
ధాన్యం వద్ద చలిలో పడుకున్న రైతు
సాక్షి, కొత్తగూడ: రైతులకీ ఎటు చూసిన కష్టాలే.. పంటను పండించాలంటే పెట్టుబడి కి డబ్బుతో.. పండించే సమయంలో నీటి సమస్యలు.. పండించాక పంట కొనుగోలు సమస్యలు.. అన్నింటినీ భరిస్తూ పనులు చేసుకుందామంటే ఈ చలితో చనిపోతున్నారు. ఏజెన్సీలో చలి విపరీతం అవుతోంది. రైతులు పనులు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో మార్కెట్ యార్డు లేకపోవడం వల్ల రైతులు ధాన్యాన్నిరోడ్లపై ఆరబోసుకుని చలిలో ఇబ్బందులు పడుతున్నారు. చలిమంటలు పెట్టుకుని నిద్రిస్తున్నారు. ఇప్పటికైనా మండల కేంద్రంలో మార్కెట్ యార్డు ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు.

ధాన్యం వద్ద చలిలో పడుకున్న రైతు

ధాన్యం వద్ద చలిలో పడుకున్న రైతు
Comments
Please login to add a commentAdd a comment