
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రేపటి నుంచి (బుధవారం) పోలీసులకు వారాంతపు సెలవులు అమలు అవుతాయని అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోలీసు శాఖలో 30 విభాగాలు ఉన్నాయని, వాటిన అధ్యయనం చేసి 19 మోడళ్లను రూపొందించామన్నారు. ఐటీ డేష్ బోర్డ్ ద్వారా పారదర్శకంగా వీక్లీ ఆఫ్‌లను మరో నెల రోజుల్లో అమలులోని తీసుకొస్తామని చెప్పారు. వారాంతపు సెలవులపై ప్రతి నెల ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే విశాఖ, కడప జిల్లాలలో ప్రయోగాత్మకంగా వీక్లీ ఆఫ్‌లు అమలు అవుతున్నాయని, ఇబ్బందులను గమనించి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. పని ఒత్తిడి వల్ల పోలీసు శాఖలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు, మరణాలు జరుగుతున్నాయన్నారు. 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న పోలీసు సిబ్బందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తమ పరిశీలనలో లేలిందన్నారు. వీక్లీ ఆఫ్‌ల వల్ల పోలీసులకు ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.