Weekly off
-
పోలీసులకు డీజీపీ తీపికబురు.. వారంలో ఓరోజు వీక్లీ ఆఫ్.. బర్త్‌డేకూ..
సాక్షి, చెన్నై(తమిళనాడు): పోలీసులకు వారంలో ఓ రోజు తప్పనిసరిగా వీక్లీ ఆఫ్ ఇవ్వాల్సిందేనని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ శైలేంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. బర్త్‌డే, వివాహ వేడుక జరుపుకోదలచిన పోలీసులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలతో సెలవుకు ఆదేశించారు. విధి నిర్వహణలో పోలీసులకు పనిభారం పెరుగుతుండడాన్ని పరిగణించి వారంలో ఓరోజు సెలవు తప్పనిసరిగా అమలుకు డీజీపీ శైలేంద్రబాబు ఉత్తర్వులతో పోలీసు యంత్రాంగం శనివారం ప్రత్యేక ప్రకటన చేసింది. ఆమేరకు అన్నిస్టేషన్లు, వివిధ విభాగాల్లో, ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులకు వారంలో ఓ రోజు వీక్లీ ఆఫ్ తప్పనిసరి చేశారు. ఎవరైనా పోలీసు బర్త్‌డే, వివాహ వేడుక జరుపుకోదలచిన పక్షంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, సెలవు మంజూ రుకు ఆదేశాల్ని ఆ ఉత్తర్వుల్లో వివరించారు. -
కొత్త వెలుగులు
సాక్షి, అమరావతి: వీక్లీ ఆఫ్ ఇవ్వడంతో పోలీసుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసినట్టుగానే వేతనాల పెంపుతో హోంగార్డుల జీవితాల్లోనూ కొత్త వెలుగులు ఉదయించాయి. వేతనాల పెంపుతోపాటు అనేక ప్రయోజనాలు కూడా కల్పించడంతో దుర్భర పరిస్థితుల నుంచి ధైర్యంగా విధులు నిర్వర్తించగలుగుతున్నామంటూ హోంగార్డులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులతో సమానంగా కష్టపడుతూ చాలీచాలని జీతాలతో తాము విధులు నిర్వర్తించామని.. ఇప్పుడు తమ కష్టాలు తీరుతున్నాయని చెబుతున్నారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం జూన్ 10న నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే హోంగార్డులకు వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోంగార్డుల రోజువారీ వేతనాన్ని రూ.600 నుంచి రూ.710కి పెంచింది. దీంతో వారి నెల జీతం రూ.18 వేల నుంచి రూ.21,300కు పెరిగింది. పెంచిన వేతనాన్ని అక్టోబర్ 1 నుంచి వర్తింపచేయాలని ఉత్తర్వులిచ్చింది. వేతన పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా 16,616 మందికి మేలు కలుగుతుంది. వేతనం పెంపుతోపాటు మరెన్నో ప్రయోజనాలు ఇప్పటివరకు పోలీసులకు మాత్రమే అమలవుతున్న బీమాను హోంగార్డులకు వర్తింపజేస్తూ తాజాగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హోంగార్డు అకాల మరణం చెందితే రూ.30 లక్షలు, తీవ్రవాదుల దాడుల్లో చనిపోతే మరో రూ.10 లక్షలు కలిపి రూ.40 లక్షలు ఇవ్వనుంది. ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షలు పరిహారం అందిస్తుంది. హోంగార్డు చనిపోతే అంత్యక్రియల కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.10 వేలకు పెంచింది. అంతేకాకుండా వారి ఆరోగ్య సంరక్షణ కోసం అతి త్వరలోనే హెల్త్ కార్డులను కూడా మంజూరు చేయనుంది. నిబంధనల ప్రకారం.. అర్హత ఉన్న హోంగార్డులకు గృహనిర్మాణ పథకంలో ఇళ్లు కేటాయించే ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తోంది. జీవితంలో మరిచిపోలేం – ఎస్.గోవిందు, హోంగారŠుడ్స అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హోంగార్డుల వేతనాలు పెంచి సీఎం వైఎస్ జగన్ మా మనసు గెలుచుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. వైఎస్ జగన్ చేసిన మేలును మా జీవితంలో మరిచిపోలేం. ప్రతినెలా ఒకటినే జీతం అందుతోంది అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వేతనాలు పెంచడం పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ప్రతి నెలా ఒకటినే మాకు జీతం అందుతోంది. దీంతో కుటుంబ సమస్యలు తీరుతున్నాయి. - సీహెచ్.శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ పీఆర్వో, హోంగార్డు అసోసియేషన్ గుంటూరు రూరల్ సీఎంను జీవితాంతం గుర్తుంచుకుంటాం కాళ్లరిగేలా తిరిగినా చంద్రబాబు మమ్మల్ని ఆదుకోలేదు. చివరకు పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిశాం. ‘అన్నా మన ప్రభుత్వం వచ్చాక మీ వేతనాలు పెంచుతాం’ అని ఆయన మాకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మాట నిలబెట్టుకుని మా కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఆయనను మా జీవితాంతం గుర్తుంచుకుంటాం. – రూప్‌కుమార్, హోంగార్డు, చిత్తూరు -
మన పోలీసులకు మహా పని గంటలు
సాక్షి, అమరావతి: షిఫ్ట్‌లు.. 8 గంటల పని వేళతో సంబంధం లేకుండా శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడుతుంటారు పోలీసులు. దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులు రోజుకు పది గంటల పైనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్క నాగాలాండ్‌లో మాత్రమే రోజుకు 8 గంటలు పనిచేస్తుంటే.. ఒడిశాలో ఏకంగా 18 గంటల పాటు విధుల్లోనే ఉంటున్నారు. ఒడిశా తరువాత 17 గంటలపాటు పనిచేస్తున్న పంజాబ్ పోలీసులు రెండో స్థానంలో ఉంటే.. రోజుకు 16 గంటల పనితో ఏపీ పోలీసులు మహా పనిమంతులుగా నిలుస్తున్నారు. తెలంగాణ, బీహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల పోలీసులు సైతం 16 గంటలపాటు విధుల్లో ఉంటున్నారు. మూడు రాష్ట్రాల పోలీసులు 14 గంటలు, రెండు రాష్ట్రాల్లో 13 గంటలు, మూడు రాష్ట్రాల్లో 12 గంటలు, రెండు రాష్ట్రాల్లో 11 గంటలపాటు పోలీసులు పని చేస్తున్నట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీక్లీ ఆఫ్‌తో ఊరట తాను అధికారంలోకి వచ్చాక పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తానని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ మాట నిలబెట్టుకోవడంతో ఏపీ పోలీసులకు ఊరట లభించింది. ఈ ఏడాది జూన్ నుంచి అమల్లోకి వచ్చిన వీక్లీ ఆఫ్ విధానం కానిస్టేబుల్ స్థాయినుంచి అధికారుల వరకు వర్తించేలా చర్యలు చేపట్టారు. దీంతో సరిపెట్టకుండా సీఎం ఆదేశాలతో పోలీసులకు ఆరోగ్య భద్రత, వారి కుటుంబాల సంక్షేమం వంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఏపీ పోలీసుల్లో ఆత్మస్థైర్యం నింపినట్టైంది. -
మాకూ వీక్లీ ఆఫ్ కావాలి
కర్ణాటక ,యశవంతపుర : ఐటీ, బీటీ, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వీక్లీ ఆఫ్ ఇవ్వాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ రెండు రోజులు సెలవు ఇస్తున్నారు. మాకు ఒక్కరోజైనా సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పూజలు, హోమాల పేరుతో రోజు దేవస్థానాలలో అర్చకులకు బీజీగా ఉంటున్నారు. కనీసం వారానికి ఒక రోజు సెలవు ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. -
తెలంగాణలో పోలీసులకు వీక్లీ ఆఫ్
-
పోలీసులకు వీక్లీ ఆఫ్
సాక్షి, హైదరాబాద్: పోలీసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారాంతపు సెలవు అమలుకు రాష్ట్ర పోలీసుశాఖ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు డీజీ కార్యాలయం నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. డ్యూటీ రోస్టర్ చార్ట్ ప్రకారం.. సిబ్బంది నిష్పత్తి ఆధారంగా వీక్లీ ఆఫ్‌లు ప్లాన్ చేయాలని డీజీ కార్యాలయం అన్ని జిల్లా ఎస్పీ, కమిషనర్ కార్యాలయాలను ఆదేశించింది. చాలా మంది ఎస్పీలు, కమిషనర్లు నేటి నుంచే అమలు చేయడానికి మొగ్గు చూపించడం గమనార్హం. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం నుంచే ఈ డిమాండ్‌ను అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కరీంనగర్‌లాంటి కొన్ని జిల్లాల్లో అమలు చేశారు. తరువాత అనివార్య కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది కూడా వీక్లీ ఆఫ్ ప్రస్తావన వచ్చినా.. అమలు చేసేలోగానే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్త హోంమంత్రి మహమూద్ అలీ కూడా వీక్లీ ఆఫ్‌పై సానుకూలంగా స్పందించారు. కోడ్ కారణంగా కొండెక్కిన అమలు.. రాష్ట్రంలో సుదీర్ఘంగా నెలకొన్న ఎన్నికల కోడ్ కారణంగా వారాంతపు సెలవు అమలు కుదరలేదు. తరువాత సర్పంచి, స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలతో వరుసగా రాష్ట్రంలో గత మే నెల వరకు ఎన్నికల కోడ్ ఉంది. దీంతో అమలు సాధ్యం కాలేదు. తాజాగా ఈ నెల నుంచి ఏపీ ప్రభుత్వం కూడా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేయడంతో తిరిగి తెలంగాణలోనూ ఈ విషయంపై కదలిక వచ్చింది. దీంతో నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులు వీక్లీ ఆఫ్ అమలు చేయడం ప్రారంభించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖ డిమాండ్ పెరగడం, పోలీసు అధికారుల సంఘం కూడా డీజీపీ మహేందర్‌రెడ్డిని కలసి వారంతాపు సెలవుపై విన్నవించడంతో మార్గం సుగమమైంది. వేధిస్తున్న సిబ్బంది కొరత.. వాస్తవానికి రాష్ట్ర జనాభాకు ఉన్న పోలీసులు ఇప్పుడు ఏమాత్రం సరిపోరు. ఉద్యోగుల కొరత కారణంగానే ఇంతకాలం వీక్లీ ఆఫ్ అమలు సాధ్యపడలేదు. పోలీసు మాన్యువల్ 617 ప్రకారం వీక్లీ ఆఫ్ తీసుకోవచ్చు. కానీ, డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బంది కొరత కారణంగా ఇది ఇంతకాలం సాధ్యపడలేదు. మొత్తానికి పోలీసుల చిరకాల డిమాండ్ నెరవేరబోతున్నందుకు డిపార్ట్మెంట్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం.. రాష్ట్రంలో ప్రతీ 400 మందికి ఒక పోలీసు చొప్పున ఉండాలి. కానీ, సిబ్బంది కొరత కారణంగా ప్రతీ 800 మందికి ఒక పోలీసు చొప్పున ఉన్నారు. పోలీసుశాఖలో ఇప్పుడు 54 వేల మంది సిబ్బంది ఉన్నారు. త్వరలో రిక్రూట్‌కాబోతున్న 18,500 మంది పోలీసులు విధుల్లో చేరితే, వీక్లీ ఆఫ్ అమలు మరింత సులువు కానుంది. డీజీపీ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు నిత్యం 24 గంటల డ్యూటీతో సతమతమయ్యే పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ విషయంలో డీజీపీకి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. పనిఒత్తిడి, విరామం లేని విధుల కారణంగా చాలామంది సిబ్బంది మధుమేహం, బీపీ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు ఎంతో స్వాంతన చేకూరుస్తుంది. -గోపీరెడ్డి, పోలీసు అధికారుల సంఘం, రాష్ట్ర అధ్యక్షుడు -
ఆ నిర్ణయంతో సీఎం జగన్ చరిత్రకెక్కారు
సాక్షి, అమరావతి : పోలీసుల వీక్లీ ఆఫ్ అమలు చేసే విషయంలో మానవతను చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి తెలిపారు. దేశంలోనే ఇటువంటి సాహసం చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందన్నారు. ‘మీ సీఎం మాటిస్తే వెనక్కు తగ్గరంట గదా’ అని పలువురు ఎంపీలు సెంట్రల్ హాల్లో తనతో అన్నారని ట్వీట్ చేశారు. గురువారం ట్విటర్ వేదికగా సీఎం వైఎస్ జగన్‌ను కొనియాడిన విజయసాయి రెడ్డి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ధ్వజమెత్తారు. కొడుకు, కుమార్తెలను బందిపోట్లుగా మార్చిన మాజీ స్పీకర్ కోడెలను పార్టీ నుంచి బహిష్కరించే దమ్ముందా? అని చంద్రబాచుకు సవాల్ విసిరారు. కోడెల కుటుంబం బలవంతపు వసూళ్లతో వందల కోట్లు దోచుకుందని, అనేక మంది బాధితులు మిమ్మల్ని కలిసి వేడుకున్నా పట్టించుకోలేదని అంటున్నారని, కొంపదీసి మీకేమైనా అందులో వాటా ఉందా ఏమిటని సందేహం వ్యక్తం చేశారు. చదవండి : అన్నిచేసి.. ఇప్పుడేమో నంగనాచి డ్రామాలు ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్ -
పోలీస్‌శాఖలో ఫ్రారంభమైన వీక్లిఆఫ్ విరామం
-
నేటి నుంచి ఏపీలో పోలీసులకు వీక్లీఆఫ్
-
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. పోలీసులకు వీక్లీఆఫ్..
సాక్షి, అమరావతి: పోలీసులకు వీక్లీఆఫ్ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చినట్టు రాష్ట్ర శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. దీని అమలు విషయంలో సాధ్యాసాధ్యాల అధ్యయనానికి అయ్యన్నార్ చైర్మన్‌గా 21 మందితో ఏర్పాటుచేసిన కమిటీ సమావేశం మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగింది. డీజీపీ డి. గౌతమ్ సవాంగ్ పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రవిశంకర్ అయ్యన్నార్ మీడియాకు వివరించారు. నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలోని విశాఖ, కడప, ‘ప్రకాశం’ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీక్లీఆఫ్‌ను అమలు చేసినట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి మొత్తం 70 వేల మంది పోలీసులకు వీక్లీఆఫ్ అమలుచేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం మొత్తం 19 ఆప్షన్స్ (మోడల్స్)ని ఎంపిక చేశామన్నారు. ప్రతీ యూనిట్ ఆఫీసర్ వాటిలో ఏదో ఒకటిని ఎంపిక చేసుకోవచ్చన్నారు. ప్రతి యూనిట్ నుండి రెండు నెలలకోసారి సమాచారం తీసుకుని అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తామన్నారు. ఈ నిర్ణయం కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయి వరకు వర్తిస్తుందన్నారు. వీక్లీఆఫ్ అమలుకు ఇబ్బంది లేకుండా అవసరమైతే హెడ్ క్వార్టర్స్ సిబ్బందిని కూడా ఉపయోగించుకుంటామన్నారు. అలాగే, వీఆర్‌లో ఉన్నవారిని, పనిష్మెంట్లు తీసుకున్న వారిని కూడా విధుల్లోకి తీసుకుంటామన్నారు. వీక్లీఆఫ్‌లతో షిఫ్ట్ డ్యూటీస్ కూడా ఉంటాయన్నారు. ఐటీ ప్లాట్ఫారం తయారుచేసి పారదర్శకంగా డాష్ బోర్డును అమల్లోకి తీసుకు రాబోతున్నట్టు చెప్పారు. ఖాళీల భర్తీకి సర్కారుకు నివేదన ఇదిలా ఉంటే.. పోలీసు శాఖలో ఉన్న 20 శాతం ఖాళీలను భర్తీచేసేలా ప్రభుత్వానికి నివేదించినట్టు రవిశంకర్ అయ్యన్నార్ చెప్పారు. మొత్తం 12,300 ఖాళీలున్నాయని తమ కమిటీ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలిపారు. వీఐపీ, యాంటీ నక్సల్స్ విధులకు ఇబ్బంది రాకుండా వీలైనంత త్వరగా ప్రభుత్వం ఖాళీలు భర్తీచేసేలా చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే, పనిఒత్తిడి కారణంగా పోలీసులు గుండె, కిడ్నీ, సుగర్ తదితర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. వీరి సంక్షేమానికి చర్యలు చేపడతామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు అయ్యన్నార్ తెలిపారు. చంద్రబాబుకు భద్రత తగ్గించలేదు ‘సాక్షి’తో ఏపీ డీజీపీ సవాంగ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు పోలీసు భద్రత తగ్గించినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని, ఆయనకు భద్రత తగ్గించలేదని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అలాగే, సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతున్నాయనేది కూడా అవాస్తవమన్నారు. శాంతిభద్రతల విషయంలో నిష్పాక్షికంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారని డీజీపీ స్పష్టంచేశారు. ఇకపై పోలీస్ అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండబోదన్నారు. రాష్ట్రంలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గతంలో జరిపిన దాడులపై వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కాగా, పోలీస్ శాఖలో వీక్లీఆఫ్ అమలుచేసేలా సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం పోలీస్ సంస్కరణలు, సంక్షేమానికి తొలి అడుగని ఆయన అభివర్ణించారు. పోలీసు సంఘం కృతజ్ఞతలు వీక్లీఆఫ్ అమలుకు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లకు ఏపీ పోలీసు అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఏపీ పోలీసు అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సవాంగ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎం పదవి చేపట్టిన అతి తక్కువ కాలంలోనే ఇచ్చిన హామీని అమలుచేయడం గొప్ప విషయమని చంద్రశేఖర్‌రెడ్డి కొనియాడారు. వీరిని పోలీసులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చంద్రశేఖర్‌రెడ్డి కితాబిచ్చారు. అలాగే, ఇది చాలా సాహసోపేత నిర్ణయమని సీఐడీ ఐజీ కాళిదాసు రంగారావు అన్నారు. తాను కూడా వరంగల్, విజయనగరం జిల్లాల ఎస్పీగా పనిచేసినప్పుడు పోలీసులకు వీక్లీఆఫ్ ఇద్దామని ప్రయత్నించి పూర్తిస్థాయిలో అమలుచేయలేకపోయానని చెప్పారు. -
ఈ నిర్ణయం పోలీస్ సంస్కరణలు, సంక్షేమానికి తొలి అడుగు
-
‘చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించారనడంలో నిజం లేదు’
సాక్షి, అమరావతి : పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ అమలు చేసేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీసు వీక్లీ ఆఫ్లకు సంబంధించి డీజీపీ మంగళవారం సాక్షి టీవీతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పోలీస్ సంస్కరణలు, సంక్షేమానికి తొలి అడుగని ఆయన అభివర్ణించారు. ఈ స్పూర్తితో పోలీసులు మరింత మెరుగైన సేవలతో ప్రజలకు చేరువ అవుతారని పేర్కొన్నారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయడుకు సెక్యూరిటీ తగ్గించారనే ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతున్నాయనేది అవాస్తవం అన్నారు. శాంతిభద్రతల విషయంలో నిష్పాక్షికంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. పోలీస్ శాఖలో ప్రక్షాళన జరగాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని వెల్లడించారు. ఇకపై పోలీస్ అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. గతంలో ఏసీబీ జరిపిన దాడులపై వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఏసీబీ కూడా చట్ట ప్రకారమే వ్యవహరించాలన్నారు. -
‘పోలీసులకు వీక్లీ ఆఫ్ ఓ సంచలన నిర్ణయం’
సాక్షి, అమరావతి: పోలీసు వ్యవస్థలో వారాంతపు సెలవు ఓ సంచలన నిర్ణయమని పోలీసు అధికారుల రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం హర్షనీయమని, ఆయనకు రాష్ట్రంలోని 60వేల మంది పోలీసులు రుణపడి ఉంటారని చెప్పారు. వీక్లీ ఆఫ్‌పై 21 మందితో కమిటీ వేశామన్నారు. 150 మంది ప్రతినిధులతో డీజీపీ సమావేశం నిర్వహించారన్నారు. పోలీసులందరికి రేపటి నుంచి వీక్లీ ఆఫ్ అమలు అవుందని చెప్పారు. పోలీసుల కష్టాన్ని సీఎం జగన్ గుర్తించారు గతంలో పోలీసులకు వైఎస్సార్ జూనియర్ అసిస్టెంట్ గ్రేట్ కల్పిస్తే.. నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ వీక్లీ ఆఫ్ కల్పించారని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్ ఖాన్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని పోలీసు డిపార్ట్మెంట్ కృత నిశ్చయంతో ఉందన్నారు. పోలీసు శాఖలో 19 ఫార్ములాలను నిర్ణయించారని, దాని ప్రకారం వీక్లీ ఆఫ్ వర్తింపజేస్తామన్నారు. నోడల్ ఆఫీసర్‌గా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి బాధ్యత వహిస్తారని చెప్పారు. పాదయాత్రలో తమ కష్టాలను స్వయంగా చూసిన సీఎం వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వీక్లీ ఆఫ్‌పై స్పందించడం హర్షనీయమని పోలీసు సంఘం గౌరవ అధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తమ పట్ల సానుభూతిగా వ్యవహరిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు పోలీసులందరు రుణపడి ఉంటారని తెలిపారు. -
ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రేపటి నుంచి (బుధవారం) పోలీసులకు వారాంతపు సెలవులు అమలు అవుతాయని అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోలీసు శాఖలో 30 విభాగాలు ఉన్నాయని, వాటిన అధ్యయనం చేసి 19 మోడళ్లను రూపొందించామన్నారు. ఐటీ డేష్ బోర్డ్ ద్వారా పారదర్శకంగా వీక్లీ ఆఫ్‌లను మరో నెల రోజుల్లో అమలులోని తీసుకొస్తామని చెప్పారు. వారాంతపు సెలవులపై ప్రతి నెల ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే విశాఖ, కడప జిల్లాలలో ప్రయోగాత్మకంగా వీక్లీ ఆఫ్‌లు అమలు అవుతున్నాయని, ఇబ్బందులను గమనించి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. పని ఒత్తిడి వల్ల పోలీసు శాఖలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు, మరణాలు జరుగుతున్నాయన్నారు. 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న పోలీసు సిబ్బందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తమ పరిశీలనలో లేలిందన్నారు. వీక్లీ ఆఫ్‌ల వల్ల పోలీసులకు ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. -
పోలీసులకు వీక్లీఆఫ్‌లు వచ్చేశాయ్!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులకు ఇచ్చిన వీక్లీఆఫ్ హామీ అమల్లోకి వచ్చేసింది. విశాఖ సిటీలో శనివారం నుంచి దీనికి శ్రీకారం చుట్టారు. విశాఖతోపాటు మరికొన్ని చోట్లా వీక్లీఆఫ్ అమలులోకి రాగా.. దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తెచ్చేందుకు పోలీసు శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అమలుచేసేందుకు అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే ఆయన చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఈ నెల 4న కమిటీ ఏర్పాటుచేశారు. వీక్లీఆఫ్ అమలులో వచ్చే ఇబ్బందులను ఈ కమిటీ వారం రోజులపాటు అధ్యయనం చేసింది. అనంతరం ఈ నెల 10న మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ సవాంగ్‌తో కమిటీ సమావేశమై వీక్లీఆఫ్ అమలుకు నిర్ణయించారు. ఇందుకు సిబ్బంది కొరత ఇబ్బంది కాదని కూడా తేల్చారు. దీంతో ముందుగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా శనివారం ఉత్తర్వులివ్వడంతో నగరంలోని 2,147 మంది సివిల్, 850 ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులకు వీక్లీఆఫ్ అమలులోకి వచ్చింది. వీక్లీఆఫ్ అమలు ఇలా.. - శాంతిభద్రతల విభాగంలో పనిచేసే వారిలో మార్నింగ్ షిఫ్ట్, సెక్షన్ డ్యూటీలో (రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే డ్యూటీ చేసేవాళ్లు) ప్రస్తుతం మూడ్రోజులు డ్యూటీ చేసి తర్వాత 36 గంటల పాటు విశ్రాంతి తీసుకునే వారికి అదే విధానం కొనసాగుతుంది. - జనరల్ డ్యూటీ, వారెంట్లు, బందోబస్తు విధులు నిర్వహించే వారికి విధులకు ఇబ్బంది లేకుండా సర్దుబాటుతో ఒక రోజు వీక్లీఆఫ్ ఇస్తున్నారు. - ట్రాఫిక్ విభాగంలో పనిచేసే వారిని ఏడు రోజులకు ఏడు భాగాలుగా చేసి ఒక్కో భాగానికి ఒక్కో రోజున వారాంతపు సెలవు ఇస్తున్నారు. - నేర పరిశోధన విభాగంలోను సిబ్బందికి స్టేషన్ల వారీగా ఏడు విభాగాలుగా చేసి వీక్లీఆఫ్ ఇస్తారు. - ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో గార్డు, సెక్యూరిటీ కంపెనీ విధులను నిర్వహించే వారికి పరిస్థితులకు అనుగుణంగా, సిబ్బంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీక్లీఆఫ్ ఇస్తారు. వారికి వీక్లీఆఫ్ అమలుచేస్తూనే అత్యవసర సమయాల్లో విధులకు హాజరయ్యేలా అంగీకార పత్రం తీసుకుంటారు. - పోలీసు వాహనానికి ఇద్దరేసి డ్రైవర్లు ఉన్నందున వారిలో ఒకరు విధుల్లో ఉండేలా వీక్లీఆఫ్ ఇవ్వనున్నారు. -
పోలీసులకు వీక్లీ ఆఫ్
శాంతిభద్రతల పరిరక్షణలో వారిది అలుపెరగని పోరాటం..పండుగ లేదు...పబ్బం లేదు..అనుక్షణం పని ఒత్తిడితో అల్లాడిపోతున్నవారిని పట్టించుకునే వారు లేరు. ఏ క్షణంలోఏం జరుగుతుందోనన్న టెన్షన్‌తో కత్తిమీదసాములా ఉద్యోగం చేస్తున్న వారికి ఒక దివ్యఔషధం అందనుంది. అనుక్షణం పని ఒత్తిడితో..విశ్రాంతి లేని జీవితంతో...కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపలేని పరిస్థితి.. సొంతపనులు చూసుకోవడానికి వెళ్లాలన్నా తీరికలేక అవస్థలు పడుతున్న పోలీసులకుమంచిరోజులు వచ్చాయి. పోరాటయోధుడుతీసుకున్న నిర్ణయం వారి జీవితాల్లో మార్పుతేనుంది. అంతకుముందున్న టీడీపీ, కాంగ్రెస్‌ప్రభుత్వాలు ఏళ్ల తరబడి పరిపాలించినా..వీరి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. సాక్షి కడప: చాలా ఏళ్ల తర్వాత పోలీసులకు వారంలో ఒకరోజు తనది అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వీరికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలన్న నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన త్వరలో అమలు కానుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్య తలు తీసుకున్ననాటి నుంచి పేద ప్రజల సంక్షేమం.. ఉద్యోగుల సాదక బాధకాలు..అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మధ్యాహ్న భో జన కార్మికులకు రూ. 1000 నుంచి రూ. 3000, ఆశా వర్కర్లకు గౌరవ వేతనం రూ 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. పథకాల్లో లొసుగులను ఏరిపారేస్తూ పటిష్టంగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న నూతన సీఎం వైఎస్ జగన్ ఎన్నికల హామీల అమలు కు ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగా ప్ర జా సంకల్ప పాదయాత్రలో, ఎన్నికల సభల్లో పోలీ సులకు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి వారికి వా రంలో ఒకరోజు వీక్లీ ఆఫ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయంపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో సమీక్షిం చిన సీఎం అమలుకు చర్యలు చేపడుతున్నారు. విధి విధానాలకు ప్రత్యేక కమిటీ: సీఎం వైఎస్ జగన్ పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు విధి విధానాలకు కమిటీ వేశారు. ఇందుకు సంబంధించి నివేదికలు తయారు చేసేందుకు ఉన్నతాధికారుల బృందం కసరత్తు ప్రారంభించింది.చరిత్రలో సీఎం నిర్ణయం సాహాసోపేతం: చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వీక్లీ ఆఫ్ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం సాహాసోపేతం. పోలీసు కానిస్టేబుళ్లతోపాటు అధికారులు డ్యూటీకి సంబంధం లేకుండా వారంలో ఒకరోజు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు వారంలో ఒకరోజు కేటాయించనున్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకోనున్న వీక్లీ ఆఫ్ నిర్ణయం పోలీసు కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏపీ పోలీసుల్లో పెరుగుత్ను అసహనం..!
సాక్షి, అమరావతి: పోలీసుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. విధి నిర్వహణతో పాటు రాజకీయ ప్రయోజనాలకు వారిని ఎడాపెడా వాడేస్తూ.. వారి బాగోగులను మాత్రం పట్టించుకోవడం లేదు. వారాంతపు సెలవు(వీక్లీ ఆఫ్), 8 గంటల పని విధానం(షిఫ్ట్ సిస్టమ్) వంటి కీలక ప్రతిపాదనలన్నీ పేపర్లకే పరిమితమైపోయాయి. దీంతో పోలీసుల్లో అసహనం పెరుగుతోంది. మరోవైపు ఇదే విషయమై ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులకు వీక్లీఆఫ్ ఇవ్వడంతో పాటు వారి సంక్షేమానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. దీంతో కంగారుపడిపోయిన సీఎం చంద్రబాబు హడావుడిగా హోంగార్డులకు వేతనాల పెంపు, కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించి వారితో సన్మానాలు చేయించుకున్నారు. ఇలాంటి తాత్కాలిక తాయిలాలతో ఇంకెంత కాలం మభ్యపెడతారని పోలీసులు మండిపడుతున్నారు. వీక్లీఆఫ్, షిఫ్ట్ సిస్టమ్ వంటి కీలక విషయాలను పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం అక్కడి పోలీసులకు వీక్లీఆఫ్, షిఫ్ట్ సిస్టమ్ అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో ఈ విధానం సక్సెస్ కావడంతో ఇక తెలంగాణ అంతటా అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. పొరుగు రాష్ట్రం పోలీసుల సంక్షేమానికి ఇంత ప్రాధాన్యమిస్తుంటే.. ఇక్కడ మాత్రం విధి నిర్వహణతో పాటు రాజకీయ అవసరాలకు వినియోగించుకొని తమ బాధలు పట్టించుకోవడం లేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమలుకాని నండూరి ప్రతిపాదనలు.. రాష్ట్రంలో ట్రాఫిక్ విధులు, వీఐపీ బందోబస్తు, శాంతిభద్రతల గస్తీలో నిత్యం బిజీగా ఉండే పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేసేలా గత డీజీపీ నండూరి సాంబశివరావు ప్రతిపాదనలు చేశారు. ప్రతి జిల్లాలోనూ సర్కిల్ పోలీస్స్టేషన్ల వారీగా సిబ్బంది, విధులు వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని సౌలభ్యత ఆధారంగా వీక్లీఆఫ్లివ్వాలని ప్రతిపాదించారు. ప్రకాశం జిల్లాలో 2017 జూలై నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్రమంతా అమలుచేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. 8 గంటల పని విధానమేది? పోలీసు శాఖలో రోజుకు 8 గంటల పని విధానం(షిఫ్ట్‌ల వారీగా) కూడా అమలు కావడంలేదు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రోజుకు 8 గంటల చొప్పున శెలవులు పోను ఏడాదిలో 244 రోజులు పనిచేయాల్సి ఉంది. కానీ 8 గంటల పని విధానంతో నిమిత్తం లేకుండా ఏడాదంతా ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీకి పరుగులు తీయాల్సి వస్తోంది. మెడికల్ రీయింబర్స్మెంట్ కూడా సకాలంలో ఇవ్వడంలేదని పోలీసులు వాపోతున్నారు. రాజధాని ప్రాంతానికి బందోబస్తుకు వస్తే కనీస వసతులు కూడా కల్పించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
పోలీసులకు వీక్లీ ఆఫ్!
సాక్షి, చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో జనాభాకు తగ్గట్టుగా పోలీసుల సంఖ్య లేదన్న విషయం తెలిసిందే. విశ్రాంతి లేకుండా, పని భారంతో మానసిక ఒత్తిడికి గురై విధుల్ని నిర్వర్తిస్తున్న పోలీసులు, చివరకు ఆత్మహత్యలతో మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ఇటీవల బలవన్మరణాలకు పాల్పడుతున్న పోలీసుల సంఖ్య పెరుగుతోంది. అలాగే, మరికొందరు ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడం, ఇంకొందరు తమకు ఈ ఉద్యోగాలు వద్దు బాబోయ్ అని రాజీనామాలు చేసి పరుగులు తీస్తున్నారు. విశ్రాంతి లేకుండా విధి నిర్వహణలో కుప్పుకూలుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ పరిణామాలన్నీ వెరసి వ్యవహారం మద్రాసు హైకోర్టుకు ఇటీవల చేరింది. ఇప్పటికే పోలీసుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆర్డర్లీ విధానం గురించి కేసును విచారిస్తున్న న్యాయమూర్తి కృపాకరణ్ బెంచ్ పలుమార్లు తీవ్ర ఆందోళనను, ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. పోలీసులకు అండగా నిలబడే విధంగా ఉన్నతాధికారులపై న్యాయమూర్తి తీవ్రంగానే విరుచుకు పడ్డారు కూడా. ఆర్డర్లీ విధానం రద్దు అయినా, అనేక మంది అధికారుల ఇళ్ల వద్ద నేటికీ పోలీసులు పనిచేస్తూ వస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, పోలీసులకు ఎందుకు వారంలో ఓ రోజు వీక్లీ ఆఫ్ ఇవ్వకూడదంటూ అడ్వకేట్ జనరల్ విజయనారాయణన్ను ఉద్దేశించి న్యాయమూర్తి కృపాకరణ్ స్పందించారు. వారంలో ఓ రోజు సెలవు రాజధాని నగరం చెన్నైతో పాటు పలు నగరాల్లో పనిచేస్తున్న పోలీసులకు విశ్రాంతి లేదని చెప్పవచ్చు. ఇటీవల అదనపు పని గంటలు సైతం పనిచేయక తప్పని పరిస్థితి. ఇందుకు కారణం వీఐపీల తాకిడి అధికంగా ఉండడమే. తమ వాళ్లకు సెలవన్నది లేకపోవడంపై పోలీసు కుటుంబాలు తీవ్ర ఆవేదన, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో న్యాయమూర్తి కృపాకరణ్ బెంచ్ పోలీసుకు అండగా నిలుస్తూ, వీక్లీ ఆఫ్ ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించడం విశేషం. దీనిని పోలీసుల కుటుంబాలుఆహ్వానిస్తున్నాయి.అదే సమయంలో ఇది అమల్లోకి వచ్చేనా అన్న ప్రశ్న బయలుదేరి ఉన్న నేపథ్యంలో త్వరలో వీక్లీ ఆఫ్‌లు షురూ అన్నది స్పష్టం అవుతోంది. ఆమేరకు అడ్వకేట్ జనరల్ విజనారాయణన్కు డీజీపీ రాజేంద్రన్ లేఖ పంపించారు. సోమవారం లేదా, మంగళవారం పోలీసులకు సంబంధించి న్యాయమూర్తి కృపాకరణ్ బెంచ్ ముందు ఉన్న పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆబెంచ్ ముందు వాదనల్ని ఉంచేందుకు తగ్గట్టుగా అడ్వకేట్ జనరల్‌కు వివరాల్ని డీజీపీ పంపిం ఉన్నారు. పోలీసులు అదనపు సమయం పనిచేసిన పక్షంలో వారికి అందుకు తగ్గ రూ.రెండు వందలు కేటాయించాలని వివరించారు. అలాగే, కోర్టు ముందు ఉంచాల్సిన మరికొన్ని వివరాలను అందులో పొందు పరచడమే కాకుండా, వీక్లీ ఆఫ్ ప్రస్తావనను డీజీపీ తీసుకొచ్చారు. వారంలో ఓ రోజు వీక్లీ ఆఫ్‌ను పోలీసులకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. షిఫ్ట్‌ల వారీగా ఈ వీక్లీ ఆఫ్ కేటాయింపులకు కసరత్తులు సాగుతున్నాయని, త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొని ఉన్నారు. -
రాజమహేంద్రవరంలో ప్రత్యేక సెలవులు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసులకు వీక్లీఆఫ్ అమలు చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు ఎనిమిది నెలలు గడిచినా అమలు కాలేదు. 24 గంటలు విధులు నిర్వర్తించే పోలీసులకు వారంతపు సెలవు(వీక్లీఆఫ్) ఇస్తామని గతేడాది నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో 2017 జూలై నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం రాష్ట్రమంతటా వీక్లీఆఫ్ పద్దతిని అమలు చేస్తామని ఘనంగా ప్రకటనలు చేశారు. ఈ నిర్ణయం ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుళ్లలో ఆనందోత్సహాలను నింపింది. కానీ ఎనిమిది నెలలు గడుస్తున్నా వీక్లీఆఫ్ నిర్ణయం ఆచరణకు నోచుకోకపోవడంతో పోలీస్ శాఖలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. వాస్తవంగా ప్రతీ జిల్లాలోను సర్కిల్ పోలీస్స్టేషన్ల వారీగా సిబ్బంది, విధులు వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని సౌలభ్యతను బట్టి వీక్లీఆఫ్‌లు ఇవ్వాలని ఉన్నతస్థాయి ఆదేశాలు ఇచ్చారు. అమలులో మాత్రం చిత్తశుద్ది కొరవడిందని పోలీసులు వాపోతున్నారు. ప్రకాశం జిల్లాలో అరకొరగానే.. ప్రయోగాత్మకంగా ప్రకాశం జిల్లాలో చేపట్టిన వీక్లీఆఫ్ పద్దతి అరకొరగానే అమలు జరుగుతోందని సిబ్బంది వాపోతున్నారు. అప్పట్లో ప్రకాశం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు వీక్లీఆఫ్ అమలుకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సివిల్, ఏఆర్ పోలీసులకు కూడా ఈ సౌకర్యాన్ని వర్తింపజేయాలని, ఎమర్జెన్సీ, ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయించి వీక్లీఆఫ్‌లు అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు లోబడి వారాంతపు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. రాజమహేంద్రవరంలో ప్రత్యేక సెలవులు.. వీక్లీఆఫ్ అమలు మాటెలా ఉన్నా రాజమహేంద్రవరం అర్బన్ పరి ధిలో ప్రత్యేక సెలవులు ఇస్తూ ఎస్పీ రాజకుమారి కొద్ది రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం పోలీసుల్లో ఆనందోత్సహాలు నింపుతోంది. పోలీసుల పెళ్లి రోజు, పుట్టిన రోజుల్లో వేతనం కూడిన సెలవు ఇచ్చే పద్దతిని ఈ నెల 19 నుంచి అమలు చేయాలని భావించారు. దీంతో తమ జీవితంలో ముఖ్యమైన రోజున కుటుంబంతో గడిపేందుకు అవకాశం వచ్చిందని పోలీసులు సంబరపడుతుండటం గమనార్హం. కానీ ముందుగా ఆయా పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చి సెలవులు పొందాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతానికి అరకొరగానే ఈ పద్దతి అమలు జరుగుతోంది. వీక్లీఆఫ్ కూడా ఇవ్వాలని అర్బన్ ఎస్పీ నిర్ణయం తీసుకున్నప్పటికీ అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. రాష్ట్రంలో అమలేది.. రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ఎక్కడా అమలు కావడంలేదని పలువురు పోలీసులు తమ సంఘ నేతల వద్ద వాపోతున్నారు. రాత్రిపగలు విధులు నిర్వర్తించే తమకు వారాంతపు సెలవు కూడా లేకపోతే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగులకు 32 పండుగలు, 52 ఆదివారాలు, 12 శనివారాలు, తదితర అన్ని కలుపుకొని 121 రోజులు సెలవులుగా ఇస్తుండటంతో 244రోజులు పని చేస్తున్నారని పోలీసులు లెక్కలు చెబుతున్నారు. అదే పోలీసులకు ఏడాదిలో కేవలం 20 రోజులు సెలవులు ఇస్తే 345రోజులు విధి నిర్వహణ తప్పడంలేదని వాపోతున్నారు. -
విహారయాత్ర.. ఇలా జాలీగా
ఆఫీసులో సెలవుల లిస్టు రాగానే ముందుగా... వీక్లీ ఆఫ్ కూడా కలిసొచ్చేలా సుదీర్ఘ వారాంతపు సెలవలేమైనా ఉన్నాయేమోనని మనలో చాలా మంది చకచకా లెక్కలు కడుతుంటాం. ఒకవేళ ఒకరోజో, రెండు రోజులో మధ్యలో గ్యాప్ గానీ వస్తే వీలైతే లీవ్ పెట్టుకునైనా విహారయాత్రకు వెళ్లే వీలుంటుందేమో చూసుకుంటాం. ఏడాది పొడవునా ఉండే ఆఫీసు బాదర బందీ నుంచి దూరంగా కొంత సేపైనా గడిపితే బాగుంటుందనుకుంటాం. ఇదంతా బాగానే ఉంటుంది. కానీ నిజంగానే విహారయాత్రకు బయలుదేరాలంటే... ఎదురయ్యే ఖర్చులు కళ్లముందు కదులుతాయి. రైలు, బస్సు టికెట్ మొదలుకుని హోటల్లో గదుల అద్దె, తిండీ తిప్పలు, ప్రయాణ ఖర్చులూ అన్నీ గుర్తొస్తాయి. మూణ్నాలుగు రోజుల భాగ్యానికి అప్పు చేసి మరీ ఏడాది పొడవునా కట్టుకుంటూ కూర్చోవడం అవసరమా అనిపిస్తుంది. ప్రయాణం అటకెక్కుతుంది. అయితే కొన్ని చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే.. ఇలా వెకేషన్‌ను అటకెక్కించకుండా నిశ్చింతగా తిరిగి రావొచ్చు. అదెలాగో చూద్దాం. * వెకేషన్కూ ప్రతి నెలా కొంత కేటాయింపు * ముందస్తు ప్రణాళికతో ఖర్చుల అదుపు * రాయితీల మీద దృష్టి అవసరం నిజానికి విహారయాత్రనేది వృథా ఖర్చు కాదు. ఇది ఒకరకంగా మన శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమైన పెట్టుబడి. అందుకే నెలవారీగా మిగతా ఖర్చులు, పెట్టుబడులకు జీతంలో నుంచి కేటాయింపులు జరిపినట్లే.. దీనికి కూడా కొంత కేటాయించాలి. వెకేషన్ కోసం మీ వార్షికాదాయంలో కనీసం 5 శాతం కేటాయించొచ్చు. వెసులుబాటును బట్టి 7 శాతం దాకా పక్కన పెట్టొచ్చు. అంతకు మించి మరీ 10 శాతం దాకా పెడితే.. మీ పెట్టుబడి ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. బసకి హోమ్‌స్టే లేదా ఎయిర్‌బీఎన్‌బీ.. సుదీర్ఘమైన సెలవులు గడిపేందుకు కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు హోటల్స్ కోసం వెతుక్కుంటూ కూర్చోకుండా... స్వల్ప చార్జీలకు ఆతిథ్యమిచ్చే హోమ్‌స్టే అవకాశాలు కూడా పరిశీలించవచ్చు. ప్రపంచంలో చాలా చోట్ల బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (బీఅండ్‌బీ) తరహా ఆతిథ్యమిచ్చే వారు ఉంటారు. వారాంతపు సెలవులో సైట్ సీయింగ్ లేదా ట్రెక్కింగ్ చేయదల్చుకుంటే.. ఇలాంటి హోమ్‌స్టే చౌకగాను, అనువుగాను ఉంటుంది. ఒకవేళ మీకేదైనా క్లబ్లో సభ్యత్వం ఉంటే.. మీరు వెళ్లే ప్రాంతాల్లో దానికి శాఖలు గానీ అనుబంధ ప్రాపర్టీలు గానీ ఉన్నాయేమో ఒకసారి పరిశీలిస్తే ఉపయోగ కరంగా ఉంటుంది. చాలా తక్కువ రేట్లకే స్టార్ హోటల్ సదుపాయాలు ఇలాంటి ప్రాపర్టీల్లో పొందవచ్చు. టైమ్ షేర్ లాంటివి కూడా ఉన్నప్పటికీ ముందుగా తెలియని ఖర్చులు, చార్జీలు, అవసరమైనప్పుడు గదులు దొరక్కపోవడం మొదలైన అంశాల కారణంగా వీటితో సంతృప్తి చెందిన వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఇక పర్యాటకులకు గదులు అద్దెకిచ్చే వారి కోసం ఎయిర్‌బీఎన్‌బీ లాంటి వెబ్సైట్లలోనూ వెతుక్కోవచ్చు. రేటు కూడా తక్కువగానే ఉంటుంది. ఇక ఒక్కొక్క సందర్భంలో హాలిడే రాయితీలు లభించే అవకాశాలూ ఉంటాయన్న విషయం గమనంలో ఉంచుకోవాలి. కొంత రాజీ పడటంలో తప్పు లేదు.. వెళ్లాలనుకున్న ప్రాంతం, టైమింగ్ లాంటి విషయాల్లో అవసరమైతే కొంత రాజీపడేందుకు వెనకాడనక్కర్లేదు. ఒకోసారి ఇలాంటి వాటి వల్ల ఊహించని కొంగొత్త అనుభవాలు ఎదురుకావొచ్చు. సెలవులు పేరుకుపోయిన పక్షంలో వీలైతే పనిదినాల్లో లీవ్ తీసుకుని హాలిడే వెకేషన్ గడిపేందుకు వెళ్లండి. పీక్ సీజన్ కానప్పుడు హోటళ్ళ టారిఫ్‌లు 50-75 శాతం దాకా తక్కువగా ఉంటాయి. రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి సర్వీసూ మెరుగ్గా ఉంటుంది. ఉదాహరణకు.. గోవా వెళ్లేందుకు నవంబర్ నుంచి మార్చి దాకా రద్దీ సీజన్‌గా ఉంటుంది. మన స్కూళ్లలో ఏప్రిల్, మే నెలల్లోనూ, అక్టోబర్‌లోను సెలవులుంటాయి. టూరిస్ట్ సీజన్‌తో పోలిస్తే ఆఫ్ సీజన్లో గోవాలో టారిఫ్‌లు పాతిక శాతం తక్కువగా ఉంటాయి. మళ్లీ డిసెంబర్ 20 నుంచి జనవరి 10 మధ్యలో రేట్లు ఒక్కసారిగా రెట్టింపయిపోతాయి. బీచ్ పక్కనే ఉండే 5 స్టార్ హోటల్, కాస్త కిలోమీటరు లోపల ఉండే 4 స్టార్ హోటల్లోనూ రేట్ల వ్యత్యాసం ఒకోసారి దాదాపు 50 శాతం దాకా కూడా ఉంటాయి. సీజన్లోనూ, ఆఫ్ సీజన్లోను దక్షిణ గోవాలోని రెండు హోటళ్లలో ఉన్న రేట్లను ఒకసారి పరిశీలించి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. (కింద బాక్స్ గమనించగలరు). చూశారు కదా.. ఇలా వెకేషన్కోసం ప్రతి నెలా కొంత కేటాయించి.. ప్రయాణం మొదలుకుని బస దాకా అన్ని విషయాల్లో కాస్తంత ముందస్తు ప్రణాళిక వేసుకుంటే సుదీర్ఘ వారాంతపు సెలవుల్లో విహారయాత్రలను జాలీగా గడిపేయవచ్చు. ప్రయాణానికి ముందస్తు ప్రణాళిక.. కాస్త ముందునుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే.. ప్రయాణం, బస మొదలైన ఖర్చులను కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. నా ఉదాహరణే తీసుకుంటే.. కొన్నాళ్ల క్రితం ముంబై నుంచి మలేసియాలోని కౌలాలంపూర్‌కి ఫ్లయిట్ టికెట్స్‌ను కేవలం రూ. 700.35కే (వన్ వే-పన్నులు అదనం) కొన్నాను. ఇది నా మిత్రులు చాలా మంది ఇప్పటికీ నమ్మరు. కానీ ఇది నిజం. నా దగ్గర ఇంకా ఆ టికెట్స్ ఉన్నాయి. అప్పట్లో పీక్ వెకేషన్ సీజన్‌కి దాదాపు ఆరు నెలల ముందు కంపెనీ ప్రకటించిన ప్రోమో ఫేర్ ఆఫర్లో నేనా టికెట్లు కొన్నాను. కాబట్టి కాస్త ఓపికగా వెతుక్కోగలిగి, కాస్త ముందుగా కొనుక్కోగలిగితే ఇలాంటి మంచి మంచి డీల్స్ చాలానే దొరకవచ్చు. విమాన ప్రయాణాలే కాదు... రైలు, బస్సు టికెట్లు, హోటల్ ప్యాకేజీలకు కూడా ఇది వర్తిస్తుంది. -
వీక్లీ ఆఫ్!
