Adimulapu Suresh: No Plans to Extend Holidays For Schools in AP, Details Inside - Sakshi
Sakshi News home page

Adimulapu Suresh: ఏపీలో సెలవుల పొడిగింపుపై మంత్రి ఆదిమూలపు క్లారిటీ

Published Sun, Jan 16 2022 6:20 PM | Last Updated on Mon, Jan 17 2022 12:03 PM

No Plans to Extend Holidays For Schools in AP: Adimulapu Suresh - Sakshi

No Plans to Extend Holidays For Schools in AP: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని ప్రకటించిన విధంగా యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రత పై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

చదవండి: (అఖిలేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. 'వారిని పార్టీలోకి చేర్చుకునేది లేదు')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement