
ఉత్తర కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రాష్ట్రంలో రాబోయే రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది.
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తర కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రాష్ట్రంలో రాబోయే రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రతోపాటు రాయలసీమలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురియవచ్చని పేర్కొంది. బుధవారం విశాఖలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
చదవండి: సీఎం జగన్ మరో చరిత్రాత్మక నిర్ణయం
టీడీపీ నేతకు అండగా నిలిచిన సీఎం రిలీఫ్ ఫండ్