formers problems
-
మోదీ సీటు.... మినీ భారత్
సాధారణంగా ఒక నియోజకవర్గంలో పోటీ చేసే వారంతా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వారై ఉంటారు. కొందరు ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తుంటారు. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజక వర్గంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పోటీ చేస్తుండటం విశేషం. ఈ నియోజకవర్గంలో మోదీతో పాతిక మంది తలపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్, కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ పాతిక మంది ఇక్కడ ఇండిపెండెంట్లుగా ప్రధాని మోదీపై పోటీకి దిగారు. తాము నెగ్గాలన్న కోరిక తో కాకుండా తమ సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లాలన్న ఆశతోనే వీరు బరిలోకి దిగారు. ఇక్కడ మోదీ గెలుపు ఏకపక్షమేనన్న సంగతి తెలిసిందే. ‘ఈ ఎన్నికల్లో గెలుస్తామని మేమెవరం అనుకో వడం లేదు. అయితే, ప్రధానితో పోటీ చేయడం ద్వారా మా సమస్యను దేశం దృష్టికి తేవాలన్నదే మా ఆశ’ అని వీరు స్పష్టం చేస్తున్నారు. ‘మోదీని ఓడించాలని నేనిక్కడికి రాలేదు. రైతుల దుస్థితిని ప్రజల దృష్టికి తేవడానికే పోటీ చేస్తున్నాను’ అన్నా రు మహారాష్ట్ర అభ్యర్థి మనోహర్ ఆనంద్ రావ్ పాటిల్. ఈయన గాంధీజీ వేషంలో ఆయన ఫోటో మెడలో వేసుకుని ప్రచారం చేస్తున్నారు. రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో, వారెంత దుర్భర జీవితం అనుభవిస్తున్నారో చెప్పడం కోసమే తాను ఇంత దూరం వచ్చి పోటీ చేస్తున్నానన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు మానవ్ విశ్వమానవ్. రాయ్‌పూర్ నుంచి వచ్చిన మనీష్ శ్రీవాత్సవ్ పోటీ చేయడానికి కారణం చెబుతూ... ప్రభుత్వ ఉద్యోగులంతా తమ పిల్లల్ని తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నే చికిత్స చేయించుకునేలా ప్రభుత్వం చట్టం చేయాలని కోరారు. గంగానదికి జాతీయ నది హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో మోదీతో తలపడుతున్నానన్నారు ఉత్తరాఖండ్‌కు చెందిన సునీల్ కుమార్. మోదీ సర్కారు అవలంబిస్తున్న అగ్రవర్ణ వ్యతిరేక వైఖరిని ఎండగట్టడానికే బరిలో దిగానని రాయబరేలికి చెందిన త్రిభువన్ శర్మ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఇక్కడ మోదీపై 41 మంది పోటీ చేశారు. ఈ సారి ఆ సంఖ్య 25కి తగ్గింది. -
మార్కెట్ యార్డు లేక రైతులకి చలిలో ఇబ్బందులు
సాక్షి, కొత్తగూడ: రైతులకీ ఎటు చూసిన కష్టాలే.. పంటను పండించాలంటే పెట్టుబడి కి డబ్బుతో.. పండించే సమయంలో నీటి సమస్యలు.. పండించాక పంట కొనుగోలు సమస్యలు.. అన్నింటినీ భరిస్తూ పనులు చేసుకుందామంటే ఈ చలితో చనిపోతున్నారు. ఏజెన్సీలో చలి విపరీతం అవుతోంది. రైతులు పనులు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో మార్కెట్ యార్డు లేకపోవడం వల్ల రైతులు ధాన్యాన్నిరోడ్లపై ఆరబోసుకుని చలిలో ఇబ్బందులు పడుతున్నారు. చలిమంటలు పెట్టుకుని నిద్రిస్తున్నారు. ఇప్పటికైనా మండల కేంద్రంలో మార్కెట్ యార్డు ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు. -
రైతు సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేద ని, దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ శాసన సభాపక్షం బుధవారం భేటీ అయ్యింది. అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలసి చింతల విలేకరులతో మాట్లాడారు. బాబు జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా వస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వోద్యోగాల భర్తీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలే దన్నారు. బీజేపీ కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులపై సభలో నిలదీస్తా మన్నారు. గురువారం టీటీడీపీ, బీజేపీ ఫ్లోర్ కోఆర్డినేషన్ కోసం సమావేశామవు తున్నట్లు, తమ పార్టీ నుంచి బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావులు పాల్గొంటారని చింతల చెప్పారు. వర్షాల వల్ల నష్టపోయిన పత్తి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలన్నారు. -
హలో.. నేను కలెక్టర్ మాట్లాడుతున్నా
కలెక్టర్: నీ పేరు ఏమిటి? రైతు: నా పేరు నరసింహారెడ్డి. కలెక్టర్: ఎందుకు వచ్చావు. రైతు:సార్.. నాకు పంట పొలం ఆన్లైన్ ఎక్కించడంలో అధికారులు తిప్పుతున్నారు. అందుకే ఇక్కడికి వచ్చా. కలెక్టర్: అవునా ... ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు. అసలు సమస్య ఏమిటీ.. రైతు:సమస్య ఏమిటో నాకు తెలియదు సార్. నేను దాదాపు ఐదారు నెలలుగా తిరుగుతున్నా. కలెక్టర్:ఓకే.. నాకు అర్థమైంది. నేను తహసీల్దార్‌తో మాట్లాడతా ఉండు. కలెక్టర్: హలో .. తహసీల్దార్ గారూ.. నేను కలెక్టర్‌ను మాట్లాడుతున్నా.. ఎందుకు నరసింహారెడ్డికి సంబంధించిన పొలం విస్తీర్ణం ఆన్లైన్లో ఎక్కించలేదు. మీకు ఉన్న ప్రాబ్లం ఏమిటి. ఇన్ని రోజులుగా తిరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు. ఎప్పుడు పరిష్కరిస్తారు. మళ్లీ ఈ రైతు నా దగ్గరికి వస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. జాగ్రత్త. దాదాపు రైతును 5 నిమిషాల పాటు తన వద్ద ఉంచుకుని ఆ సమస్యపై కింది స్థాయి అధికారితో మాట్లాడి స్వయంగా కలెక్టరే ఇన్ని రోజుల్లో పరిష్కారమవుతుందని చెప్పడంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేవు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తనదైన శైలిలో అధికారుల్లో మార్పు కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్న కలెక్టర్ బాబురావు నాయుడు ఏది చేపట్టినా అది సంచలనమే అవుతోంది. ప్రత్యేకంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ వచ్చిన కలెక్టర్ ఇప్పుడు ఒక నూతన సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. కడప కలెక్టరేట్లో నిర్వహించే మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసేందుకు ప్రతి సోమవారం పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. కలెక్టర్ కూడా ప్రస్తుతం ల్యాప్‌ట్యాప్ ద్వారా కొత్త విధానంతో అక్కడికక్కడే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ప్రజలు అర్జీలు తీసుకుని తన వద్దకు రాగానే కలెక్టర్ అక్కడే పరిశీలించి.. అక్కడే పరిష్కారం చూపడం..మండల కేంద్రాలకు సంబంధించి సమస్య అక్కడే పరిష్కారం కావాల్సిన పరిస్థితుల్లో ల్యాప్‌ట్యాప్ ద్వారా సంబంధిత మండల కేంద్రానికి ఫోన్ చేసి కలెక్టర్ స్వయంగా మాట్లాడుతున్నారు. మొదటగా ‘హలో.. నేను కలెక్టర్‌ను మాట్లాడుతున్నా మీ మండలంలోని ఫలానా గ్రామానికి చెందిన రైతు వచ్చాడు. ఇతనికి సంబంధించి ఫలానా సమస్య పెండింగ్‌లో ఉంది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు పరిష్కారం చేయలేదు. మీ దగ్గరికి చాలా సార్లు తిరిగినా పట్టించుకోలేదు, ఇప్పుడు నా వద్దకు వచ్చాడు. అలాంటి పరిస్థితి మరోసారి తెచ్చుకోకండి, ఇప్పుడు ఆ రైతును మీ దగ్గరికే పంపిస్తున్నా, సమస్యను పరిష్కరించండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే నాతో మాట్లాడండి. వారిని మాత్రం ఇబ్బందులకు గురిచేయొద్దని’ అక్కడికక్కడే జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టర్ ల్యాప్‌ట్యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ తరహాలో మండల అధికారితో మాట్లాడి పరిష్కారం చూపుతుండటం గమనార్హం. కలెక్టర్ ప్రారంభించిన ఈ కొత్త విధానంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ కలెక్టర్ ల్యాప్‌ట్యాప్‌లో చూస్తూ అవతలి అ«ధికారితో మాట్లాడుతుండగా హాల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్ మీద జిల్లా కలెక్టర్‌తోపాటు బాధిత రైతు, మండల కేంద్రంలోని అధికారులు కూడా ఇక్కడి స్కీన్ మీద కనిపిస్తుండటం కొత్త విధానం ప్రత్యేకత. -
తడారి.. చేలు ఎడారి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కాలువలు తడారుతున్నాయి. చేలు ఎడారులను తలపిస్తున్నాయి. రబీలో సాగునీటి ఎద్దడి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వంతులవారీ విధానం సక్రమంగా అమలు కాకపోవడంతో శివారు ప్రాంతాల్లోని చేలు నీరందక బీటలు వారుతున్నాయి. అయితే, చేపల చెరువులకు మాత్రం మోటార్ల సా యంతో యథేచ్ఛగా నీటిని తోడేసుకుంటున్నారు. దీంతో వరి పండిం చే డెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా.. 80 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి ఆయకట్టుకు సాగునీరు ఇస్తామని స్పష్టం చేసింది. సాధారణం గా రబీకి చివరి రోజుల్లో సీలేరు నుంచి అదనపు జలాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది తొలి దశలోనే సాగునీటి ఎద్దడి తలెత్తిం ది. నాట్లు పూర్తికాకుండానే జనవరి 22 నుంచి వంతులవారీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీనివల్ల శివారు ప్రాంతాల్లోని 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సక్రమంగా నీరు అందటం లేదు. చాలాచోట్ల ఆయిల్ ఇంజిన్లు పెట్టి నీరు తోడుకోవాల్సి వస్తోంది. కొన్నిచోట్ల పం ట కాలువలు, బోదెలు నీరులేక తడారిపోవడంతో పొలాలు ఎండిపోయి బీటలు వారుతున్నాయి. ఇదిలావుంటే.. వంతులవారీ విధా నం అమలయ్యే ప్రాంతాల్లో చేపల చెరువులకు కాలువ నీటిని తోడేస్తున్నారు. ఉంగుటూరు, తణుకు, ఉండి నియోజకవర్గాలో కొన్నిచోట్ల వరి పొలాలు బీటలు వారుతున్నా యి. నీటికోసం రైతుల మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి దుబ్బు కట్టే దశలో ఉంది. పొట్ట దశ, ఈనిక దశలో నీరు ఎక్కువ అవసరం అవుతుంది. ఆ సమయంలో తగినంత నీరు అందకపోతే ఎలుకలు చేరి పంటను నాశనం చేస్తాయి. ఇప్పటికే తెగుళ్లు ఆశించి పురుగు మం దుల కోసం ఎక్కువ పెట్టుబడి పె ట్టాల్సి వస్తోంది. ప్రస్తుత అవసరాలకు 6 వేల క్యూసెక్కులు విడుదల చేస్తే తప్ప శివారు ప్రాంతాలకు నీరందే పరిస్థితి లేదు. అయితే, 4 వేల క్యూసెక్కులకు మించి నీరివ్వడం లేదు. మరోవైపు పంట కాలువల్లో గుర్రపుడెక్క, తూడు, కర్రనాచు పెరిగిపోయింది. వీటిని తొలగించే చర్యలు చేపట్టలేదు. పంట బోదెలు ఆక్రమణలకు గురికావడంతో కుచించుకుపోయా యి. డెల్టా ఆధునికరణ పనులు సక్రమంగా జరగకపోవడం వల్లే శివారు ప్రాంతాలకు నీరందని ప రిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి ఆ ధునికీకరణ పనులు కొనసాగుతూ నే ఉన్నాయి. రైతులు ఇప్పటికే ఎకరాకు రైతులు రూ.15 వేల వరకూ పెట్టుబడి పెట్టారు. నీటిసమస్య వల్ల దిగుబడి తగ్గితే నష్టపోవాల్సి వస్తుంది. చాలాచోట్ల లస్కర్ల కొరత వల్ల వంతులవారీ విధానం కూడా సక్రమంగా అమలు కా వడం లేదు. గత ఏడాది శివారు ప్రాంతాలకు అయిల్ ఇంజిన్లు పెట్టుకుంటే ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినా చాలాచోట్ల అమలు కాలేదు. ఈ రబీలో ఆ భరోసా కూడా రైతులకు లేకుండా పోయింది. -
సాగు కష్టాల్లో ఖరీఫ్ రైతులు
రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో సాగునీరందక డెల్టాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌తో కన్నబాబు సమావేశమయ్యారు. జిల్లాలో పలు సమస్యలతోపాటు గడపగడపకూ వైఎస్సార్ జరుగుతున్న తీరును అధినేతకు వివరించారు. ప్రధానంగా ఈస్ట్రన్, సెంట్రల్ డెల్టాలో ఇప్పటికీ సాగునీరులేక నాట్లువేయలేని పరిస్థితి నెలకొందన్నారు. సుమారు 40వేల ఎకరాల్లో రైతులు సాగుచేయడం మనివేసి సాగును విరమించుకున్నా ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని చెప్పారు. తాను కరపతో సహా పలు మండలాల్లో పర్యటించినప్పుడు సాగునీరులేక పొలాలు ఎండిపోతున్న విషయాన్ని రైతులు తెలియజేశారని ఆయన జగన్‌కు వివరించారు. అవసరమైతే రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు ప్రతీనాయకుడు, కార్యకర్తలు ముందుండాలని కన్నబాబుకు జగన్ సూచించారు. ఇటీవల అమలాపురంలో గోవధ అపోహ బాధితుల పరిస్థితిని జగన్ ఆరా తీశారు. వారికి వైద్యం ఏ విధంగా అందుతుంది, ప్రభుత్వం నుంచి సాయం అందిందా? లేదా అనే విషయాలను కన్నబాబును అడిగారు. చిత్తూరు ఎంపీ వరప్రసాద్ సహా పలువురు నాయకులు బాధితులను పరామర్శించారని కన్నబాబు చెప్పారు. పార్టీకి సంబంధించి పలు విషయాలను చర్చించారు. -
పొలమారుతోంది
ఆంధ్రా అన్నపూర్ణగా పేరొందిన ‘పశ్చిమ’లో రైతులకు కొత్త కష్టమొచ్చిపడింది. ముందెన్నడూ ఎరుగని రీతిలో వర్షాకాలంలోనూ నారుమడులు, నాట్లు వేసిన చేలు నీరందక ఎండుతున్నాయి. పలు పంట కాలువలు, బోదెలు నీరు లేక అడుగంటాయి. ఒకవైపు గోదావరి ఉరకలెత్తి ప్రవహిస్తున్నా.. నది చెంతనే ఉన్న మండలాల్లోనూ వరి చేలు బీడువారుతున్నాయి. ఫలితంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొవ్వూరు/పెరవలి/ యలమంచిలి : గోదావరి డెల్టాలోని నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం, పాలకొల్లు తదితర మండలాల్లో నీరందక నాట్లు వేసిన చేలు ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా నాట్లు పూర్తికాలేదు. ఈ మండలాలన్నీ కచ్చితంగా నీరందించాల్సిన పర్మినెంట్ జోన్లో ఉన్నాయి. అయినా అక్కడి రైతులకు నీటికష్టాలు తప్పడం లేదు. మొగల్తూరు మండలంలోని కాళీపట్నం, శేరేపాలెం గ్రామాల రైతులు ఈ ఖరీఫ్‌లో పంట విరామం∙ప్రకటించినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఈ మండలంలో 18,069 హెక్టార్లలో నాట్లు వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు నాట్లు వేసిన విస్తీర్ణం 100 హెక్టార్లు మించలేదు. అయినా ఇక్కడి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రయత్నించటం లేదు. ఆగస్టు రెండో వారం దాటుతున్నా ఇప్పటి వరకు ఈ మండలంలో ఐదుశాతం నాట్లు కూడా పూర్తికాలేదు. యలమంచిలి మండలంలో ఇప్పటికీ సుమారు 1,500 ఎకరాల్లో నాట్లు పడలేదు. దీనిని బట్టి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. .నరసాపురం మండలంలో ఆయకట్టు శివారు ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో నాట్లు వేయలేదు. సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఆయకట్టు ఉన్న మొగల్తూరు, నరసాపురం మండలాలకు చెందిన రైతులు ఈ సీజన్లో పొలాల్లో నాట్లు వేయకపోతే భూములు చౌడుబారిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరవలి, పెనుగొండ మండలాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. పెరవలి మండలం ఖండవల్లి, ఉసులుమర్రు, నల్లాకులవారిపాలెం గ్రామాల్లో నాట్లు ఎండుతున్నాయి. గోదావరిలో పుష్కలంగా నీరున్నా సాగునీరు అందకపోవడం ఏమిటో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్వా పంటకు ఇటువంటి పరిస్థితి కల్పించి.. దాళ్వా సాగు లేకుండా చేయడానికే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రైతులు ధ్వజమెత్తుతున్నారు. దాళ్వాలో గోదావరి నీరంతా పట్టిసీమకు తరలించుకుపోయేందుకే కుయుక్తులు పన్నుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెండ్యాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకం కొవ్వూరు మండలం సీతంపేటలోని విజ్జేశ్వరం విద్యుత్ కేంద్రం(జీటీపీఎస్)లో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో పెండ్యాల పంపింగ్ స్కీమ్ ఆయకట్టు కింద ఉన్న 6,800 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. పశ్చిమ డెల్టా కాలువ నుంచి జీటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తికి తీసుకున్న నీటిని తిరిగి పెండ్యాల స్కీమ్‌కు సరఫరా చేస్తున్నారు. ఈనెల 8 నుంచి జీటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో వారం రోజుల నుంచి నిడదవోలు, పెరవలి మండలాల పరిధిలో ఆయకట్టు రైతులు నీటికోసం అష్టకష్టాలు పడుతున్నారు. మరో వారం రోజులు నీరందకపోతే పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం కాలువ, బ్యాంక్ కెనాల్‌కు అవసరమైన నీరు సరఫరా చేయకపోవడంతో ఆయకట్టు రైతులు ఇబ్బందులు చవిచూస్తున్నారు. మెట్టలో చుక్కనీరులేక.. గోపాలపురం : మెట్టప్రాంతంలోనూ సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గోపాలపురం మండలం గుడ్డిగూడెం, నందిగూడెం, కొవ్వూరుపాడు, తొక్కిరెడ్డిగూడెం గ్రామాల్లోని చెరువులు అడుగంటాయి. ఈ చెరువుల పరిధిలో సుమారు 2,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. గుడ్డిగూడెం దూదుశిల చెరువు చుట్టూ తాడిపూడి కాలువ ఉన్నా ఈ చెరువులో చుక్క నీరు లేదు. భూములు బీడువారాయి. మండలంలో 4,200 హెక్టార్లకుగాను సగమే నాట్లు పూర్తయ్యాయి. చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టి.నరసాపురం మండలాల్లోనూ 80శాతం నాట్లు వేశారు. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడిన ఆయకట్టులో సగం ఆయకట్టులో నాట్లు పడలేదని అధికారులు చెబుతున్నారు. అలాగే కృష్ణా డెల్టా ఆయకట్టు పరిధిలో ఉన్న పెదపాడు మండలంలో 20శాతం మాత్రమే నాట్లు వేశారు. 18,500 ఎకరాల ఆయకట్టుకు గానూ ఇప్పటికీ 13వేల ఎకరాల్లో నాట్లు పడలేదు.పెదవేగి, దెందులూరు మండలాల్లోను ఇదే దుస్థితి నెలకొంది. -
అందని.. రుణమాఫీ
సాక్షి, మహబూబ్‌నగర్ : పంట రుణాలమాఫీ ప్రక్రియ ప్రహసనంగా సాగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా రైతుల రుణాలు రీ షెడ్యూల్ కావడం లేదు. ఇప్పటివరకు ఎన్ని మిస్సింగ్ కేసులు అనేది తేలడం లేదు. దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా ఖాతాదారుల లెక్కలు ఇవ్వడానికి బ్యాంకులు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. చాలాచోట్ల రైతులకు సరైన సమాధానం ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. బ్యాంకర్లు, రెవెన్యూ, వ్యవసాయశాఖల మధ్య సమన్వయలోపం కారణంగా రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. రేపో, మాపో రెండోవిడత నిధులు రానున్న నేపథ్యంలో ఇంకా మొదటి విడతనే పూర్తికాకపోవడంతో రైతుల్లో నిరాసక్తత నెలకొంది. జిల్లాలో 6.07లక్షల మంది రైతులు రూ. 2,096 కోట్ల మేర పంట రుణాల మాఫీకి అర్హులుగా తేల్చారు. అయితే ప్రభుత్వం విడతల వారీగా రుణమాఫీకి శ్రీకారం చుట్టడంతో గత ఏడాది సెప్టెంబర్‌లో తొలి విడతల కింద రూ.681.45 కోట్లు బ్యాంకుల ఖాతాల్లో జమచేశారు. ఇప్పటి వరకు 5.25లక్షల మంది రైతులకు రూ.1980కోట్ల మేర రుణాలు రీషెడ్యూలు చేసుకున్నారు. సుమారు 80లక్షల మంది రైతుల రుణాలు రీషెడ్యూల్ కాలేదు. వీరిలో చాలామందికి రుణమాఫీ ప్రక్రియపై రైతులకు అవగాహన లేకపోవడం, కొందరు చనిపోవడం, మరికొందరు వలస వెళ్లడం వంటి కారణాలతో పంట రుణాల రీ షెడ్యూలు జిల్లాలో పూర్తిస్థాయిలో జరగడం లేదు. కొనసాగుతున్న మిస్సింగ్‌లు... రుణమాఫీ అర్హత కలిగి ఉండి మిస్సింగ్ అయిన కేసులు ఇంకా కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి. ఇంతకాలానికి కూడా కేవలం 20 రోజుల వ్యవధిలో తప్పిపోయిన రుణఖాతాల సంఖ్య 285 వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు దాదాపు మూడు వేలకు పైగా మిస్సింగ్ ఖాతాలు వచ్చాయి. వీటికి రూ.15.03 కోట్ల రుణం అందాల్సి ఉంది. ఇదిలా ఉంటే జిల్లాలో ఇంకా 82వేల వరకు రుణాలు రీ షెడ్యూల్ కావాల్సి ఉంది. చాలాచోట్ల అర్హత కలిగిన రైతులకు సైతం రుణమాఫీ కావడం లేదు. బ్యాంకర్ల సహాయ నిరాకరణతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మిస్సింగ్ కేసులు సకాలంలో గుర్తించి న్యాయం చేయడంలో రెవెన్యూశాఖ కూడా విఫలమవుతోంది. అదేవిధంగా మిస్సింగ్ ఖాతాలకు సకాలంలో డబ్బులు చేరవేయడంలో వ్యవసాయశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. మూడు శాఖల మధ్య సమన్వయం లేని కారణం చేత రైతులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. తిరిగి తిరిగి అలసిపోయిన: కె.జలంధర్‌రెడ్డి, కరివెన, భూత్పూరు రుణమాఫీకి అర్హత ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటిదాకా అందలేదు. బ్యాంకు, రెవెన్యూ అధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా ఆరు నెలలు తిప్పించుకున్నరు. గట్టిగా అడిగితే మిస్సింగ్ అయ్యిందని చెప్పిండ్రు. న్యాయం చేయాలని వేడుకుంటే లెటర్ పెట్టినమని, త్వరలో పైసలు వస్తాయని చెప్పిండ్రు. ఇది జరగబట్టి మూడు నెలలు. ఇప్పటి దాకా పైసలు రాలేదు. రుణమాఫీ రాలేదు: ఆలేటి ఎడ్ల మశన్న, రైతు, గట్టురాయిపాకుల నాగర్‌కర్నూల్ ఎస్బీఐలో పంట రుణం తీసుకున్నా. అధికారులు నా పేరును ఏటీఎల్(అగ్రికల్చర్ టర్మ్ లోన్) జాబితాలోకి చేర్చటం వల్ల రుణమాఫీకి అర్హుడై ఉండి కూడా రుణమాఫీ పొందలేకపోయా. నాలాంటి రైతులు మా ఊర్లో దాదాపు 11మంది దాకా ఉన్నారు. రుణమాఫీకి అర్హులను చేయాలని ఆర్డీఓ వద్దకు, బ్యాంకు అధికారుల వద్దకు, తహశీల్దార్ వద్దకు మూడు నెలలపాటు తిరిగాం. చివరగా అధికారులు రుణమాఫీ ఇవ్వకుండానే మా పంట రుణాన్ని రెన్యూవల్ చేసి అన్యాయం చేశారు. -
పాలకుల నిర్లక్ష్యం రైతుకు శాపం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పాలకులు పట్టించుకోరు.. అధికారులు స్పందించరు. రెక్కలు ముక్కలు చేసుకుని సాగుచేసిన పంటలకు సరిగ్గా నీరందక కళ్లముందే ఎండిపోతున్నాయి. మరి కొన్నిచోట్ల కొనఊపిరితో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ.. గొడవలకు దిగుతున్నారు. జిల్లాలో సోమశిల, సంగం, తెలుగుగంగ, కండలేరు జలాశయాల కింద కాలువలు ఉన్నాయి. ఆయా రిజర్వాయర్ల నుంచి కాలువల ద్వారా ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలోని లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరా చేయాలి. అయితే దశాబ్దాల క్రితం నిర్మించిన కాలువలు ఆక్రమణలకు గురికావటం.. పూడిక పేరుకుపోవటం.. గుర్రపుడెక్కతో నిండిపోవటంతో చివరి ఆయకట్టుకు నీరందటం లేదు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా 27వేల ఎకరాల్లో వరిపంట ఎండిపోతుంది. మరో లక్ష ఎకరాల పంట పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. తెలుగుగంగ, కండలేరు జలాశయాల నీటి ఆధారంగా గూడూరు, చిల్లకూరు మండలాలకు చెందిన రైతులు వరిని సాగుచేస్తున్నారు. కండలేరు నుంచి వచ్చే నీరు పొదలకూరు, మనుబోలు మీదుగా కాలువల ద్వారా గూడూరు పట్టణ ం, పురిటిపాళెం, పోటుపాళెంతో పాటు, చిల్లకూరు మండలంలోని నాంచారమ్మపేట, తిప్పగుంటపాళెం పరిధిలోని భూములకు నీరు చేరుతుంటుంది. అయితే మనుబోలు మండలం బద్వేలు వద్ద ఉన్న వెంకన్నపాళెం సప్లయ్ చానల్ వద్ద రెగ్యులేటర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కాలువ పూడిక పేరుకుపోయి నీరు రాని పరిస్థితి. అదేవిధంగా వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి పరిధిలోని ప్రధాన కాలువలకు అటవీ అనుమతులు లేకపోవటంతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. దుస్థితిలో కావలి కాలువ ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో సుమారు 70 వేల ఎకరాలకు సోమశిల రిజర్వాయర్ నుంచి కావలి కాలువ ద్వారా సాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. అయితే కాలువ అస్తవ్యస్తంగా ఉండటంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఇకపోతే కావలి నియోజకవర్గానికి ప్రధాన కాలువ కూడా ఇదే. ఐఏబీ సమావేశంలో 75వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అందులో భాగంగా కావలి కాలువ ద్వారా 54 చెరువులకు నీరందాల్సి ఉంది. 1970లో 600 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన కావలి కాలువ పూడిక తీయకపోవటం.. వెడల్పు చేయకపోవటంతో ప్రస్తుతం 350 క్యూసెక్కుల నీరు మాత్రం వస్తోంది. ఫలితంగా పూర్తిస్థాయిలో పంటలకు నీరందడం లేదు. దీంతో 10వేల ఎకరాలకుపైగా పంటలు ఎండిపోయాయి. కనిగిరి రిజర్వాయర్ పరిధిలో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి. కాలువ పొడవునా గుర్రపుడెక్కతో నిండిపోవటంతో విడవలూరు, కొడవలూరు, అల్లూరు రైతులకు నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూళ్లూరుపేట పరిధిలోని నెర్రికాలువ ద్వారా తడ, దొరవారిసత్రం, సూళ్లూరుపేట పరిధిలోని 15 చెరువులకు నీరందించాల్సి ఉంది. అయితే కాలువ మరమ్మతులకు నోచుకోకపోవటం, ఆక్రమణలకు గురికావటంతో పంటలకు నీరందడం లేదు. నాయుడుపేట పరిధిలోని విన్నమాల కాలువ పూర్తిగా పూడిపోయింది. దీంతో 15వేల ఎకరాలు బీడుభూములుగా మారాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవటంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. పాలకులు, అధికారులపై నమ్మకం లేక మరికొందరు రైతులు వేలాది ఎకరాలను బీళ్లుపెట్టారు. ఈవిషయంపై పాలకులు, అధికారులు స్పందించి కాలువల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి పంటలకు నీరందించాల్సిన అవసరం ఉంది. -
ప్రజా సమస్యలే అజెండా.....
ప్రజల కష్టాలను అన్నలా అర్థం చేసుకుని స్నేహితునిగా తోడు నిలుస్తూ పార్టీలకు అతీతంగా తన వంతు సహాయం చేయడమే ఎస్వీ మోహన్‌రెడ్డిని ప్రజాప్రతినిధిగా నిలబెట్టింది. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమారుడిగా జిల్లాకు సుపరిచితుడు. సాధారణ రాజకీయ నాయకుడిగా ఉన్న ఈయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. వైఎస్ కుటుంబమంటే ఎనలేని అభిమానం. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ రాజకీయాల్లోకి ప్రవేశించాక ఆయనకు తోడుగా నిలవాలనే సంకల్పంతో తన ఎమ్మెల్సీ పదవిని త్యజించారు. రాజీనామా చేసి పూర్తిస్థాయి సమయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవల్లోనే వినియోగించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున కర్నూలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న టి.జి.వెంకటేశ్‌పై విజయం సాధించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా తనను ఆదరించిన ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వంపై అలుపెరుగని పోరుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. తన నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలకు అండగా నిలిచి మీ కోసం నేనున్నానని నిరూపించుకున్నారు. ముస్లింల సమస్యలపై అసెంబ్లీలో సైతం పోరాడే నేతగా ఆయన మంచి గుర్తింపు పొందారు. అంతేకాకుండా నగరపాలక సంస్థ అధికారులను వెంట బెట్టుకుని నిత్యం వార్డు విజిట్ నిర్వహిస్తూ ఎన్నోరకాల వార్డు సమస్యలను పరిష్కరించగలిగారు. ప్రజల కష్టాలను లోతుగా అధ్యయనం చేసేందుకు ‘సాక్షి’ తరపున కర్నూలు నగరంలోని బుధవారపేటలో పర్యటించి వీఐపీ రిపోర్టింగ్ చేశారు. ఎస్వీ : ఏమ్మా బాగున్నారా.. మీ పేర్లేంటి? కాలనీలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? కాలనీవాసులు : నా పేరు జైబున్బీ సార్.. భర్త లేడు.. ఆఫీస్‌ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి పింఛన్ జాబితాలో పేరు నమోదు చేయిస్తే..ఒక్క నెల మాత్రమే పింఛన్ వచ్చింది. అంతలోపే కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న పింఛన్ కాస్త తొలగించింది. దీంతో గత మూడు నెలలుగా పింఛను రావడం లేదు. సర్.. నా పేరు ఖాజాబీ. కొడుకులు లేరు. పింఛన్ కూడా రావడం లేదు. ఇప్పించండి సార్.. నా పేరు వెంకటరమణ.. వికలాంగుడిని సార్. పింఛను ఇప్పించండి. నా పేరు సర్వేశ్వర్.. ఆక్సిడెంట్లో కాలు విరిగింది. ప్రస్తుతం నడవనిలేని పరిస్థితి. నాకు పింఛను ఇప్పించండి.. ఎస్వీ : అంగవైకల్యం.. 70 శాతంపైగా ఉన్న వారికి మాత్రమే వికలాంగ పింఛన్ వస్తుంది. అలాంటి వారు దరఖాస్తులు నాకు ఇవ్వండి. అధికారులతో మాట్లాడి పింఛను ఇప్పించేందుకు ప్రయత్నిస్తాను. జగన్ సీఎం అయి ఉంటే ఇలాంటి సమస్య ఉండేది కాదు. ఇప్పుడు చంద్రబాబు పాలన సాగుతోంది. పింఛన్ల తొలగింపుతో చాలా మంది అర్హులు పింఛన్లు కోల్పోయారు. అయినా అర్హులైన వారికి పింఛన్లు ఇప్పించేందుకు అధికారులతో మాట్లాడతాను. ఎస్వీ : పెద్దమనిషి, మీ వీధిలో సమస్యలు ఏవైనా ఉన్నాయా..? కాలనీవాసులు: సార్, నా పేరు మాలిక్బాష. మా ఇంటి ముందే కరెంటోళ్లు డీప్(టాన్స్‌ఫార్మర్) ఏర్పాటు చేశారు. చాలా ప్రమాదకరంగా ఉంది. దాన్ని ఇక్కడ్నించి తీసేయించండి సార్.. ఎస్వీ : సంబంధిత అధికారులతో మాట్లాడి కరెంటుకు సంబంధించిన డీప్‌ను పక్కకు జరిపిస్తా. ఎస్వీ : ఏం బాబు.. బాగున్నావా.. నీలాంటి యువకులకు ఇబ్బందులు ఏమీ లేవు కదా.. మణికంఠ: ఏం చెప్పమంటారు సార్.. ఎన్నికల ముందేమో నిరుద్యోగులకు నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మాకు నెలకు రూ. 2 వేల కాదు కదా రెండు రూపాయలు కూడా ఇవ్వడం లేదు. మా వీధిలో చాలా మంది చదువుకున్నోళ్లు ఉన్నారు. నిరుద్యోగ సమస్యతో బాధ పడుతున్నారు. ఎస్వీ : ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం నాయకుని లక్షణం. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదో అధికార పార్టీ నేతల్ని నిలదీయండి. ఎస్వీ : ఏమన్నా.. వ్యాపారం ఎలా ఉంది.. గ్యాస్ సిలిండర్ ఎంతకు కొంటున్నావ్.. సమస్యలు ఏమైనా ఉన్నాయా.. మంచినీళ్లు బాగా వస్తున్నాయా? శ్రీనివాసులు: వ్యాపారం డల్‌గా ఉంది సార్. సిలిండర్ ఒక్కోటి రూ. 850 దాకా పెట్టి కొనాల్సి వస్తుంది. నా తల్లికి పింఛన్ రావడం లేదు. కాలువలు సరిగ్గా లేవు. మంచినీళ్లు బాగానే వస్తున్నాయి. ఎస్వీ : ఏమ్మా ఇస్త్రీపని బాగా జరుగుతోందా.. మీ కుటుంబానికి ఏవైనా సమస్యలున్నాయా.. శిరీష: నేను ఆరో తరగతి చదువుతున్నా సార్. నాన్న చనిపోయాడు. దీంతో మధ్యలోనే చదువు మానాల్సి వచ్చింది. అమ్మే నన్ను కష్టపడి పోషిస్తోంది. ఇప్పుడు అమ్మకు తోడుగా నేను లాండ్రీ పని చేస్తున్నా అయితే మా అమ్మకు వితంతు పింఛన్ రావడం లేదు సార్.. మీరు దయవుంచి అమ్మకు పింఛను వచ్చేలా చూడండి ఎస్వీ : ఈ ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లు తొలగించిందమ్మా.. మీ అమ్మకు పింఛన్ వచ్చేలా ప్రయత్నిస్తా. ఎస్వీ : ఏమ్మా.. పొదుపు మహిళా సంఘాలు ఎలా నడుస్తున్నాయి.. లోన్లు ఏమైనా వచ్చాయా.. వనజ: సార్.. లోన్ల సంగతి ఏమోకాని ఉన్న డబ్బు కూడా పోతోంది. ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు తీసుకున్న రుణాల కంతులు కట్టడం మానేయమని చెబితే మానేశాం. ఇప్పుడేమో బ్యాంకు వాళ్లు వడ్డీలు వసూలు చేస్తున్నారు. కట్టకపోతే అసలులో కట్ చేస్తున్నారు. కూడబెట్టిన డబ్బంతా వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. సంక్రాంతికి పిల్లలకు బట్టలు కూడా కొనలేని పరిస్థితి కల్పించారు. ఎస్వీ : చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోతున్నారు. రుణమాఫీ అయ్యేంతవరకు మా నాయకుడు జగన్మోహన్రెడ్డితో కలిసి పోరాడుతాం. ఈనెల 31 నుంచి రెండు రోజుల నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఎస్వీ : ఏమ్మా బాగున్నారా.. సమస్యలేమైనా ఉన్నాయా.. మహిళలు: నా పేరు వెంకటేశ్వరమ్మ. వెయ్యి రూపాయల పింఛన్ ఉత్త డూప్ సార్.. ఆశ చూపి ఉన్న పింఛన్లు తీసేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు అందరికి పింఛన్లు వచ్చేవి. చంద్రబాబు పాలనలో ఉన్న పింఛన్లు పోయాయి. సర్, నాపేరు మారెమ్మ. నా వయస్సు 75 ఏళ్లు. 10 నెలలుగా పింఛను రావడం లేదు. జాబితాలో పేరు లేదంటున్నారు. మీరైనా దయచేసి న్యాయం చేయండి ఎస్వీ : పీఏ శ్రీనివాసులు.. వీరందరితోనూ పింఛను దరఖాస్తులు తీసుకో. మీకు పింఛన్లు కచ్చితంగా వచ్చేలా కృషి చేస్తాను. ఎస్వీ : అమ్మాల్లరా ఏైైమైనా సమస్యలు ఉన్నాయా? ఎస్.చిట్టి: సర్, ఇక్కడ మహిళలకు మరుగుదొడ్లు లేవు సార్. మురుగు నీరు రోడ్డుపైన పారుతుంది. డ్వాక్రా రుణాలు కూడా మాఫీ కావడం లేదు. రుణాలు ఇవ్వడం లేదు. వడ్డీలు మళ్లీ కట్టాలంటున్నారు. ఎలా కట్టాలో తెలియడం లేదు. ఎస్వీ : పురపాలక సంస్థ అధికారులతో ప్రతిపాదనలు చేయించి మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రయత్నిస్తా. మురుగునీటి సమస్యా పరిష్కరిస్తా. (మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్కు పీఏ ఫోను కలిపి ఇవ్వడంతో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అక్కడిక్కడే శానిటరీ అధికారికి డ్రైనేజీ సమస్యను వివరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.) చెత్తాచెదారాన్ని, ప్లాస్టిక్ వస్తువులను కాలనీవాసులు కాలువల్లో వేయకండి. అలా వేయడం వల్లే కాలువలు బ్లాక్ అవుతున్నాయి. ఎస్వీ : (పూరి గుడిసెలోకి వెళ్లి) అవ్వా.. క్షేమమేనా.. నాగమ్మ, రాములమ్మ: ఏం చెప్పమంటావు నాయనా.. ఆధార్ లేదని పింఛన్ ఇవ్వట్లేదు. ఆమెకు మొదట్నుంచి రావడంలేదు. ఎస్వీ : అవ్వా నీకు పింఛను ఇప్పించేందుకు ప్రయత్నిస్తా. ఎస్వీ : ఏమన్నా.. పులిజాకబ్, చేపలకుంట వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా.. పులిజాకబ్(స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్): సార్, చేపలకుంట గుంత 60, 70 ఏళ్లుగా ఉంది. ఇక్కడ రైతు మార్కెట్ లేక స్కూల్ కట్టివ్వాలనేది ప్రభుత్వ ప్రతిపాదన. స్థానికులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ప్రతిపాదిస్తుండటంతో సమస్య పెండింగ్‌లో ఉంది. గట్టి నిర్ణయం తీసుకోండి. ఎస్వీ : ఈ గుంత వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఏసన్న (స్థానిక నేత): గుంత చుట్టుపక్కల ప్రమాదకరంగా ఉంది. పొరపాటున పడితే బయటికి రాలేరు. డ్రైనేజీ నీరు కూడా చేరుతుంది. దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. ఎస్వీ : ఈ గుంత ఇబ్బందుల గురించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కూడా ప్రస్తావించాను. మళ్లీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తా. ఎస్వీ : ఏమమ్మా.. మీ సమస్యలేవైనా ఉన్నాయా? మారెమ్మగుడి కాలనీవాసులు: సార్, మరుగుదొడ్లు ఉపయోగించేందుకు వీలుగా లేవు. సింటెక్స్ ట్యాంకు పగిలింది. గోడల ఎత్తు తక్కువగా ఉండటంతో పురుషుల కంట పడాల్సి వస్తుంది. ఎస్వీ : (నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్లో) మారెమ్మగుడి వద్ద ఉన్న మరుగుదొడ్లు చెడిపోయాయి. వీటికి వెంటనే మరమ్మతులు చేపట్టండి. మరొక సింటెక్స్ ట్యాంక్ పెట్టి మహిళలకు ఇబ్బందులు లేకుండా చూడండి. -
ఆశలు మొలకెత్తే రోజులు రావాలి
ఈ రోజులు మాకొద్దు.. బారులు.. కొండవీటి చాంతాడులు విత్తుకోసం.. అది ఏపుగా ఎదగాలంటే ఎరువు కోసం.. ఎక్కడ చూసినా అదే చిత్రం.. అన్నదాత బతుకు ఛిద్రం.. అదును దాటుతుందని తెలిసినా.. వంతులు వేసుకుని మరీ ఇంటిల్లిపాదీ పడిగాపులు.. చచ్చీచెడీ, ఆలి తాళిబొట్లు తెగనమ్మి కొన్న విత్తు.. మొలకెత్తకుంటే రైతన్నకు విపత్తు.. ఎన్నాళ్లీ వెతలు.. ఇంకెన్నాళ్లీ బాధలు.. వద్దు.. ఈ రోజులు మాకొద్దు అంటున్నారు కర్షకులు! - ఎలక్షన్ సెల్ -
ధాన్యం.. దైన్యం
ప్రస్తుత వ్యవసాయ సీజన్లో అన్నదాతను ఆది నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి. అష్టకష్టాలు పడి పండించుకున్న పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గత ఏడాదితో పోలిస్తే ధరలు భారీగా తగ్గడం, పెట్టుబడి పెరగడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఆదుకుంటాయనుకున్న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయమయ్యాయి. జిలకర మసూరి రకం ధాన్యం పండించిన రైతుల కష్టాలు మరోలా ఉన్నాయి. ఈ ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించలేదని కొనుగోలు కేంద్రాల సిబ్బంది చెబుతుండటంతో వ్యాపారులు, దళారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఉదయగిరి, న్యూస్‌లైన్: ఈ ఏడాది ఉదయగిరి నియోజకవర్గంలో వరి సాగు చేసిన రైతులు అప్పులపాలయ్యారు. కనీసం పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. విం జమూరు సబ్‌డివిజన్ పరిధిలో సాధారణ వరి విస్తీర్ణం 16 వేల హెక్టార్లు. ఈ ఏడాది 13,500 హెక్టార్లలో వరి సాగు చేశారు. ఇందులో సు మారు ఐదు వేల హెక్టార్లలో వరి ఎండిపోయింది. మిగిలిన సాగులో కూడా దిగుబడి దారుణంగా పడిపోయింది. ఉదయగిరి సబ్‌డివిజన్ పరిధిలో సాధారణ వరి విస్తీర్ణం 5,300 హెక్టార్లు కాగా ప్రస్తుతం 2,500 హెక్టార్లలో సాగైంది. ఇందులో 500 హెక్టార్లలో వరి ఎండిపోయింది. మిగిలిన దాంట్లో కూడా దిగుబడి అంతంత మాత్రమే. పెరిగిన పెట్టుబడులు గత ఏడాది కంటే ఈ ఏడాది పెట్టుబడులు 50 శాతంపైగా పెరిగాయి. గత ఏడాది ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి కాగా, ఈ ఏడాది రూ.25 వేలు దాటింది. పైగా వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటను కాపాడుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకునేందుకు జనరేటర్లు, ఇంజిన్లు, పట్టలు, పైపుల కొనుగోలుకు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది కూడా రైతులకు భారంగా మారింది. తీరా దిగుబడి చూస్తే షాక్ తగిలినట్టైంది. ఎకరాకు 40 బస్తాలు పైగా దిగుబడి రావాల్సి ఉండగా, కేవలం 20 బస్తాలకే పరిమితమై రైతన్నకు అంతులేని శోకాన్ని మిగిల్చింది. ఐదు నెలలు కష్టించగా నష్టం మాత్రమే చేతికి మిగిలింది. మద్దతు హుళక్కే: ప్రభుత్వం పెరిగిన ఖర్చులు, పెట్టుబడులకు అనుగుణంగా వరి ధాన్యానికి మద్దతు పెంచడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. పెట్టుబ డులు భారీగా పెరుగుతున్నా, మద్దతు ధర మాత్రం ఆ మేరకు పెంచడం లేదు. ఏడాదికి రూ.50 లోపు మాత్రమే క్వింటాలుకు పెంచుతోంది. పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కర్నాటకలో క్వింటాకు మద్దతు ధర రూ.1600 , మహారాష్ట్రలో రూ.1650 ఉంది. ఇక్కడ మాత్రం రూ.1310 మాత్రమే ఉండటం గమనార్హం. పైగా ఆ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకంగా క్వింటాకు రూ.100-150 అదనంగా చెల్లిస్తోంది. అలంకారప్రాయంగా కొనుగోలు కేంద్రాలు కోట: అధికారులు ఆర్భాటంగా ప్రారంభిం చిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంకా బో నీ కాలేదు. కోట మండలంలోని తిన్నెలపూడి,సిద్దవరం, ఊనుగుంటపాళెం సహకార సం ఘాల ఆధ్వర్యంలో గత నెలలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్ర భుత్వం ప్రకటించిన ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు ఇటువైపు రావడం లే దు. వ్యాపారులు, దళారులు మాత్రం అదనంగా కొంత మొత్తం చెల్లించి కొనుగోళ్లు జరుపుతున్నారు. మరోవైపు సూపర్‌ఫైన్‌గా పరిగణించే జిలకర మసూరి రకానికి ప్రభుత్వం ఇంకా ధర ప్రకటించ లేదని కొనుగోలు కేం ద్రాల సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలో వ్యాపారులు ధర దారుణంగా తగ్గించేశారు. గత సీజన్లో పుట్టి రూ.15 వేలు వరకు పలికిన ఈ రకం ధాన్యాన్ని ప్రస్తుతం రూ.13 వేలు లోపే కొనుగోలు చేస్తుండటంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. తగ్గిన దిగుబడులు వాకాడు: వాకాడు మండలంలో సుమారు 15 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా నీళ్లు చాలక 4 వేల ఎకరాల్లో ఎండిపోయింది. గుంతలు, వాగులు, రొయ్యల చెరువులోని వ్యర్థనీటిని ఆయిల్ ఇంజన్లతో తోడుకుని పంటలు పం డించారు. పంటకు సరిపడా నీళ్లు అందించలేకపోవడంతో దిగుబడి బాగా తగ్గింది. ధాన్యం కూడా తేలికగా మారాయి. ఈ పరిస్థితుల్లో ధాన్యానికి మద్దతు ధర లేకపోవడంతో రైతు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో దళారులు అడిగిన ధరకే విక్రయించేస్తున్నారు. కొందరు రైతులు మాత్రం ఖర్చులకు ఓర్చి ఆరబెట్టుకుంటున్నారు. పొలాల్లోనే నిల్వ చిల్లకూరు: మార్కెట్లో బియ్యం ధరలు చుక్కలు అంటుతుంటే ధాన్యం ధరలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. తీరప్రాంత గ్రామాలైన బల్లవోలు, వేళ్లపాళెం, కాకువారిపాలెం, కోవూరువారిపాళెంలోని సుమారు 500 ఎకరాల్లో జిలకర మసూరి సాగు చేపట్టారు. అప్పట్లో పుట్టి ధాన్యం ధర రూ.14,500 పలుకుతుండటంతో రైతులు ఉ త్సాహంగా పెట్టుబడులు పెట్టారు. పంట చేతి కొచ్చే సరికి ఈ ధర క్రమేణా దిగజారి ప్రస్తు తం రూ.12,500 చేరుకుంది. ఈ ధరకు విక్రయిస్తే పెట్టుబడి కూడా రాకపోతుండటంతో రైతులు ధాన్యాన్ని పొలాల్లోనే ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లోనైనా అమ్ముకుందామంటే అక్కడ మసూరికి ఇంకా ధర నిర్ణయించలేదనే సమాధానం వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించి అన్ని రకాల ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు. దళారులే దిక్కు జలదంకి: మండలంలో వరికోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే బ్రాహ్మణక్రాక, జలదంకిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు ఉపయోగపడటం లేదు. ఈ కేంద్రాల్లో సిబ్బంది ఉండటం లేదు. ఉంటే గోతాలు లేవని చెబుతుండటంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా అన్నదాతను దళారులు నిలువునా ముంచేస్తున్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి పుట్టికి రూ.11,433, బీ గ్రేడ్‌కు రూ.11,435 మద్దతు ధర ప్రకటించింది. దళారులు మాత్రం ఈ గ్రేడ్ల పరిధిలోకి వచ్చే ఎంటీయూ 1010, ఎన్‌ఎల్‌ఆర్ 145(స్వర్ణముఖి), ఎన్‌ఎల్‌ఆర్ 30491 (భరణి), నెల్లూరు జిలకర, సన్నాలు తదితర రకాలను రూ.11 వేలకు మించి కొనడం లేదు. మళ్లీ తేమ, తాలు పేరుతో కోత విధిస్తున్నారు. మరోవైపు తూకాల్లో మోసం చేస్తూ బస్తాకు రూ.4 కిలోల వరకు మోసం చేస్తున్నారు. అయినా రైతులకు విధిలేని పరిస్థితుల్లో దళారులే దిక్కవుతున్నారు. ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తే కఠినచర్యలు నెల్లూరు(పొగతోట) : రైస్ మిల్లర్లు, దళారులు రైతుల నుంచి ధర తగ్గించి కొనుగోలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు 103 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 47 కొనుగోలు కేంద్రాలు వారంలోపు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మద్దతు ధరలకే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. సూపర్‌ఫైన్ ధాన్యం (క్వింట) రూ.1500, ఏగ్రేడ్ రూ.1345, సాధరణ రకం ధాన్యం రూ.1315లకు కొనుగోలు చేయాలన్నారు. రైతులకు నష్టం కలిగించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ధాన్యం తక్కువ ధరలకు కొనుగోలు చేస్తే 80083 01500, 90004 00926 ఫోన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. విధిలేకే: వరికోతలు ప్రారంభమైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదు. మరోదారి లేక దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. వాళ్లు ఇష్టారాజ్యంగా ధరల్లో తేడాలు చెబుతూ కొనుగోలు చేస్తున్నారు. నష్టాలు తప్పేటట్టు లేవు. - అక్కల శ్రీనివాసులరెడ్డి, రైతు, బ్రాహ్మణక్రాక మద్దతు ధరను పెంచాలి : ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎకరాకు రూ.30 వేల వరకు అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టాం. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం మద్దతు ధరను పెంచాలి. -షేక్ రెండో సుభాన్, రైతు, బీకే అగ్రహారం -
చివరికి కష్టమే!
