
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులు పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవిస్తాయని, దట్టమైన మేఘాలు కమ్ముకుంటాయని పేర్కొంది. అదే విధంగా ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు భారీవర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.