సంక్రాంతి పర్వదినానికి హైదరాబాద్ మహానగరం విడిచి వెళ్లిన వారంతా మళ్లీ నగరబాట పట్టారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. సాధారణ రోజుల్లో రోజుకు 20 వేల వాహనాలు తిరుగుతుండగా, ప్రస్తుతం 30 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు సంక్రాంతి పండగ ముందు తమ స్వగ్రామాలకు వెళ్లారు. పండుగ ముగియడం..దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి విజయవాడ వైపు నుంచి వాహనాల రద్దీ పెరిగింది.