మీకు బ్యాంకులో ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే ఈ వారంలోపు పూర్తీ చేయండి. లేకపోతే మీరు బ్యాంకు పనుల కోసం ఏప్రిల్ 3 వరకు వేచి ఉండాల్సి వస్తుంది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య కేవలం రెండు రోజులు మాత్రమే బ్యాంకు కార్యాలయము పనిచేస్తాయి. కాబట్టి, బ్యాంకులో ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే ఈ వారంలోపు పూర్తీ చేయండి. మార్చి 27న చివరి శనివారం, మార్చి 28న ఆదివారం, మార్చి 29న హోలీ పండుగ ఇలా మూడు రోజులు వరుస సెలవులు ఉన్నాయి. తర్వాత మార్చి 30న పాట్నాలో హాలిడే ఉంది. మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావడంతో బ్యాంకుల్లో కస్టమర్లకు సేవలు లభించవు.
అలాగే ఏప్రిల్ 1న కూడా బ్యాంక్ సేవలు సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండవు. బ్యాంకులు వార్షిక ఖాతాల క్లోజింగ్ పనిలో ఉంటాయి. ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే. అంటే బ్యాంకులు 9 రోజుల్లో దాదాపు 7 రోజులు పని చేయవని చెప్పుకోవచ్చు. దీని వల్ల మీకు బ్యాంకులో పని ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఇప్పటికే ఈ నెలలో చాలా సెలవులు వచ్చాయి. మార్చి 15-16 తేదీలలో బ్యాంకుల ప్రైవేటీ కరణకు నిరసనగా రెండు రోజులు పాటు బ్యాంకులు పనిచేయలేదు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment