సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో బుధ, గురువారాలు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. అనంతరం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని విద్యాసంస్థలకు బుధ, గురువారం సెలవులంటూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థల పరిస్థితిపై ప్రభుత్వం ఆరా తీసింది. దీంతో ఉన్నతాధికారులు జిల్లాల నుంచి సమాచారం సేకరించారు.
చదవండి: హైదరాబాద్ వర్షాలు.. ఆ ఏరియా వాళ్లు ఈ టైంకు ఆఫీస్‌లో లాగౌట్ చేయాల్సిందే
అనేకచోట్ల విద్యార్థుల హాజరు తగ్గిందని, బడులకు వచ్చే అవకాశం లేదని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. దాదాపు 6 వేల బడుల్లో 30 శాతం హాజరు కూడా కన్పించలేదని తెలిసింది. వర్షాలు పడుతుండటంతో బడుల్లో మధ్యాహ్న భోజనం వండటానికీ అష్టకష్టాలు పడుతున్నారు. భోజనం వండే అవకాశం ఉండటం లేదని, తరగతి గదులకు సమీపంలోని వరండాల్లో వండటం వల్ల పొగతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పలువురు హెచ్‌ఎంలు చెప్పారు.
అన్నిచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించిందని, రాకపోకలు నిలిచిపోతున్నాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితులను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించి సెలవులు ఇవ్వాలని మంత్రి సబితను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment