సాక్షి, హైదరాబాద్: తరగతుల ప్రారంభానికి కంటే.. ఈ ఏడాది విద్యా సంవత్సరం షెడ్యూల్ ఖరారు చేసింది తెలంగాణ విద్యాశాఖ(ప్రాథమిక). 2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్లుగా.. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అలాగే.. వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 24వ తేదీని చివరి పనిదినంగా నిర్ణయించింది.
► 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
► బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
► 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
► 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
► అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
► జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
► ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
► 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.
Comments
Please login to add a commentAdd a comment