winter effect
-
విద్యార్థులకు శీతాకాలపు సెలవులు తగ్గింపు
దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు శీతాకాలపు సెలవులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఈసారి పాఠశాలలకు శీతాకాలపు సెలవులు 6 రోజులు మాత్రమే ఉండనున్నాయి. గతంలో జనవరి ఒకటి నుండి జనవరి 15 వరకు పాఠశాలకు సెలవులు ఇచ్చేవారు. అయితే ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం పాఠశాలలు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు మాత్రమే మూసివేయనున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉన్నందున ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నవంబర్ 9 నుండి నవంబర్ 18 వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. అందుకే పిల్లల చదువులను దృష్టిలో ఉంచుకుని ఈసారి శీతాకాలపు సెలవులను తగ్గించాలని నిర్ణయించారు. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో.. 2023-24 అకడమిక్ సెషన్లో శీతాకాలపు సెలవులు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు ఉండనున్నాయని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు -
తెలుగు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు
-
చలి ఎఫెక్ట్: రాబోయే నాలుగు రోజులు జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో చలికాల ప్రభావం మొదలైంది. ప్రధాన నగరాలతో పాటు ముఖ్యపట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గురువారం చలి విజృంభణ కనిపిస్తోంది. ఉదయం చలిగాలుల ఉధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సీజనల్ వ్యాధులతో పాటు శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా.. పట్టణాల్లోనూ చలి ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పొద్దుపొద్దునే రహదారులన్నీ పొగమంచు కప్పుకోవడంతో.. ప్రయాణికులు ఇబ్బంది పడుతోన్నారు. రోజు రోజూ రాత్రి , పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఒకవైపు.. తెలంగాణాలోని అన్ని జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుంది. పలు జిల్లాల్లో ఇప్పుడే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, అదిలాబాద్ జిల్లాల్లో చలి బీభత్సంగా కనిపిస్తోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. HIGH INTENSE COLD weather ahead even tonight in entire Telangana. Humidity has dropped to season's lowest so far and cool winds coming from North. Super cool weather with min temp upto 7°C in rural TS and upto 11°C expected in parts of Hyderabad 🥶⚠️ — Telangana Weatherman (@balaji25_t) November 16, 2022 మరోవైపులోనూ ఏపీలోనూ చలి విజృంభిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పాడేరులో 12, మినుములురులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అరుకులోయలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాబోయే నాలుగు రోజులు చలి విజృంభణ మరింతగా ఉంటుందని, కాబట్టి, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ తర్వాతి పరిస్థితిని బట్టి మరిన్ని సూచనలు చేస్తామని తెలిపారు. -
మన్యంలో చలి పులి
పాడేరు: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతుండడంతో పాటు పొగమంచు దట్టంగా కురుస్తున్నది. చింతపల్లిలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు దిగజారాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లి ప్రాంతంలో సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వ్యాప్తి చెందుతుండడంతో మన్యం వాసులు చలిపులితో ఇబ్బందులు పడుతున్నారు. గురువారం పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 10 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డు వద్ద 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలు మూసివేత
డెహ్రాడూన్: హిమాలయాల్లో ఉన్న ప్రఖ్యాత కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలను శనివారం మూసివేశారు. ఈ ఆలయాలను భారీగా మంచుపడే శీతాకాలంలో ఏటా మూసివేస్తుంటారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం కేదార్నాథ్ ఆలయ ద్వారాలను శనివారం ఉదయం 8 గంటలకు, యమునోత్రి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసినట్లు చార్‌థామ్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని పేర్కొంది. శీతాకాల బసకోసం ఆయా ఆలయాల్లోని బాబా కేదార్, మాత యమున విగ్రహాలను అందంగా అలంకరించిన పల్లకిలో ఉఖిమఠ్, ఖర్సాలీ ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు తెలిపింది. గంగోత్రి ఆలయం శుక్రవారం మూతపడగా, బద్రీనాథ్ ఆలయ ద్వారాలను ఈ నెల 20వ తేదీన మూసివేస్తారు. -
మార్కెట్ యార్డు లేక రైతులకి చలిలో ఇబ్బందులు
సాక్షి, కొత్తగూడ: రైతులకీ ఎటు చూసిన కష్టాలే.. పంటను పండించాలంటే పెట్టుబడి కి డబ్బుతో.. పండించే సమయంలో నీటి సమస్యలు.. పండించాక పంట కొనుగోలు సమస్యలు.. అన్నింటినీ భరిస్తూ పనులు చేసుకుందామంటే ఈ చలితో చనిపోతున్నారు. ఏజెన్సీలో చలి విపరీతం అవుతోంది. రైతులు పనులు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో మార్కెట్ యార్డు లేకపోవడం వల్ల రైతులు ధాన్యాన్నిరోడ్లపై ఆరబోసుకుని చలిలో ఇబ్బందులు పడుతున్నారు. చలిమంటలు పెట్టుకుని నిద్రిస్తున్నారు. ఇప్పటికైనా మండల కేంద్రంలో మార్కెట్ యార్డు ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు. -
బూటిజం..
చలికాలం వచ్చేసిందంటే, జనం వెచ్చదనం కోసం వెంపర్లాడతారు. అవకాశం దొరికితే దుప్పటి ముసుగు తన్నేసి ముడుచుకుపోతారు. ముసుగు తన్నేసే అవకాశం ఎల్లవేళలా ఉండదు కదా! చలి తాకిడి ఎంతగా వణికిస్తున్నా, పనుల కోసం బయటకు రాక తప్పదు. బయటకు వచ్చేటప్పుడు స్వెటర్లు, శాలువలు.. జాకెట్లు, జర్కిన్లు.. మఫ్లర్లు, మంకీక్యాపులు.. దొరికినవి దొరికినట్టుగానే చుట్టేసుకుని, ముసుగువీరుల్లా వీధుల్లోకి వస్తారు. వెచ్చదనం కోసం పైపైనే కప్పుకునే వారు, పాదాలను మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడూ వాడే చెప్పులు లేదా షూస్‌తోనే సరిపెట్టేసుకుంటారు. అయితే, ఫ్యాషన్ప్రియుల తీరే వేరు. ఏ కాలంలోనైనా కళాపోషణలో తీసిపోరు. నిజానికి మిగిలిన కాలాలతో పోలిస్తే, ఫ్యాషన్‌కు అనువైనది. మిరుమిట్లు గొలిపే రంగు రంగుల ఉలెన్ దుస్తులను ధరించవచ్చు. కాలిపిక్కల వరకు కవర్ చేసే బూట్లు తొడగవచ్చు. చలికాలంలో ఎన్ని రకాల దుస్తులు తొడిగినా, వాటికి నప్పే బూట్లు ధరిస్తేనే వింటర్ అలంకరణ పూర్తయినట్లని ఫ్యాషన్ నిపుణుల అభిప్రాయం. పెపె పంప్స్, ఉలెన్ బూట్స్, టైగర్ ప్రింటెడ్ బూట్స్ వంటి వెరైటీ బూట్లు ఈ సీజన్లో సరికొత్తగా అందుబాటులోకి రావడంతో అమ్మాయిలు వీటిని ధరించి ట్రెండీగా కనిపిస్తున్నారు. పెన్సిల్ కట్ జీన్స్, స్కర్ట్స్ ధరించినప్పుడు వాటికి జతగా మోకాలి వరకు కప్పి ఉంచే బూట్లు ధరిస్తే, ఆ లుక్కే అదరహో! అనిపిస్తుంది. బూట్లు ధరించినప్పుడు యాక్సెసరీలు తక్కువగా ధరించడం మంచిది. అలాగైతేనే, అందరి దృష్టీ బూట్లపై నిలుస్తుంది. టాప్ టిప్స్.. బూట్లు ధరించినప్పుడు టిప్ టాప్‌గా కనిపించాలంటే, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. ఫ్యాషన్ నిపుణులు సూచించే టాప్ టిప్స్ ఇవే.. డెనిమ్ షార్ట్ ప్యాంట్, మందంగా ఉండే స్కేటర్ స్కర్ట్ వంటి వాటిపై బూట్లు ధరిస్తే, తప్పనిసరిగా స్టాకింగ్స్ వాడాలి. అలాంటప్పుడు అందరి దృష్టినీ ఆకర్షించాలంటే, జుట్టును బన్‌లా ముడి వేసుకుంటే చాలు. పొడవాటి స్వెట్టర్లు, లాంగ్ జాకెట్లు ధరించినట్లయితే, వాటికి బ్రౌన్‌కలర్ బూట్లు బాగా నప్పుతాయి. పూర్తిగా నల్లని దుస్తులే ధరించేటప్పుడు మాత్రం నల్లని బూట్లే ధరించాలి. వాటికి నప్పేలా రెడ్/ఆరెంజ్/స్కైబ్లూ స్కార్ఫ్‌లు ధరిస్తే అద్భుతంగా కనిపిస్తారు. లేతరంగుల దుస్తులు ధరించినట్లయితే, వాటిపైకి యానిమల్ ప్రింటెడ్ బూట్లు ట్రెండీగా ఉంటాయి. లేసులు ఉన్న బూట్లు, లెదర్ బూట్లను ధరించేటప్పుడు స్టాకింగ్స్ వాడటం తప్పనిసరి అని గుర్తుపెట్టుకోవాలి. - సిద్ధాంతి