
దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు శీతాకాలపు సెలవులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఈసారి పాఠశాలలకు శీతాకాలపు సెలవులు 6 రోజులు మాత్రమే ఉండనున్నాయి. గతంలో జనవరి ఒకటి నుండి జనవరి 15 వరకు పాఠశాలకు సెలవులు ఇచ్చేవారు. అయితే ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం పాఠశాలలు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు మాత్రమే మూసివేయనున్నారు.
ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉన్నందున ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నవంబర్ 9 నుండి నవంబర్ 18 వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. అందుకే పిల్లల చదువులను దృష్టిలో ఉంచుకుని ఈసారి శీతాకాలపు సెలవులను తగ్గించాలని నిర్ణయించారు. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో.. 2023-24 అకడమిక్ సెషన్‌లో శీతాకాలపు సెలవులు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు ఉండనున్నాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment