
డీజీపీ శైలేంద్రబాబు
సాక్షి, చెన్నై(తమిళనాడు): పోలీసులకు వారంలో ఓ రోజు తప్పనిసరిగా వీక్లీ ఆఫ్ ఇవ్వాల్సిందేనని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ శైలేంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. బర్త్‌డే, వివాహ వేడుక జరుపుకోదలచిన పోలీసులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలతో సెలవుకు ఆదేశించారు. విధి నిర్వహణలో పోలీసులకు పనిభారం పెరుగుతుండడాన్ని పరిగణించి వారంలో ఓరోజు సెలవు తప్పనిసరిగా అమలుకు డీజీపీ శైలేంద్రబాబు ఉత్తర్వులతో పోలీసు యంత్రాంగం శనివారం ప్రత్యేక ప్రకటన చేసింది.
ఆమేరకు అన్నిస్టేషన్లు, వివిధ విభాగాల్లో, ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులకు వారంలో ఓ రోజు వీక్లీ ఆఫ్ తప్పనిసరి చేశారు. ఎవరైనా పోలీసు బర్త్‌డే, వివాహ వేడుక జరుపుకోదలచిన పక్షంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, సెలవు మంజూ రుకు ఆదేశాల్ని ఆ ఉత్తర్వుల్లో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment