
మెహిదీపట్నంలో వర్షం,గచ్చిబౌలిలో ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాం తాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడే నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. సాయంత్రం విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల నుంచి బయల్దేరిన ప్రయాణికులు, వాహనచోదకులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. రాత్రి 10 గంటల వరకు 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో నగరంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రలో 7.6 కి.మీ ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాయవ్య బంగాళా ఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అల్పపీడనం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment