Month of August
-
ప్రసవాల్లో సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు నెలలో నమోదైన ప్రసవాల్లో 76.3 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగాయని, ఇది ప్రభుత్వ ఆస్పత్రుల చరిత్రలో సరికొత్త రికార్డు అని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 2014లో 30 శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు, ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు. ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆశాలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి నెలవారీ సమీక్షను నిర్వహించారు. అత్యధికంగా నారాయణపేట ఆస్పత్రిలో 89% అత్యధికంగా నారాయణపేట ఆస్పత్రి 89 శాతం, ములుగు 87, మెదక్ 86, భద్రాద్రి కొత్తగూడెం 84, వికారాబాద్ 83, గద్వాల ఆస్పత్రి 85 శాతం ప్రసవాలతో మంచి పనితీరు కనబర్చాయని హరీశ్‌రావు అభినందించారు. అతి తక్కువగా డెలివరీలు అవుతున్న మంచిర్యాల (63), నిర్మల్ (66), మేడ్చల్, కరీంనగర్ (67) జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనితీరు మెరుగుపడాలన్నారు. మొత్తంగా మంచి సామర్థ్యపు స్కోర్ విషయంలో తొలి వరుసలో నిలిచిన మెదక్ (84.4), జోగుళాంబ గద్వాల (83.9), వికారాబాద్ (81), ములుగు (79), నాగర్‌కర్నూల్ (77) జిల్లాల వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. చివరి స్థానాల్లో ఉన్న జగిత్యాల, కొమురంభీం, నారాయణపేట, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖలోని అన్ని స్థాయిల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు ఎక్కడా అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. 102, 108 వాహన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యాలపై దృష్టి సారించాలని, కేసీఆర్ కిట్ డేటా ఆధారంగా డెలివరీ డేట్ తెలుసుకొని ముందస్తుగా ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. -
Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే?
సాక్షి, ముంబై: ఆగస్టు మాసంలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) జాబితాను శనివారం విడుదల చేసింది. ఆగస్టు నెలలో శని, ఆదివారాలు కలిపి ఆరు సెలవులు. ఆగస్ట్‌లో ఆగస్ట్ 9 (మంగళవారం), స్వాతంత్య్ర దినోత్సవం,ఆగస్టు 19 (శుక్రవారం) జన్మాష్టమి ఆగస్టు 19 (శుక్రవారం) ఉన్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు గెజిట్ సెలవులు, చట్టబద్ధమైన సెలవులు, ఆదివారాల్లో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు పనిచేయవు. అలాగే ప్రతీ నెల రెండో, నాల్గో శనివారాల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాల్లో పలు ప్రాంతీయ పండుగల సందర్భంగా కూడా ఆయా రాష్ట్రాల్లోని బ్యాంకుల స్థానిక శాఖలు బ్యాంకులు పనిచేయవు. దీని ప్రకారం ఆగస్టు నెలవారీ సెలవులు ఇలా ఉన్నాయి. అయితే సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని గమనించాలి. జాతీయ, ప్రాంతీయ సెలవులు ఆగస్టు 1: ద్రుక్పా త్షే-జి (సిక్కిం) ఆగస్టు 8, 9: మోహర్రం ఆగస్టు 11, 12, శుక్ర, శని : రక్షా బంధన్ ఆగస్టు 13: దేశభక్తుల దినోత్సవం ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 16: పార్శీల నూతన సంవత్సరం (షాహెన్షాహి) ఆగస్టు 18,గురువారం: జన్మాష్టమి ఆగస్ట్ 19, శుక్రవారం: శ్రావణ వద్/కష్ణ జయంతి ఆగస్టు 20, శనివారం: శ్రీకష్ణాష్టమి ఆగస్టు 29, సోమవారం: శ్రీమంత శంకరదేవుని తిథి ఆగస్టు 31, బుధవారం వినాయక చవితి ఆగస్టు 7: ఆదివారం ఆగస్టు 13 : శనివారం ఆగస్టు 14: ఆదివారం ఆగస్టు 21: ఆదివారం ఆగస్ట్ 27: నాల్గో శనివారం ఆగస్టు 28: ఆదివారం ఇది కూడా చదవండి: Zomato: జొమాటోకు భారీ షాక్, ఎందుకంటే? -
అనుకున్న దానికంటే ఎక్కువనే...
- ఆగస్టు లక్ష్యం సాధించిన సింగరేణి - వార్షిక లక్ష్య సాధనలో కూడా ముందంజ - నాలుగు ఏరియాల్లో వంద శాతంపైగా ఉత్పత్తి - వర్షం అడ్డంకిగా మారినా ఆగని ఉత్పత్తి కొత్తగూడెం (ఖమ్మం) : సింగరేణి సంస్థ ఆగస్టు నెలలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించింది. అంతేకాక వార్షిక లక్ష్యంలో సైతం ముందంజలో ఉంది. ఆగస్టులో 3.76 మిలియన్ టన్నులకుగాను 3.82 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించి 102 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకుంది. వార్షిక లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు 17.22 మిలియన్ టన్నులకు గాను 18.88 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించిన 115 శాతంతో విజయపథంలో దూసుకుపోతోంది. జూలైలో వర్షం కారణంగా ఉత్పత్తి తగ్గడంతో ఆ ప్రభావం వార్షిక ఉత్పత్తిపై కూడా పడింది. కానీ ఆగస్టులో వర్షాలు అంతంతమాత్రంగా పడడంతో ఓపెన్‌కాస్టు గను ల్లో ఉత్పత్తి యధావిధిగా కొనసాగింది. గడిచిన ఐదు నెలల్లో సింగరేణి వ్యాప్తంగా 17.22 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 19.88 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించగలిగింది. కొత్తగూడెం, మణుగూరు, రామగుండం -3, శ్రీరాంపూర్ ఏరియాలు మాత్రమే ఈ ఏడాదిలో ఇప్పటివరకు వంద శాతం ఉత్పత్తితో ముందుకు సాగుతున్నాయి. మిగిలిన ఆరు ఏరియాల్లో ఉత్పత్తి పూర్తిస్థాయిలో రావడం లేదు. ఆగస్టులో 102 శాతం ఉత్పత్తి ఆగస్టులో ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల ప్రభావం సింగరేణి సంస్థపై కన్పించలేదు. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో 37.64 లక్షల బొగ్గు ఉత్పత్తిని సాధించాల్సి ఉండగా 38.23 లక్షల టన్నుల బొగ్గును వెలికితీశారు. సింగరేణిలోని పది ఏరియాల్లో కేవలం ఐదు ఏరియాలు మాత్రమే నూరు శాతం ఉత్పత్తిని సాధించగలిగాయి. అత్యధికంగా ఇల్లెందు.. మణుగూరు ఏరియా 4.5 లక్షల టన్నులకు గాను 5.77 లక్షల టన్నులతో 128 శాతంతో ముందంజలో నిలిచింది. కొత్తగూడెం ఏరియా 5 లక్షల టన్నులకు 6 లక్షల టన్నులతో 120 శాతం ఉత్పత్తితో రెండో స్థానంలో నిలిచింది. రామగుండం-1 ఏరియా 4.2 లక్షల టన్నులకుగాను 4.6 లక్షల టన్నులతో మూడో స్థానం, మందమర్రి ఏరియాలో 1.5 లక్షల టన్నులకు గాను 1.53 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి 102 శాతం ఉత్పత్తితో నాలుగో స్థానంలో నిలిచింది. శ్రీరాంపూర్ ఏరియా 4 లక్షల టన్నులకు గాను 4.01 లక్షల టన్నులతో ఐదో స్థానంలో నిలిచింది. మిగిలిన ఏరియాలు నూరు శాతం ఉత్పత్తిని సాధించలేకపోయాయి. -
వామ్మో.. ఆగస్టు!
ఒంగోలు : ఆగస్టు నెల రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఇప్పటికే రుణమాఫీ, రుణాల రీషెడ్యూల్ వంటి అంశాలు సీఎం చంద్రబాబుకు తలబొప్పి కటిస్తున్నాయి. రైతుల ఆందోళనలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇవి చాలవన్నట్టు సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు ఒకటో తేదీన విద్యార్థులు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమించేందుకు ఆ సంఘ నేతలు సమాయత్తమవుతున్నారు. మరో వైపు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెకు పిలుపునిచ్చారు. రెండో తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఇంకో వైపు ఆర్టీసీలో గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఆందోళన బాట పట్టింది. ఎంప్లాయీస్ యూనియన్ ఈ నెల 2వ తేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. ఇక మాటలు చాలు.. పనులు చేసి చూపండి.. అంటూ పాలకపక్షాన్ని కార్మిక, విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల్లో ఆగ్రహం జిల్లా వ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఐటీఐ వంటి కోర్సులు చదువుకున్న విద్యార్థులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన విద్యార్థులను ఫీజులు చెల్లించాలని కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇచ్చేదిలేదంటూ హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విద్యార్థి సంఘాలు శుక్రవారం బంద్ నిర్వహించనున్నాయి. కార్మికుల హెచ్చరిక మున్సిపల్ ఉద్యోగులతో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు కూడా ఆందోళనకు దిగుతున్నారు. సమస్యల పరిష్కారానికి సహకరించని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు పిడికిలి బిగిస్తున్నాయి. అందులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నారు. వీరికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అండగా నిలవనుంది. ఆర్టీసీ బస్సులకు బ్రేకులు ఆర్టీసీలో గుర్తింపు పొందిన ఎంప్లాయీస్ యూనియన్ ఆగస్టు 2వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు సమాయత్తమవుతోంది. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏటా జూన్ వస్తుందంటే కార్మికులు సీసీఎస్ వైపు దృష్టిసారిస్తారు. సీసీఎస్‌కు సంబంధించి కార్మికులకు కొన్ని అభ్యంతరాలున్నాయి. యాజమాన్యంతో యూనియన్ నాయకులు చర్చలు జరిపినా ఉపయోగం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో జూలై 30వ తేదీ నుంచి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీ రావులు ఆయా ప్రాంతాల్లో నిరవధిక దీక్షకు పూనుకున్నారు.