
సాక్షి, ముంబై: ఆగస్టు మాసంలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) జాబితాను శనివారం విడుదల చేసింది. ఆగస్టు నెలలో శని, ఆదివారాలు కలిపి ఆరు సెలవులు. ఆగస్ట్‌లో ఆగస్ట్ 9 (మంగళవారం), స్వాతంత్య్ర దినోత్సవం,ఆగస్టు 19 (శుక్రవారం) జన్మాష్టమి ఆగస్టు 19 (శుక్రవారం) ఉన్నాయి.
ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు గెజిట్ సెలవులు, చట్టబద్ధమైన సెలవులు, ఆదివారాల్లో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు పనిచేయవు. అలాగే ప్రతీ నెల రెండో, నాల్గో శనివారాల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాల్లో పలు ప్రాంతీయ పండుగల సందర్భంగా కూడా ఆయా రాష్ట్రాల్లోని బ్యాంకుల స్థానిక శాఖలు బ్యాంకులు పనిచేయవు. దీని ప్రకారం ఆగస్టు నెలవారీ సెలవులు ఇలా ఉన్నాయి. అయితే సెలవు రోజుల్లో కూడా ఆన్‌లైన్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని గమనించాలి.
జాతీయ, ప్రాంతీయ సెలవులు
ఆగస్టు 1: ద్రుక్పా త్షే-జి (సిక్కిం)
ఆగస్టు 8, 9: మోహర్రం
ఆగస్టు 11, 12, శుక్ర, శని : రక్షా బంధన్
ఆగస్టు 13: దేశభక్తుల దినోత్సవం
ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 16: పార్శీల నూతన సంవత్సరం (షాహెన్‌షాహి)
ఆగస్టు 18,గురువారం: జన్మాష్టమి
ఆగస్ట్ 19, శుక్రవారం: శ్రావణ వద్/కష్ణ జయంతి
ఆగస్టు 20, శనివారం: శ్రీకష్ణాష్టమి
ఆగస్టు 29, సోమవారం: శ్రీమంత శంకరదేవుని తిథి
ఆగస్టు 31, బుధవారం వినాయక చవితి
ఆగస్టు 7: ఆదివారం
ఆగస్టు 13 : శనివారం
ఆగస్టు 14: ఆదివారం
ఆగస్టు 21: ఆదివారం
ఆగస్ట్ 27: నాల్గో శనివారం
ఆగస్టు 28: ఆదివారం
ఇది కూడా చదవండి: Zomato: జొమాటోకు భారీ షాక్, ఎందుకంటే?