సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర టోల్ ప్లాజా వాహనాలతో కిటకిటలాడిపోతోంది. వేల సంఖ్యలో వాహనాలు రావటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరుసగా గాంధీ జయంతి, శనివారం, ఆదివారం మూడు రోజులు సెలవులు రావటంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు చాలా మంది ప్రయాణికులు తరలి వెళుతున్నారు. అధికంగా వాహనాలు రావడంతో కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాపిక్ జామ్ అయ్యింది. గంటలు తరబడి ట్రాఫిక్ స్థంభించిపోవటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.