హైదరాబాద్: తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ బ్యాంక్ ఏటీఎంలో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి యత్నించారు. ఆల్వాల్‌లోని కెనరా బ్యాంకు ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు మిషన్‌ను ధ్వంసం చేసి, డబ్బును తీసేందుకు ప్రయత్నించారు. అది విఫలం కావటంతో పరారయ్యారు. శుక్రవారం ఉదయం కొందరు వినియోగదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.