దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమకు వానముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి మంగళవారం శ్రీలంకకు సమీపంలో స్థిరంగా కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.