వరంగల్‌క్రైం : పోలీసు సిబ్బంది తమ కుటుంబ అభివృద్ధికై వారాంతపు సెలవులను ఉపయోగించుకోవాలని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు సిబ్బందికి సూచించారు. పోలీసులకు పని భారం తగ్గించి సిబ్బంది పనితీరును మెరుగుపరిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీ సు సిబ్బందికి ఇచ్చిన హామీ మేరకు అర్బన్ పోలీస్ విభాగంలో వారాంతపు సెలవులను ఈ నెల ఒకటో తారీఖు నుంచి అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై స్థాయి వరకు వీక్లీ ఆఫ్‌ను వినియోగించుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది సంఖ్యను దృష్టిలో పెట్టుకుని స్టేషన్ పరిధిలోని డ్యూటీలను కూడా అధికారులు దృష్టిలో ఉంచుకొని సిబ్బందికి వారానికి ఒక రోజు సెలవు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీకి సిబ్బంది గురువారం పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పోలీసు సిబ్బందికి కూడా వారంలో ఒక రోజు సెలవును ఇవ్వడంతో తమ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎస్పీకి సిబ్బంది చెప్పారు.
జిల్లా పోలీసు సిబ్బంది తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ అరవిందశర్మకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో అర్బన్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్, మహిళా హెడ్ కానిస్టేబుల్ పులి శ్రీలత, ఏఆర్ కానిస్టేబుల్ ఈ. శ్రీనివాస్, హన్మకొండ కానిస్టేబుళ్లు ఎ.నవీన్, ఇ.నరేష్ ఉన్నారు.
వీక్లీ ఆఫ్‌ను సద్వినియోగం చేసుకోండి
Published Fri, Jul 4 2014 4:21 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement