banking sector reforms
-
మార్చిలో బ్యాంక్ సెలవులు ఇవే - చూసారా..
2024 ఫిబ్రవరి ముగియడానికి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెలతో పోలిస్తే వచ్చే నెలలో (మార్చి) బ్యాంకులకు సెలవులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో ఏకంగా 14 రోజులు బ్యాంకులు మూత పడనున్నట్లు తెలుస్తోంది. మార్చి 1 - చప్చుర్ కుట్ - మిజోరాం మార్చి 6 - మహర్షి దయానంద్ సరస్వతి జయంతి మార్చి 8 - మహా శివరాత్రి / శివరాత్రి మార్చి 12 - రంజాన్ ప్రారంభం మార్చి 22 - బీహార్ డే - బీహార్ మార్చి 23 - భగత్ సింగ్ అమరవీరుల దినోత్సవం - అనేక రాష్ట్రాలు మార్చి 25 - హోలీ మార్చి 29 - గుడ్ ఫ్రైడే మార్చి 31 - ఈస్టర్ హాలిడే ఈ సెలవులు కాకుండా మార్చి 9, 23 రెండవ, నాలుగవ శనివారాలు.. 3, 10, 17, 24, 31 ఆదివారం సెలవులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 14 సెలవులు ఉన్నాయి. కాబట్టి బ్యాంకులు పనిచేయవు. బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇదీ చదవండి: స్విగ్గీ అకౌంట్‌తో రూ.97 వేలు మాయం చేశారు - ఎలా అంటే? -
ఆర్బీఐ ప్యానెల్ సూచనలు : రాజన్, ఆచార్య విమర్శలు
సాక్షి, ముంబై : దేశీయ బ్యాంకింగ్ రంగంలోకార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరిచేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ప్రమోటర్లు గైడ్ లైన్స్, కార్పొరేట్ సిస్టమ్ సమీక్షకు 2020 జూన్ 12న ఆర్బీఐ నియమించిన అంతర్గత కమిటీ తాజాగా కీలక ప్రతిపాదను చేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్,నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ విభాగంలోని కఠిన ఆంక్షలు సవరణలు చేయాలంటూ సూచించింది. తద్వారా కార్పొరేట్లకు మార్గం సుగమం చేసింది. దీంతో కార్పొరేట్ కంపెనీలు, బడా పారిశ్రామిక సంస్థలు ఇన్వెస్ట్ చేసేందుకు నిబంధనలు సడలించేలా ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టనుందని సమాచారం. ఫలితంగా టాటా, బిర్లా, రిలయన్స్, అదానీ లాంటి పలు కార్పోరేట్ బిజినెస్ టైకూన్లు బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలనూ బ్యాంకింగ్ రంగంలో అనుమతించాలంటూ ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యుజి) సిఫారసు చేసింది. పదిహేనేళ్లలో ప్రైవేట్ బ్యాంక్‌ల ప్రమోటర్ల వాటా పరిమితిని ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 26 శాతానికి పెంచాలి. ఆర్థికంగా మెరుగైన పనితీరును కనబరుస్తున్న పెద్దపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రైవేట్ బ్యాంక్‌లుగా మారేందుకు అవకాశం కల్పించాలి. కనీసం 10 ఏళ్లుగా కార్యకలాపాలు కొనసాగిస్తూ, రూ.50,000 కోట్లు.. అంతకు మించి ఆస్తులున్న ఎన్‌బీఎఫ్‌సీలకు అర్హత ఉండేలా నిబంధనలు అమలు చేయాలి. కొత్తగా ప్రైవేట్ బ్యాంక్ లైసెన్సుల జారీకి కనీస మూలధన అర్హతను ప్రస్తుతమున్న రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచాలి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్సుల జారీకి కనీస మూలధన పరిమితిని రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచాలి. ప్రభుత్వ బ్యాంకుల పనితీరును మెరుగుపరచేందుకు అనేక చర్యలు, బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ సూచనలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 50 శాతం కంటే తక్కువగా ఉండాలి మరోవైపు ఐడబ్ల్యుజీ సిఫారసులపై ఆర్బీఐ మాజీ గవర్నరు రఘురామ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య విమర్శలు గుప్పించారు. పారిశ్రామిక వర్గాలను బ్యాంకింగ్‌లోకి అనుమతించకూడదని గట్టిగా వాదించారు. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు వారు తెలిపారు. ఎలాంటి అభ్యంతరాలు, ప్రశ్నలు లేకుండానే కార్పొరేట్ సులువుగా రుణాలు అందుబాటులోకి వచ్చేస్తాయి. కొన్ని వ్యాపార సంస్థలలో ఆర్థిక, రాజకీయ శక్తుల ప్రాబల్యం పెరిగిపోతుంది. అక్రమాలు అధికార దుర్వనియోగం పెరిగిపోతుందని అందోళన వ్యక్తం చేశారు. నిరర్ధక ఆస్తులుపెరగడానికి క్రోనీయిజం కారణమని గుర్తుచేశారు. లైసెన్సులు న్యాయంగా కేటాయించినప్పటికీ, అవినీతికి అవకాశం ఏర్పడుతుందనీ, ఇప్పటికే ప్రారంభ మూలధనం ఉన్న పెద్ద వ్యాపార సంస్థలకు అదనపు ప్రయోజనాలు చేకూరతాయని, రాజన్, ఆచార్య అభిప్రాయపడ్డారు.సోమవారం విడుదల చేసిన ఇండియన్ బ్యాంక్స్: ఎ టైమ్ టు రిఫార్మ్ అనే పరిశోధనా పత్రంలో బ్యాంకింగ్ రంగ ప్రస్తుత యథాతథ స్థితి ఆమోదయోగ్యం కాదు, బ్యాంకింగ్ పరిశ్రమను సంస్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్థిక సేవల విభాగాన్ని మూసివేయడం, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల ప్రైవేటీకరణ, బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు తగదని పేర్కొన్నారు. -
బ్యాంకింగ్‌లో సంస్కరణల మోత!
వాషింగ్టన్: బ్యాంకింగ్ రంగంలో త్వరలో భారీ సంస్కరణలను తీసుకొస్తామని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు. విదేశీ బ్యాంకులు భారత్‌లోకి పెద్దయెత్తున ప్రవేశించేందుకు వీలవడంతోపాటు దేశీ బ్యాంకులను కొనుగోలు చేసేందుకు కూడా దోహదం చేసేలా ఈ సంస్కరణలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ నిర్వహించిన కార్యక్రమంలో రాజన్ మాట్లాడారు. భారత్‌లోకి విదేశీ బ్యాంకుల ప్రవేశానికి సంబంధించి విధానపరమైన కార్యాచరణను వచ్చే కొద్దివారాల్లో ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. విదేశీ బ్యాంకులకు కూడా దాదాపు దేశీ బ్యాంకుల స్థాయిలోనే అనుమతులు ఇస్తామని, అయితే ఇందుకు రెండు షరతులు వర్తిస్తాయని రాజన్ పేర్కొన్నారు. ‘విదేశీ బ్యాంకులకు భారత్ ఏవిధంగా అనుమతులు ఇస్తుందో.. అదేవిధంగా ఆయా దేశాలు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి. ఇక రెండోది... ఏదైనా విదేశీ బ్యాంక్ భారత్‌లో బ్రాంచ్‌ల ఏర్పాటు రూట్, అనుబంధ సంస్థ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు... రెండింటిలో ఏదోఒక విధానాన్నే ఎంచుకోవాలి. నియంత్రణ ప్రక్రియ సరళీకరణ, పారదర్శకతే మా ఉద్దేశం’ అని రాజన్ వివరించారు. పరపతి విధానానికి ధరలే ప్రాతిపదిక... ఆర్బీఐ సాధారణ పరపతి విధాన సమీక్షలో ఎప్పుడూ ధరల పరిస్థితినే పరిగణనలోకి తీసుకుంటామని రాజన్ చెప్పారు. ఈ నెల 29న ఆర్బీఐ రెండో త్రైమాసిక పాలసీ సమీక్షను ప్రకటించనున్న నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.అమెరికా షట్డౌన్పై..: అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాల మూసివేత(షట్‌డౌన్)పై స్పందిస్తూ... అక్కడి ఆర్థిక వ్యవస్థ దివాలా తీసేంత పరిస్థితులేవీ లేవని రాజన్ అభిప్రాయపడ్డారు. అక్కడి ఎకానమీపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, యూఎస్ బాండ్(ట్రెజరీ బిల్స్)లలో భారత్ పెట్టుబడులను(దాదాపు 59.1 బిలియన్ డాలర్లు) విక్రయించే అవకాశమే లేదన్నారు. నేనేమీ సూపర్‌మేన్‌ను కాదు ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడంపై ప్రపంచవ్యాప్తంగా మీడియా వ్యాఖ్యానాలపై రాజన్ తనదైన శైలిలో స్పందించారు. ‘నా కొత్త బాధ్యతలపై జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కొంత అమితోత్సాహం నెలకొంది. నాపై అంచనాలు కూడా చాలా అధికంగానే ఉన్నాయి. అయితే, నేనేమీ సూపర్‌మేన్‌ను కాదని మీకు స్పష్టం చేయదలచుకున్నా’ అన్నారు. రాజన్‌ను మీడియా ‘రాక్‌స్టార్’గా అభివర్ణించడం తెలిసిందే.