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: రబీ సీజన్లో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని వరి రైతులకు కష్టాలు తప్పేలాలేవు. గత నెల 20వ తేదీ నుంచి ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేసినా వరినార్లు లేకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. ఈ నెల 16వ తేదీన మరోమారు నీటి విడుదలపై చర్చలో పాల్గొన్న రైతులు, నీటి సంఘాల మాజీ ప్రతినిధులు ఎన్ఎస్పీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వరినాట్లు పూర్తయ్యే వరకు వారబందీ నిబంధనలు పెట్టవద్దని, ఫిబ్రవరి 10 వరకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన విషయం విదితమే. రైతుల విన్నపాలను పరిగణనలోకి తీసుకుని నీటి విడుదల షెడ్యూల్‌ను జారీ చేస్తున్నామని చెప్పిన అధికారులు కేవలం ఫిబ్రవరి 3వ తేదీ వరకే నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కాలువ చివరి భూములకు సాగు నీరు అందడం కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. జోరుగా వరినాట్లు ప్రస్తుతం ఆయకట్టు పరిధిలో వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 30 శాతం అంటే కేవలం 1.30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పూర్తయ్యాయి. కాగా ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎక్కువగా నాట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. కానీ నీటిని ఫిబ్రవరి 3వ తేదీన మొదటి విడత నిలిపివేయడంతో రైతులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 4.31 లక్షల ఎకరాలకే రబీలో నీరు.. సాగర్ ఎడమ కాలువ పరిధిలోని కేవలం 4,31, 325 ఎకరాలకే సాగునీటిని అందిస్తున్నారు. ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో 10.28 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. కానీ సాగర్‌లో నీటి లభ్యత ఆధారంగా కేవలం రబీలో ఎడమ కాలువ కింద సాగుకు కేవలం 50 టీఎంసీల నీటినే కేటాయించారు. దీంతో సగం ఆయకట్టుకు కూడా నీటిని విడుదల చేయడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పవు.. సాగర్ ఎడమ కాలువకు ఐదు విడతలుగా నీటి ని విడుదల చేయనున్నారు. మొదటి విడతలో వరినాట్ల కోసం 19 రోజుల పాటు నీటిని విడుదల చేస్తుండగా మిగతా నాలుగు విడతల్లో కేవ లం పది రోజులు నీటిని విడుదల చేసి ఐదు రో జులు నీటిని నిలిపి వేయనున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. రెండోవిడత ఫిబ్రవరి 9న, మూడోవిడత 24, నాలుగో విడత మార్చి 11న, ఐదో విడత మార్చి 26 నుం చి ఏప్రిల్ 4వరకు నీటి విడుదల ఉంటుంది. వరుసగా ఐదు రోజుల పాటు నీటిని నిలిపివేస్తే కాలువ చివరి భూముల్లో తిరిగి నీరందే వరకు మరో ఐదు రోజులు పట్టే అవకాశం ఉంది. దాంతో కాలువ చివరి భూములకు రబీలో నీరందడం కష్టంగానే ఉంది. దాంతో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని ఎన్ఎస్పీ అధికారులే సూచిస్తున్నారు. కాగా రైతులు కూడాముందుచూపుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు దృష్టిసారిస్తున్నారు. -
సన్నగిల్లిన ఆశలు
ఏ ఏటికాఏడు రైతులకు కష్టాలు తప్పడంలేదు. ఆదుకోవాల్సిన సర్కారు చేతులెత్తేస్తోంది. ఫలితంగా పుడమి బిడ్డ రోజురోజుకు అప్పుల్లో కూరుకుపోతున్నాడు. ఇటీవల కేంద్రం ధాన్యం మద్దతు ధర పెంచింది. కానీ, రాష్ట్రం సన్నరకం ధాన్యానికి ప్రోత్సాహక ధర పెంచలేక పోయింది. పెరిగిన పెట్టుబడులు, సాగు ఖర్చులు రైతుపై పెనుభారాన్ని మోపాయి. అయినా ప్రోత్సాహక ధర లేకపోవడంతో నిరాశలో కూరుకుపోతున్నారు. సాక్షి, నల్లగొండ: జిల్లాలో ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. జిల్లావ్యాప్తంగా ఇంచుమించు 1.44 లక్షల హెక్టార్లలో రైతులు సాగుచేశారు. దాదాపు 8లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుం దని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ఇందులో ఆరు లక్షల టన్నుల వరకు సన్నరకం ధాన్యమే ఉంటుందని పేర్కొంటున్నారు. ఇదీ పరిస్థితి.... గత ఖరీఫ్‌లో ఏ-గ్రేడు ధాన్యం క్వింటాకు రూ.1280, సాధారణరకానికి రూ.1250 కేంద్రం చెల్లించింది. అయితే, బీపీటీ ధాన్యం పండించే రైతులను ప్రోత్సహిం చాలన్న ఉద్దేశంతో మద్దతుధర కంటే రాష్ట్రం అధికంగా చెల్లించింది. క్వింటాపై రూ.220 ప్రోత్సాహకంగా ప్రకటించి రూ.1500కు రైతుల నుంచి కొనుగోలు చేసింది. అయితే అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించలేదు. అయితే, కొనుగోళ్లపై తీవ్ర పోటీ ఉండడంతో బహిరంగ మార్కెట్లో ఇంతకన్నా అధిక ధర చెల్లించారు. వ్యాపారులు, మిల్లర్లు ఒక్కో క్వింటా రూ.1800 వరకు కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుత ఖరీఫ్‌లో ధాన్యం మద్దతు ధరను కేంద్రం నామమాత్రంగా పెంచింది. ఏ-గ్రేడు ధాన్యానికి రూ.65, సాధారణ రకంపై రూ.60 పెంచింది. అంటే పెంపు తర్వాత ఏ - గ్రేడు ధాన్యం రూ.1345కు, సాధారణ రకం రూ.1310కు చేరుకుంది. ప్రోత్సాహం ఏదీ..? గతేడాది క్వింటా సన్నరకం ధాన్యంపై ప్రోత్సాహకంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది రూ.220. అప్పుడు క్వింటా ధాన్యం ధర రూ.1280 పలికింది. ప్రస్తుతం పెంపుతో రూ.1345కు ఎగబాకింది. ఈ పెంపుతో ఒక్కో క్వింటాపై రూ.65 భారం రాష్ట్ర ప్రభుత్వంపై తగ్గింది. అయినా, ఈ ఏడాది ప్రోత్సాహంగా ఇచ్చే డబ్బు మొత్తాన్ని పెంచకపోవడం గమనార్హం. పెంచలేమని కూడా స్పష్టం చేసింది. గత ఖరీఫ్‌లో దొడ్డు రకం.. సన్నరకం ధరలకు మధ్య కొనుగోలు ధర వ్యత్యాసం రూ.220. ఈ ఏడాది వ్యత్యాసం రూ.155కు పడిపోయిందని బీపీటీ రైతులు వాపోతున్నారు. పెరిగిన పెట్టుబడులు... పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది సాగు భారం రైతులపై అధికంగా పడింది. దున్నడం నుంచి వరికోత వరకు అన్ని ఖర్చులు రెట్టింపయ్యాయి. ముఖ్యంగా ఎరువులు, పురుగుమందుల ధరలు దాదాపు 20 శాతం ఎగబాకాయి. విత్తనాల ధరలూ పెరిగాయి. అంతేగాక దొడ్డు రకం పంట కంటే సన్నరకం పంటకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. 15 రోజులు ఆలస్యంగా దిగుబడి వస్తుంది. పైగా దొడ్డు రకంతో పోల్చుకుంటే దిగుబడి కూడా తక్కువే. ఈ విధంగానూ రైతుకు కొంత నష్టమే. సాగర్ ఆయకట్టు ప్రాంతంలోని రైతులు వరుసగా మూడు సీజన్లు వరిసాగుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సాగర్ రిజర్వాయర్‌లో సరిపడా నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడం, సాగర్ జలాయశంలో నీరు సమృద్ధిగా ఉండడంతో వరి విస్తీర్ణం భారీగా పెరిగింది. ఎంతో ఆశతో రైతులు సన్నరకం పంటకు ఉపక్రమించారు. ఇంతటి వ్యయప్రయాసాలకు ఓర్చి సాగు చేస్తే ప్రభుత్వం ప్రోత్సాహక ధరను పెంచకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.