Bank Holidays In March 2022 In Telangana: భారతదేశంలోని అతిపెద్ద పండుగలలో ఒకటైన హోలీ 2022లో మార్చి 18న వస్తుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా అన్నీ బ్యాంకులు మూసివేయనున్నారు. అలాగే, మహాశివరాత్రి సందర్భంగా మార్చి 1, 2022న అనేక రాష్ట్రాల్లోని బ్యాంకులు కూడా మూసివేస్తారు. మార్చి నెలలో మీకు బ్యాంకులో ఏదైనా పని ఉంటే ఈ వార్త మీకోసమే. వచ్చే నెలలో బ్యాంకులకు మొత్తం 11 రోజులు సెలవులు ఉంటాయి.
అయితే, ఈ సెలవులు అనేవి ఇతర రాష్ట్రాలలోని పండుగలను కలుపుకొని ఉంటాయి. బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్బీఐ ప్రకారం వచ్చే నెలకు సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేసింది. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 11 రోజులు సెలవులు ఉండకపోవచ్చు. ఎందుకంటే.. సెలవులను స్థానిక పండుగలు, ఇతర ప్రత్యేక దినాలను ఆధారంగా చేసుకుని నిర్ణయిస్తారు. మరి మార్చిలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయొ ఇప్పుడు తెలుసుకుందాం.
2022 మార్చి బ్యాంక్ సెలవులు:
- మార్చి 1- మహాశివరాత్రి(దేశవ్యాప్తంగా)
- మార్చి 3- లోసర్ సిక్కిం
- మార్చి 4- చాప్ చర్ కుట్ (మిజోరం)
- మార్చి 6- ఆదివారం సాధారణ సెలవు
- మార్చి 12- రెండో శనివారం సాధారణ సెలవు
- మార్చి 13- ఆదివారం సాధారణ సెలవు
- మార్చి 18- హోలీ(దేశవ్యాప్తంగా)
- మార్చి 20- ఆదివారం సాధారణ సెలవు
- మార్చి 22- బిహార్ దివాస్
- మార్చి 26- నాలుగో శనివారం
- మార్చి 27- ఆదివారం
Comments
Please login to add a commentAdd a comment