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గస్తీలో ఉండే పోలీసు సిబ్బందికి ఇక వీక్లీఆఫ్ వర్తింప చేస్తూ చర్యలు తీసుకున్నారు. దీంతో పుదుచ్చేరి పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసుల పాత్ర కీలకం. విమర్శలు, ఆరోపణలు ఉన్నా, పోలీసు యంత్రాంగం అన్నది లేకుంటే, పరిస్థితి ఆగమ్య గోచరమే. పోలీసులకు సెలవులు తక్కువే. నిత్యం విధుల్లో ఉంటూ ప్రజా భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులకు ప్రప్రథమంగా వారంలో ఓ రోజు సెలవు దొరికిన పక్షంలో ఆనంద తాండవమే. ఓ రోజు సెలవు దొరికితే చాలు, పోలీసుల కుటుంబాల్లోనూ ఆనందం వికసిస్తుంది. సెలవుల కోసం, పనిభారంతో అనేక చోట్ల పోలీసులు సతమతం అవుతూ వస్తుంటే, ప్రప్రథమంగా వీక్లీఆఫ్ ఇవ్వడానికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నిర్ణయించడం ఆహ్వానించదగ్గ విషయమే. వీక్లీ ఆఫ్ : మాజీ ఐపీఎస్ అధికారిణిగా పోలీసుల కష్టాల్ని కిరణ్ బేడీ ప్రత్యక్షంగా తిలకించారన్నది జగమెరిగిన సత్యం. ఐపీఎస్ అధికారిణిగా, రాజకీయ నాయకురాలిగా అవతరించి, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న కిరణ్‌బేడీ ప్రజలు, అధికారుల నుంచి మంచి మార్కుల్నే కొట్టేస్తున్నారు. ప్రజాహితం లక్ష్యంగా పుదుచ్చేరిలో దూసుకెళుతున్న కిరణ్ బేడీ, అందరి మన్ననలు అందుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తన సంస్కరణలతో అధికార వర్గాల్లో మార్పులు తీసుకొచ్చిన కిరణ్ బేడి , ప్రస్తుతం ప్రజల్లో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. పుదుచ్చేరిలో శాంతి భద్రతలు ఒకప్పుడు అధ్వానంగా ఉన్నాయి. కిరణ్ రాకతో కొంత మేరకు మెరుగు పడ్డాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసుల కష్టాల్ని గుర్తించిన ఈ లెఫ్టినెంట్ గవర్నర్ వారంలో ఓ రోజు సెలవు తీసుకునేందుకు తగ్గ చర్యలు తీసుకున్నారు. పోలీసుల సేవల్ని ప్రశంసిస్తూ పుదుచ్చేరిలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గస్తీ సిబ్బందిని ఉద్దేశించి ప్రత్యేకంగా ఆమె కొనియాడారు. డీజీపీ ఆదేశిస్తే, వారంలో ఓ రోజు గస్తీ సిబ్బందికి సెలవులు ఇచ్చేందుకు సిద్ధం అని ప్రకటించారు. గస్తీ సిబ్బంది తమ తమ ప్రాంతాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, శాంతి భద్రతల పర్యవేక్షణలో గానీయండి, నేరగాళ్ల కదలికల్ని గుర్తించడంలో గానీ వారి కృషి అభినందనీయమని వ్యాఖ్యలు చేశారు. ఇంతలో వేదిక మీదున్న డీజీపీ సునీల్‌కుమార్ గస్తీ సిబ్బంది వారంలో ఓరోజు సెలవు ఇచ్చేందుకు సిద్ధం అని, ప్రకటించడంతో అందుకు కిరణ్ బేడి ఆమోదముద్ర వేయడం విశేషం. అయితే, ఈ వీక్లీ ఆఫ్ అన్నది అందరికీ ఒకే సారిగా ఇవ్వలేం అని, కొందరికి ఓ రోజు, మరి కొందరికి మరో రోజు అన్నట్టుగా వంతుల వారీగా కొనసాగిస్తామని డీజీపీ ప్రకటించారు. ఈ వీక్లీఆఫ్ అన్నది గస్తీ సిబ్బందికి మాత్రమేనని, తదుపరి అందరికీ వర్తింపచేయడానికి తగ్గ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. -
వీక్లీఆఫ్.. ఉఫ్..
గుంటూరు క్రైం : రాత్రనక, పగలనక అహర్నిశలు ప్రజా సేవలో నిమగ్నమై విధి నిర్వహణలో తలమునకలవుతున్న పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని గతంలో పనిచేసిన ఎస్పీలు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీక్లీ ఆఫ్ అమలులోకి రావడంతో అప్పటివరకు అనేక రకాల మానసిక ఒత్తిళ్లకు గురైన సిబ్బందికి కొంతమేరకు ఊరట కలిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ విధానాన్ని కొద్దిరోజులు మాత్రమే అమలు పరిచారు. తర్వాత క్రమేపీ ఆ విధానానికి అధికారులు కొంద రు స్వస్తి పలికారు. గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బం దికి రోస్టర్ విధానంలో వీక్లీ ఆఫ్‌ను కేటాయించారు. ఈ విధానం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. అమల్లోకి వచ్చిన కొద్ది నెలలకే సిబ్బంది కొరత, తదితర సమస్యల కారణంగా వీక్లీ ఆఫ్ విధానానికి అధికారులు స్వస్తి పలికారు. రూరల్ జిల్లా పరిధిలోని కొద్ది పోలీస్ స్టేషన్లలో మాత్రమే ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ కారణంగా మళ్లీ కొద్ది నెలల నుంచి సెలవులు లేక, అధికారుల ఆదేశాలను కాదనలేక కొట్టుమిట్టాడుతూ విధులు నిర్వహించాల్సి వస్తుందని పోలీసు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం విధి నిర్వహణలో మానసిక ప్రశాంతతను కోల్పోవడంతో పాటు ,కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి రావడం తో ప్రాణాలను పణంగా పెట్టి విధు లు నిర్వహించాల్సి వస్తుంద ని, సిబ్బంది సమస్యలను గుర్తించి వీక్లీ ఆఫ్ విధానాన్ని పునరుద్ధరించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు సిబ్బంది కోరుతున్నారు. -
వీక్లీ ఆఫ్ షురూ
కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పోలీసులకు వీక్లీ ఆఫ్ అంశంపై కసరత్తు పూర్తయిందనీ, అతి త్వరలోనే పోలీసులకు వీక్లీఆఫ్‌లు ఇవ్వనున్నామని తెలంగాణ హోంమంత్రి ఆదివారం ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించడానికి వచ్చిన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈవిధంగా వెల్లడించారు. ఆదివారం కరీంనగర్లో పర్యటించిన హోంమంత్రి మహదేవ్పూర్, ముత్తారం మండల కేంద్రాల్లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేస్తూ అధునాతన సౌకర్యాలతో హైదరాబాద్‌లో కమాండెంట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు పూర్తయ్యాయన్నారు. ఆడపడుచులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, యువతులను ఏడిపించే ఆకతాయిలకు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొన్నారు. అనంతరం హోంమంత్రి కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలను నిర్వహించడానికి తమ ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తుందన్నారు. గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించి పనులను సమీక్షించారు. -
వీక్లీ ఆఫ్‌ను సద్వినియోగం చేసుకోండి
వరంగల్‌క్రైం : పోలీసు సిబ్బంది తమ కుటుంబ అభివృద్ధికై వారాంతపు సెలవులను ఉపయోగించుకోవాలని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు సిబ్బందికి సూచించారు. పోలీసులకు పని భారం తగ్గించి సిబ్బంది పనితీరును మెరుగుపరిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీ సు సిబ్బందికి ఇచ్చిన హామీ మేరకు అర్బన్ పోలీస్ విభాగంలో వారాంతపు సెలవులను ఈ నెల ఒకటో తారీఖు నుంచి అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై స్థాయి వరకు వీక్లీ ఆఫ్‌ను వినియోగించుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది సంఖ్యను దృష్టిలో పెట్టుకుని స్టేషన్ పరిధిలోని డ్యూటీలను కూడా అధికారులు దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి వారానికి ఒక రోజు సెలవు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీకి సిబ్బంది గురువారం పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పోలీసు సిబ్బందికి కూడా వారంలో ఒక రోజు సెలవును ఇవ్వడంతో తమ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎస్పీకి సిబ్బంది చెప్పారు. జిల్లా పోలీసు సిబ్బంది తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ అరవిందశర్మకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో అర్బన్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్, మహిళా హెడ్ కానిస్టేబుల్ పులి శ్రీలత, ఏఆర్ కానిస్టేబుల్ ఈ. శ్రీనివాస్, హన్మకొండ కానిస్టేబుళ్లు ఎ.నవీన్, ఇ.నరేష్ ఉన్నారు. -
వీక్లీ ఆఫ్ ప్లీజ్
శాంతి భద్రతలను సంరక్షించడంలో కీలకపాత్ర పోషించే పోలీసుల సేవలు ఎనలేనివి. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా 24గంటలు విధినిర్వహణ చేస్తుంటారు. నిత్యం ఏదో ఒకచోట సమస్యలు వస్తుండడంతో విరామం లేకుండా పని చేస్తూ.. ఒత్తిడి అధికమై అనారోగ్యం పాలవుతున్న పోలీసులు ఒక్కోసారి విధి నిర్వహణలోనే మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారంలో ఒక్కరోజు సెలవు ఇవ్వాలనే డిమాండ్ పోలీస్‌శాఖలో ఎప్పటి నుంచో ఉంది. ఇటీవలికాలంలో ఈ డిమాండ్ మరింత బలపడుతోంది. వారంలో ఒక్కరోజు సెలవు ఇస్తే ఆరోగ్యం మెరుగుపడి.. విధి నిర్వహణలో మరింత చురుగ్గా పాల్గొంటామనేది వారి వాదన. రాయవరం : రాజకీయ నాయకుల ఎస్కార్ట్, బందోబస్తు, ధర్నా, రాస్తారోకో, నిరసన ప్రదర్శన, ప్రమాదాలు ఇలా ఏ సంఘటన జరిగినా పోలీసులు తప్పనిసరిగా వెళ్లాల్సిందే. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో పోలీసులు రాత్రి పగలనక డ్యూటీ చేయాల్సిందే. వీటితో పాటు వాహనాల తనిఖీ, పెట్రోలింగ్, కేసుల విచారణ, కోర్టు కేసులకు నిందితులను తీసుకుని వెళ్లడం, ఉన్నతాధికారుల రక్షణ ఇలా పలు పనులకు కానిస్టేబుల్ స్థాయి నుంచి పనులు చేయాల్సిందే. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను సమయంతో సంబంధం లేకుండా చూడాల్సి రావడంతో పోలీసులు శారీరకంగా, మానసికంగా అలసట చెందుతున్నారు. ఇబ్బందుల్లో సిబ్బంది రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది నియామకాలు జరగడం లేదు. దీనితో ఉన్న సిబ్బందిపైనే పూర్తి భారం పడుతోంది. రోజుల తరబడి 24గంటలు విధులు నిర్వర్తించడంతో పాటు ఎంత పనిచేస్తున్నా అనుకున్న సమయానికి పదోన్నతులు రాక నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. విరామం లేకుండా విధులు నిర్వర్తించడంతో సిబ్బందిలో చాలామంది గుండెజబ్బులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. బ్రిటిష్‌కాలం నాటి మాన్యువల్ బ్రిటిష్‌కాలం నాటి పోలీస్ మాన్యువల్‌నే నేటికీ కొనసాగిస్తున్నారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మాన్యువల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని వారు అభిప్రాయ పడుతున్నారు. 1861లో బ్రిటిష్‌కాలంలో పోలీస్యాక్టును రూపొందించారు. పోలీస్ శాఖలో సంస్కరణల కోసం 1902లో ఏహెచ్ఆర్ ప్రేసర్, 1977లో మాజీ గవర్నర్ ధరమ్వీర్ నేతృత్వంలో ఏర్పడ్డ జాతీయ పోలీస్ కమిషన్, 1998లో రేబిరో, 2000లో మిలిమత్, 2005లో సోలీసొరాబ్జీ కమిటీలు పోలీస్‌శాఖలో కొన్ని సూచనలు, మార్పులు సూచించాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే అమలు చేయగా మరికొన్ని నేటికీ అమలుకు నోచుకోలేదు. 2006, 2013లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. పోలీస్ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, సేవల్లో మరింత పారదర్శకత పెంచేందుకు అనేక మార్పులు సూచించింది. మారుతున్న కాలానికి , పరిస్థితులకు అనుగుణంగా సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. 1,999 మందికో పోలీసు.. జిల్లాలో సుమారుగా 51లక్షల54వేల మంది జనాభా ఉన్నారు. వీరిలో పురుషులు 25లక్షల 69వేల 688 మంది ఉండగా, 25లక్షల 84వేల 608 స్త్రీలు ఉన్నారు. వివిధ విభాగాల్లో కలిపి సుమారు 2,578 మంది సివిల్ పోలీసులు పనిచేస్తున్నారు. అంటే సుమారుగా 1,999 మందికి ఒక పోలీస్ పనిచేస్తున్నారన్న మాట. సిబ్బంది సరిపడనంతగా లేకపోవడంతో కేసులు కూడా పెండింగ్‌లో పడిపోతున్నట్టుగా సమాచారం. పెరగాల్సిన మహిళా పోలీసులు.. మహిళల సంఖ్యకు అనుగుణంగా మహిళా పోలీసుల సంఖ్య పెరగాల్సి ఉంది. గుజరాత్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఇటీవల రాష్ర్టంలో మహిళా పోలీసుల ఎంపికలో 33 శాతం రిజర్వేషన్లు పాటిస్తామని ప్రకటించారు. అదే విధానం రాష్ట్రంలో అమలు చేస్తే బావుంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి. మహిళలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీస్స్టేషన్లలో మహిళా పోలీసుల సంఖ్య పెరగాల్సి ఉంది. కాని జిల్లాలో వివిధ స్థాయిల్లో సుమారుగా వంద మంది మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు. ఒత్తిడికి గురవుతున్న మాట వాస్తవం సమయంతో సంబంధం లేకుండా విధి నిర్వహణ చేయడం వల్ల పోలీసులు ఒత్తిడికి గురవుతున్నారు. విరామం లేకుండా డ్యూటీ చేయడంతో బీపీ, చక్కెర, గుండె సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. - జి.బ్రహ్మాజీరావు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు. వారాంతపు సెలవు ఇవ్వాలి ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల మాదిరిగానే వారాంతపు సెలవులు ఇవ్వాలి. ఈ విషయంపై ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జిల్లా నుంచి హోం మంత్రి ఉన్నందున మానవతా ధృక్పథంతో పరిశీలించాలి. - జి.బలరామమూర్తి, పోలీసు అధికారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు. సమర్థవంతంగా పనిచేస్తాం.. వారానికి ఒక రోజు సెలవు ఇవ్వడం వల్ల మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుంటుంది. సెలవుల్లేక ఒత్తిడికి గురవుతున్నందున త్వరగా అలసట చెందుతున్నాం. - ఎం.వి.రమణమూర్తి, పోలీసు అధికారుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. జిల్లాలో పోలీసుల ప్రస్థుత పరిస్థితి హోదా ఉండాల్సింది ఉన్నది అదనపు ఎస్పీలు 4 2 డీఎస్పీలు 8 6 సీఐలు 44 37 రిజర్వు ఇన్స్పెక్టర్లు 5 2 సబ్ ఇన్స్పెక్టర్లు 154 132 ఆర్.ఎస్.ఐ.లు 14 14 ఏ.ఎస్.ఐ.లు 217 125 హెడ్‌కానిస్టేబుల్స్ 515 507 సివిల్, ఆర్మ్డ్కానిస్టేబుల్స్ 2518 1954