Bangalore School Holidays 2021: Karnataka Schools Suspends Due To Covid - Sakshi
Sakshi News home page

బెంగళూరులో పాఠశాలలకు సెలవులు 

Published Sat, Apr 3 2021 2:26 PM | Last Updated on Sat, Apr 3 2021 3:24 PM

Bengaluru Schools: Karnataka Suspends Standard 6 to 9 Physical Classes - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరు అర్బన్‌ జిల్లాలో 15 రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

యశవంతపుర: దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న జిల్లాల్లో ఒకటైన బెంగళూరు అర్బన్‌ జిల్లాలో 15 రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 15 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేశ్‌కుమార్‌ శుక్రవారం విలేకరులకు తెలిపారు. కరోనా నియంత్రణకు ఏర్పాటైన సాంకేతిక సలహా సమితి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, సెలవులు ఎప్పటినుంచి అనే విషయాన్ని శనివారం ప్రకటిస్తామన్నారు. 10వ తరగతి విద్యార్థులు తరగతులకు హాజరు కావడం తప్పనిసరి కాదన్నారు.  

కేంద్ర ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం కర్ణాటకలో 34,238 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో ఆరుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 9,59,400 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. 

ఇక్కడ చదవండి:
బెంగళూరు డ్రగ్‌ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు..

అసలు నా శాఖలో ముఖ్యమంత్రికి ఏం పని సర్?‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement