గుజరాత్‌లోని సూరత్‌లో వున్న ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ కిరణ్ జెమ్స్ తన 50000 మంది ఉద్యోగులకు 10 రోజులు (ఆగస్టు 17 నుంచి 27 వరకు) సెలవును ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్న డిమాండ్‌ను అధిగమించడానికి.. వజ్రాల ఉత్పత్తిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రపంచ మార్కెట్‌లో పాలిష్ చేసిన వజ్రాలకు డిమాండ్ లేదని కంపెనీ తెలిపింది. అయితే వజ్రాల ఉత్పత్తిని నియంత్రించేందుకు వీలుగా 10 రోజుల సెలవు ప్రకటించామని, కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని కంపెనీ చైర్మన్ వల్లభాయ్ లఖానీ తెలిపారు.
గుజరాత్‌లోని డైమండ్ ఫ్యాక్టరీలు దీపావళి సందర్భంగా సుదీర్ఘ సెలవులు తీసుకుంటాయి. అయితే ఇప్పుడు పండుగకు ముందే.. కంపెనీ సంచనల నిర్ణయం తీసుకుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సంస్థలో పనిచేస్తున్న 50,000 మందికి పైగా డైమండ్ పాలిషర్లు పనిచేస్తున్నారు. ఇందులో 40,000 మంది సహజ వజ్రాలను కత్తిరించి పాలిష్ చేస్తారు. మిగిలిన 10,000 మంది ల్యాబ్‌లో తయారయ్యే డైమండ్ యూనిట్‌లో పని చేస్తున్నారని లఖానీ పేర్కొన్నారు. కిరణ్ జెమ్స్ కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద సహజ వజ్రాల తయారీదారు మాత్రమే కాకుండా.. పాలిష్ చేసిన వజ్రాల అతిపెద్ద ఎగుమతిదారులలో కూడా ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment