
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఒడిశా తీరంలోని ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఈ నెల 28న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బిహార్ వైపు వెళ్లి బలహీనపడింది. దీంతో దాని ప్రభావం రాష్ట్రంలో తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.