మార్చిలో బ్యాంక్ సెలవులు ఇవే - చూసారా.. | Bank Holiday in 2024 March | Sakshi
Sakshi News home page

Bank Holidays in March 2024: మార్చిలో బ్యాంక్ సెలవులు ఇవే - చూసారా..

Published Wed, Feb 21 2024 9:10 PM | Last Updated on Wed, Feb 21 2024 9:14 PM

Bank Holiday in 2024 March - Sakshi

2024 ఫిబ్రవరి ముగియడానికి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెలతో పోలిస్తే వచ్చే నెలలో (మార్చి) బ్యాంకులకు సెలవులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో ఏకంగా 14 రోజులు బ్యాంకులు మూత పడనున్నట్లు తెలుస్తోంది.

  • మార్చి 1 - చప్చుర్ కుట్ - మిజోరాం
  • మార్చి 6 - మహర్షి దయానంద్ సరస్వతి జయంతి
  • మార్చి 8 - మహా శివరాత్రి / శివరాత్రి
  • మార్చి 12 - రంజాన్ ప్రారంభం
  • మార్చి 22 - బీహార్ డే - బీహార్
  • మార్చి 23 - భగత్ సింగ్ అమరవీరుల దినోత్సవం - అనేక రాష్ట్రాలు
  • మార్చి 25 - హోలీ 
  • మార్చి 29 - గుడ్ ఫ్రైడే
  • మార్చి 31 - ఈస్టర్ హాలిడే

ఈ సెలవులు కాకుండా మార్చి 9, 23 రెండవ, నాలుగవ శనివారాలు.. 3, 10, 17, 24, 31 ఆదివారం సెలవులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 14 సెలవులు ఉన్నాయి. కాబట్టి బ్యాంకులు పనిచేయవు. బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి.

ఇదీ చదవండి: స్విగ్గీ అకౌంట్‌తో రూ.97 వేలు మాయం చేశారు - ఎలా అంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement