5PM⚠️ HEAVY THUNDERSTORMS ALERT FOR South -East #Hyderabad ⛈️#SaroorNagar,#Uppal,#Malakpet,#Amberpet ,#Ou ,#Secunderabad surroundings Seeing Intense Downpour⛈️⚠️ & These Stroms will Later Spread towards Central City.,#HyderabadRains pic.twitter.com/fjHhxcvUxR — Hyderabad Rains (@Hyderabadrains) September 28, 2023 Hyderabad right now! #rain #hyderabadrains #weather pic.twitter.com/r8lyCBXmEg — Stella Paul (@stellasglobe) September 28, 2023 మరోవైపు.. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హిమాయత్‌నగర్, కవాడిగూడ, నారాయణగూడ, ముషీరాబాద్, ఉప్పల్, అంబర్పేట్, ఓయూ, తర్నాక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. #24HrWx #Telangana #Hyderabad High chances of thunderstorms in parts of the city particularly in the evening time. pic.twitter.com/fBpORkJxeg — Weather@Hyderabad|TS|AP 🇮🇳 (@Rajani_Weather) September 28, 2023 RED WARNING FOR HYDERABAD ⚠️ As expected, Huge thunderstorms clouds forming in Central Zone like Himayatnagar, Kavadiguda, Narayanguda, Musheerabad, Uppal, Amberpet, OU, Tarnaka side will later cover other parts too. Get ready for the blast 🔥⚡️⚡️⚡️⚡️#HyderabadRains — Telangana Weatherman (@balaji25_t) September 28, 2023 Pouring really hard. Almost like a curtain/waterfall. Can't see anything. Video somehow there's some visibility. #HyderabadRains pic.twitter.com/PmVPU4dEHd — VT-RRB ◢◤ (@rb_41) September 28, 2023 -
రాష్ట్రానికి మరో 36 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం
-
ఏపీలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
-
తెలంగాణలో వర్షాలు, వరదలపై సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్
-
ఏపీ వాసులకు అలర్ట్.. మూడురోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద తెలిపారు. పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో పాటు, కొన్ని చోట్లు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని సునంద తెలిపారు. మంగళవారం పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా వర్షాలు పడటంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిసింది. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. చదవండి: ‘రైతులను అడ్డంపెట్టుకుని రామోజీ గలీజు రాతలు’ తీవ్రమైన ఎండలు మండే మే నెలలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రమంతా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి అనేక జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, నంద్యాల, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చదవండి: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో 4600 కోట్ల పెట్టుబడి: కరికాల వలవన్ -
తీరంలో అలజడి
సాక్షి, విశాఖపట్నం/వాకాడు (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా వాకాడు తీరంలో భీకర శబ్దాలతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు భూమధ్యరేఖ ప్రాంతం మీదుగా ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫిరిక్ స్థాయి వరకు విస్తరించి ఉంది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం నైరుతి బంగాళాఖాతం మీదుగా నెమ్మదిగా పయనిస్తూ ఫిబ్రవరి 1 నాటికి శ్రీలంక తీరానికి చేరుకుంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం నెలకొంటుందని, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పొగ మంచు ఏర్పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. కాగా, ఆదివారం వేకువజామున రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఆర్.అనంతపురం (శ్రీసత్యసాయి)లో 9.6, ముత్తుకూరు (చిత్తూరు)లో 10, నిమ్మనపల్లె (అన్నమయ్య)లో 10.9, వల్లెవీడు (తిరుపతి)లో 11.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముందుకొచ్చిన సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఆదివారం వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో ఈదురు గాలులు వీస్తుండగా.. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దీంతో సముద్రం దాదాపు 5 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొచ్చి తీరాన్ని తాకుతోంది. సముద్రంలో అలలు 5 అడుగుల మేర ఎగసిపడటం, బోట్లు నిలబడే పరిస్థితి లేకపోవడంతో తిరుపతి జిల్లాలోని చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాల్లో సముద్రంలో వేటకు వెళ్లడంపై నిషేధం విధించారు. -
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖను ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం అదే దిశలో కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో వెల్లడించింది. వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఫిబ్రవరి 1న శ్రీలంక తీరానికి చేరుకుంటుందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 30వ తేదీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. మరోవైపు రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. పలు ప్రాంతాల్లో పొగమంచు కూడా ఏర్పడుతుందని తెలిపింది. కాగా.. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతల క్షీణత కొనసాగుతోంది. అరకు లోయలో 7.1, పెద ఉప్పరాపల్లి (చిత్తూరు) 8.8, ఆర్.అనంతపురం (శ్రీసత్యసాయి) 9, బెలుగుప్ప (అనంతపురం) 9.5, పెద్ద తిప్పసముద్రం (అన్నమయ్య) 10.3, హలహర్వి (కర్నూలు) 10.5, వల్లివేడు (తిరుపతి)ల్లో 10.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఐదు నదులూ ఒకే సమయంలో సముద్రం వైపు.. చరిత్రలో తొలిసారి
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/ విజయపురి సౌత్: చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో ప్రవహించే 5 నదులూ ఒకేసారి సముద్రంలో కలుస్తున్నాయి. పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఈ నదుల జలాలు కడలి వైపు పరుగులు తీస్తున్నాయి. ఐదు నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండి, మిగులు జలాలు ఒకేసారి సముద్రంలో కలవడం చరిత్రలో ఇదే తొలి సారి. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.22 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3.33 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు, నెల్లూరు బ్యారేజ్ నుంచి 35 వేల క్యూసెక్కుల పెన్నా జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 18,702 క్యూసెక్కుల వంశధార జలాలు, నారాయణపురం ఆనకట్ట నుంచి 20 వేల క్యూసెక్కుల నాగావళి జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. కృష్ణా , ఉప నదులు తుంగభద్ర, వేదవతి, భీమా, హంద్రీలు ఉరకలు వేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,47,018 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 10 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1013, కల్వకుర్తి ద్వారా 800 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,014 క్యూసెక్కులు, స్పిల్ వే 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,170 వెరసి 4,38,184 క్యూసెక్కును దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.3 అడుగుల్లో 211.47 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లోకి 3,94,058 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక్కడి నుంచి కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువలకు 12,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ స్పిల్ వే గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 3,81,358 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్‌లో 588.1 అడగుల్లో 306.39 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతలలో 4,18,247 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 3,42,136 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతలలో 168.5 అడగుల్లో 36.27 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్‌లోకి 4,23,813 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 10,153 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,22,660 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ► బేసిన్లో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరిలోనూ వరద ఉద్ధృతి పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 3,39,015 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 5,100 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 3,33,915 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ► పెన్నాలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్ర సరిహద్దులోని అప్పర్ పెన్నార్ నుంచి నెల్లూరు బ్యారేజ్ వరకు పెన్నాపై ఉన్న ప్రాజెక్టులనీన నిండిపోవడంతో వాటి గేట్లను ఎత్తేసి, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. నెల్లూరు బ్యారేజ్‌లోకి 38 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 3 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 35 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ► ఒడిశా, ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. గొట్టా బ్యారేజ్‌లోకి వంశధార నుంచి 20,675 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,973 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 18,702 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 20,600 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 600 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 20 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం (నేడు) ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల కుండపోతగా వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అలాగే ఈ నెల 7న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. కాగా 7న ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయి. ఫలితంగా 7, 8 తేదీల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా, కొన్నిచోట్ల విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కాగా అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఇది మూడో అల్పపీడనం.. నైరుతి రుతుపవనాల సీజను ప్రారంభమయ్యాక ఇప్పటివరకు బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. కానీ అవి అల్పపీడనాలకే పరిమితమయ్యాయి తప్ప వాయుగుండంగా బలపడలేదు. జూలై 9న వాయవ్య బంగాళాఖాతంలో, 16న అదే ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 7న ఏర్పడబోయే అల్పపీడనం మూడోది. -
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు, జీహెచ్ఎంసీ అత్యవసర భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గురువారం పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నేటి సాయంత్రం వానలు కురిశాయి. అయితే, మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు వర్షాలపై జీహెచ్ఎంసీ అత్యవసరంగా సమావేశమైంది. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 040-21111111, 040-29555500 వాగులో ప్రాణాలు అరచేతపట్టుకుని కామారెడ్డి జిల్లాలోని శెట్పల్లి వాగులో చిక్కుకుపోయిన ముగ్గురిని స్థానికులు,పోలీసుల సహకారంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. చేపల వేటకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు వరద ఉధృతి ఎక్కువ కావడంతో చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. చెట్టుపైనే ఉండి సాయం కోసం ఎదురుచూశారు. విషయం తెలుసుకున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఘటనస్థలానికి పంపించారు. తాడు సాయంతో వారు బాధితులను ఒడ్డుకు చేర్చారు. దీంతో కొన్ని గంటల ఉత్కంఠకు తెరపడింది. స్థానికులు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఒడ్డుకు చేరిన అనంతరం బాధితులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. -
CM KCR: భారీ వర్షాలు.. ప్రజలను హెచ్చరించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్.. తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాము. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాము. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా ప్రలజకు అందుబాటులో ఉండాలి. అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను అప్రమత్తం చేశాము. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ రేపు ఉదయానికల్లా నిండుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశాము. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అవసరమైతే హెలికాప్టర్లను కూడా వాడుకోవాలని సూచించాము. మంత్రులు జిల్లా కేంద్రాల్లో ఉండి సమీక్షలు చేపట్లాలి. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. -
TS: ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. జాగ్రత్తలు తప్పనిసరి!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వాగులు వంకలు పొర్లిపొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల నేపథ్యంలో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లోని అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలకు అండగా నిలిచి అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. సహాయక చర్యల్లో ప్రజలకు సాయపడుతూ నష్టం జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు.మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన రెవెన్యూ సదస్సులను వాయిదా వేశారు. pic.twitter.com/KqCXB7O44U — IMD_Metcentrehyd (@metcentrehyd) July 9, 2022 ఇదిలా ఉండగా.. తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉందని స్పష్టం చేశారు. మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో ప్రజలు.. అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. EXTREME RAIN ALERT - JULY 9 2022 ⚠️ Today there will be VERY HEAVY DOWNPOURS in North Telangana districts and East Telangana will get HEAVY RAINS. South Telangana will get MODERATE RAINS Hyderabad will also get MODERATE RAINS pic.twitter.com/k9e9bUwHhG — Telangana Weatherman (@balaji25_t) July 9, 2022 -
24 గంటల్లో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు వచ్చే 24 గంటల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. ప్రస్తుతం పుణే, బెంగళూరు, పుదుచ్చేరి ప్రాంతాల్లో రుతుపవనాలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. సోమవారానికి రాయలసీమ ప్రాంతంతోపాటు తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ మధ్య–వాయవ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లోకి రుతుపవనాలు విస్తరించే అవకాశముందని తెలిపింది. ఆ తర్వాత మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. రుతు పవనాలు విస్తరిస్తున్న క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 4 నాటికే రుతుపవనాలు రాయలసీమను తాకాల్సి ఉంది. అయితే పశ్చిమ గాలుల ప్రభావం, ఉపరితల ఆవర్తనం వల్ల ఉష్ణోగ్రతలు పెరగడంతో ఏపీలోకి విస్తరించడం ఆలస్యమైంది. ప్రస్తుతం పశ్చిమ గాలుల ప్రభావం తగ్గి ఉష్ణోగ్రతలూ తగ్గడంతో రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయని, 24 గంటల్లో రాయలసీమను తాకుతాయని అధికారులు వివరించారు. -
దూసుకొస్తున్న ‘అసని’ తుపాను
సాక్షి, అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది వాయవ్య దిశగా వేగంగా కదులుతూ ఆదివారం ఉదయానికి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానుగా మారితే దీనికి ‘అసని’గా నామకరణం చేయనున్నారు. ఇది శ్రీకాకుళం–ఒడిశా తీరం మధ్య ఈ నెల 10వ తేదీన తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం అంత తీవ్రంగా ఉండదని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక చోట్ల వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో పలుచోట్ల ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, దీని ప్రభావంతో శనివారం విశాఖ, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నా ఆ తర్వాత వాతావరణం చల్లబడింది. పిడుగులు పడి ముగ్గురు దుర్మరణం ఆమదాలవలస రూరల్, సరుబుజ్జిలి: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నెల్లిపర్తి, బూర్జ మండలం పణుకుపర్త గ్రామాల్లో శనివారం పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. నెల్లిపర్తిలో గరికపాటి ఏకాశి (52), పొదిలాపు చిన్నలక్ష్మి (39) కంసాల చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా పిడుగుపడింది. దీంతో ఇద్దరూ ఉన్నచోటే కుప్పకూలిపోయారు. సహచరులు వారిద్దరినీ ఇంటికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలుపోయాయి. బూర్జ మండలం పణుకుపర్తలో పశువుల్ని మేపేందుకు వెళ్లిన కొండ్రోతు మేఘన (12) అనే బాలిక ఉరుములు, మెరుపులు రావడంతో తోటివారితో కలిసి ఓ చెట్టు కిందకు వెళ్లింది. అక్కడే పిడుగు పడటంతో అపస్మారక స్థితికి చేరింది. ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వీరందరినీ పాలకొండ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ మేఘన చనిపోయింది. -
పెరగనున్న చలి గాలుల తీవ్రత: వాతావరణ శాఖ
-
18 తర్వాత తుపాను!
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అండమాన్ సముద్రంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. సోమవారం (ఈ నెల 15న) ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అనంతరం ఇది ఈ నెల 17న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడి.. 18వ తేదీన దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపించి జవాద్ తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఈశాన్య గాలులు రాష్ట్రంపై కొనసాగుతుండటం వల్ల.. సోమ, మంగళవారాల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో కందుకూరులో 87.25 మి.మీ., దివ్వారిపాలెంలో 82.5, కదిరిలో 67.25, గండ్లపేటలో 58.75, పెనుకొండలో 58, నిమ్మనపల్లెలో 57.25, నల్లమడలో 54.25, బెస్తవారిపేటలో 49, రాచర్లలో 45.25, పులివెందులలో 45, నగరిలో 42 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
స్థిరంగా అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): తమిళనాడు, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఉంది. దీనికి అనుబంధంగా విస్తరించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రాగల 48 గంటల్లో ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతానికి ప్రవేశించి పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఆ తరువాత 48 గంటల్లో ఉత్తర వాయువ్యంగా ప్రయాణించి మరింత బలపడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకు మన్నార్ గల్ఫ్, తమిళనాడు తీర ప్రాంతం మీదుగా సముద్ర మట్టం వద్ద ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, తిరుమలలో సోమవారం వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు కుండపోత వర్షం కురిసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని జలాశయాలలో నీటిమట్టం పెరుగుతోంది. -
అక్కడక్కడా తేలికపాటి వర్షాలకు చాన్స్
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరిస్తోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఈ కారణంగా రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ ప్రాంతంలోనూ కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య గాలుల ప్రభావం, తేమ గాలులు వీస్తుండడం వల్ల నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా..రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణం క్రమంగా ప్రారంభమయ్యింది. ఈ నెల 23 నాటికి సగానికిపైగా ప్రాంతాల నుంచి, 26న పూర్తిగా నైరుతి ఉపసంహరణ ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో 26వ తేదీన ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. -
బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 24 గంటల్లో ఇది పశ్చిమ–వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. -
ముందే ఈశాన్య రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: మంచి వర్షాలు అందించిన నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న వేళ.. మరో చల్లని కబురు అందింది. నైరుతి మాదిరిగానే ఈశాన్య రుతుపవనాలు కూడా ముందే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. సాధారణంగా అక్టోబర్ చివరి వారంలో రావాల్సిన ఈశాన్య రుతుపవనాలు ఈ ఏడాది అక్టోబర్ మూడో వారంలోనే రానున్నట్లు భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఈశాన్య రుతుపవనాల రాకతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంపై మంచి ప్రభావమే చూపించాయి. 13 జిల్లాలోనూ మంచి వర్షాలు కురిశాయి. ఏడు జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 560 మిల్లీమీటర్లు. ఈ కాలంలో ఈ ఏడాది 8.77 శాతం అధికంగా మొత్తం 609.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. చిత్తూరులో 49 శాతం అధికంగా వర్షాలు కురవగా విశాఖపట్నంలో 37, విజయనగరంలో 36, గుంటూరులో 33, వైఎస్సార్ కడపలో 32, తూర్పు గోదావరిలో 29, కృష్ణా జిల్లాలో 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. రెండురోజులు తేలికపాటి వానలు ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణాంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో పెనమలూరులో 63.8 మీల్లీమీటర్లు, వేటపాలెంలో 58.5, మచిలీపట్నంలో 55.6, రాజమండ్రిలో 54.8, మంగళగిరిలో 51, టి.నర్సాపురంలో 49, తణుకులో 48.8, ఒంగోలులో 45.6, పెడనలో 43.8, చింతలపూడిలో 43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
28న మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఒడిశా తీరంలోని ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఈ నెల 28న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బిహార్ వైపు వెళ్లి బలహీనపడింది. దీంతో దాని ప్రభావం రాష్ట్రంలో తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. -
తెలంగాణలో మరో రెండ్రోజులు వానలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు సూచించింది. దీనికి అనుబంధంగా ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి వ్యాపించి ఉన్నట్లు వివరించింది. వాటి ప్రభావంతో రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు సైతం నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 30 సెం.మీ. వర్షపాతం.. రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8:30 గంటల వరకు 1.93 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో ఇప్పటివరకు 30.17 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా 16 జిల్లాల్లో అధికం, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో 11.8 సెం.మీ., వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేటలో 11.3 సెం.మీ., వరంగల్‌లో 10.1 సెం.మీ., ఖానాపూర్‌లో 10 సెం.మీ. వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు మండలాల్లో అతిభారీ, 20కిపైగా మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. -
11న అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తా తీరంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి మంగళవారం మధ్యాహ్నానికి బలహీనపడింది. ఈ నెల 11 లేదా 12న బంగాళాఖాతంలో కోస్తాకు సమీపంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఇది క్రమంగా దిశ మార్చుకుని ఒడిశా వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 11, 12 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పారు. కోస్తాంధ్రలో బుధవారం ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు పడతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. రుతుపవనాలు బలహీనంగా ఉన్న సమయంలో రాయలసీమలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలున్నాయి. గడిచిన 24 గంటల్లో విజయనగరంలో 7 సె.మీ, గరివిడిలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.