
పాడేరులో దట్టంగా పొగమంచు
పాడేరు: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతుండడంతో పాటు పొగమంచు దట్టంగా కురుస్తున్నది. చింతపల్లిలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు దిగజారాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లి ప్రాంతంలో సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వ్యాప్తి చెందుతుండడంతో మన్యం వాసులు చలిపులితో ఇబ్బందులు పడుతున్నారు. గురువారం పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 10 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డు వద్ద 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment