atm robbery
-
బీదర్ గ్యాంగ్ కోసం పోలీసుల వేట.. హైదరాబాద్ హై అలర్ట్
-
దొంగల ముఠా కాల్పుల కలకలం.. హైదరాబాద్ మొత్తం అలర్ట్
-
విశాఖలో ఒకే రోజు 3 ఏటీఎంలలో చోరీ
-
ఎటీఎం మెషిన్ ఎత్తుకెళ్లిన దొంగలు
-
ఏటీఎంలో రూ.18.99 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
శంషాబాద్ రూరల్: గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలో చొరబడి భారీగా నగదు దోచుకెళ్లారు. అర్థరాత్రి సమయంలో ఏటీఎంలోకి వెళ్లి సీసీ కెమెరాల్లో కనిపించకుండా వాటిపై నల్లరంగు స్ప్రే చేసి..ఆధారాలు లేకుండా తప్పించుకున్నారు. మరోచోట ఏటీఎంలోకి చొరబడేందుకు యతి్నంచి విఫలమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని పాల్మాకుల బస్టాప్ వద్ద బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఎస్బీఐ ఏటీఎం ఉంది. ఈ నెల 14న సీఎంఎస్ కంపెనీ వారు ఈ ఏటీఎంలో రూ.21 లక్షలు జమ చేశారు. ఆదివారం అర్థరాత్రి 1.59 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ముసుగు వేసుకుని వచ్చి..మొదట ఏటీంలోని సీసీ కెమెరాలపై నల్లరంగు స్ప్రే చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను కట్‌చేసి అందులో ఉన్న నగదు రూ.18,99,000 దోచుకున్నారు. పోలీసులకు సమాచారం.. ఏటీఎంలో దుండగులు గ్యాస్ కట్టర్‌తో కట్ చేస్తుండగా..చివరి సమయంలో అక్కడ ఉన్న సేఫ్టీ పరికరాల ద్వారా ముంబయిలోని నిర్వహణ సంస్థకు అలర్ట్ వెళ్లింది. దీంతో సంస్థ ప్రతినిధులు సుమారు 20 నిమిషాల తర్వాత శంషాబాద్ ఎస్హెచ్ఓకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లే సరికి దుండగులు నగదుతో పారిపోయారు. ఏటీఎంలోకి చొరబడిన దుండగులు షటర్‌ను మూసివేసి లోపల పని కానిచ్చారు. దీంతో అటువైపు పెద్దగా ఎవరి దృష్టి పడలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే వరకు స్థానికులకు సమాచారం లేదు. ఏటీఎం కేంద్రాన్ని డీసీపీ నారాయణరెడ్డి, సీఐ నరేందర్‌రెడ్డి పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ పట్టణంలో.. శంషాబాద్ పట్టణంలో ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఏటీఏంలోనూ చోరీకి దుండగులు యతి్నంచి విఫలమయ్యారు. ఇక్కడ ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో నగదు దోచుకునేందుకు దొంగలు ప్రయతి్నంచినట్లు పోలీసులు గుర్తించారు. కానీ ఎలాంటి నగదు చోరీకి గురికాలేదు. -
ఏటీఎంలో రూ.14 లక్షలు చోరీ.. సీసీ కెమెరాలకు రంగేసి
సాక్షి, నల్గొండ: నీలగిరిలో దుండగులు తెగబడ్డారు. గుర్తు తెలియకుండా సీసీ కెమెరాలకు నల్ల రంగు వేసి.. ఏటీఎం(ఆటోమెటిక్ టెల్లర్ మిషన్)ను గ్యాస్ కట్టర్‌తో తెరిచి సుమారు రూ.14లక్షల నగదును అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ పట్టణం మిర్యాలగూడ రోడ్డు బీటీఎస్ ప్రాంతంలో గల ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోని శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు చొరబడ్డారు. అయితే, దుండగులు సీసీ కెమెరాలకు చిక్కకుండా ముందు జాగ్రత్తగా ఏటీఎం వెలుపల, లోపల ఉన్న మొత్తం నాలుగింటికి నల్లరంగు వేశారు. అనంతరం గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం తెరిచి నగదును అపహరించుకుపోయినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అంతర్ రాష్ట్ర ముఠా పనేనా ? జిల్లా కేంద్రంలో రద్దీగా ఉండే మిర్యాలగూడ రోడ్డులోని ఏటీఎంలో దుండగులు చోరీకి పాల్పడడం పోలీసులను కలవరపాటుకు గురిచేస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు కొత్త ఏటీఎంను వదిలేసి పాత ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో తెరిచి చోరీకి పాల్పడిన తీరు అంతర్రాష్ట్ర ముఠా పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీఎంను తెరిచే ప్రయత్నం చేస్తే వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులతో పాటు పోలీసులను అప్రమత్తం చేసే పరిజ్ఞానం ఉంటుందని, అది తెలిసే దుండగులు పాత ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. ఆధారాల సేకరణ తెల్లవారుజామున బీటీఎస్ ప్రాంతంలో వాకింగ్‌కు వచ్చిన వారు గమనించడంతో ఏటీఎంలో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం మేరకు వన్ టౌన్ సీఐ గోపి, టూటౌన్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి చోరీ జరిగిన ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి దుండగులు వేలిముద్రలు, పాదముద్రలు, తల వెంట్రుకలు తదితర కీలక ఆధారాలు సేకరించారు. అయితే, చోరీ ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 5గంటల మధ్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు సమీప ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: రోడ్డు మార్గంలో భద్రాచలానికి రాష్ట్రపతి.. ముర్ము ప్రయాణించేది ఈ కారులోనే -
గర్ల్‌ఫ్రెండ్ కోసం ఏటీఎం చోరీకి యత్నం.. కటకటాలపాలైన యువకుడు
సాక్షి,న్యూఢిల్లీ: ఏటీఎం నుంచి డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం 2:15గంటల సమయంలో వీరు ఏటీఎంకు గ్యాస్ కట్టర్ సాయంతో కన్నం వేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి నిందితులు పారిపోయారని, గ్యాస్ కట్టర్, సిలిండర్ అక్కడే వదిలి వెళ్లారని వివరించారు. ఆ తర్వాత సీసీటీవీ ఫూటేజీ పరిశీలించి ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను రాజస్థాన్ దౌసా జిల్లాకు చెందిన కమల్(27), ప్రవీణ్(20)గా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఏటీఎం చోరీకి సూత్రధారి తానే అని కమల్ విచారణలో అంగీకరించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేసేందుకు డబ్బు కావాలని, అందుకే తన కజిన్ ప్రవీణ్‌తో కలిసి చోరీకి పథకం పన్నినట్లు కమల్ చెప్పాడని తెలిపారు. చదవండి: యూట్యూబ్‌లో చూసి వైన్ తయారీ.. స్నేహితుడికి తాగించడంతో.. -
గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంలు తెరిచి.. రూ.65 లక్షలు ఊడ్చేశాడు
డోన్ టౌన్: కర్నూలు జిల్లా డోన్ పట్టణ నడిబొడ్డున గల ఏటీఎం సెంటర్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ దొంగ భారీ చోరీకి పాల్పడ్డాడు. అక్కడ ఉన్న రెండు ఏటీఎం మెషిన్లను గ్యాస్ కట్టర్ సహాయంతో తెరిచి రూ.65,44,900ను అపహరించుకుపోయాడు. స్థానిక శారద కాన్వెంట్ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎం కేంద్రానికి రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న రెండు మెషిన్లలో శుక్రవారం బ్యాంక్ అధికారులు రూ.80 లక్షల నగదు ఉంచారు. ఆదివారం రాత్రి వరకు రూ.14,55,100 నగదును వినియోగదారులు విత్ డ్రా చేసుకోగా.. మిగిలిన రూ.65,44,900ను దుండగుడు అపహరించాడు. మంకీ క్యాప్ ధరించి.. ఆపై టోపీ పెట్టాడు ఆదివారం రాత్రి 2.50 గంటల సమయంలో మంకీ క్యాప్, దానిపై మరో టోపీ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం కేంద్రం ముందు బయట వైపున ఉన్న సీసీ కెమెరా ధ్వంసం చేసి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేశాడు. తన వెంట తెచ్చుకున్న చిన్న గ్యాస్ కట్టర్, ఐరన్ రాడ్డు, వాటర్ బాటిల్ సాయంతో రెండు ఏటీఎంలను లాఘవంగా తెరిచాడు. గ్యాస్ కట్టర్ వినియోగించే సమయంలో నోట్లు కాలిపోకుండా నీళ్లు పోస్తూ పని ముగించినట్టు లోపల ఉన్న మరో సీసీ కెమెరాలో రికార్డయింది. సోమవారం ఉదయం ఏటీఎం కేంద్రం బయట సీసీ కెమెరా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చోరీ విషయం వెలుగు చూసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వర్షం పడటంతో ఆ దారిలో ఎవరూ వెళ్లకపోవడం కూడా ఆగంతకుడికి అనుకూలించింది. సీఐ మల్లికార్జున, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా క్రైం విభాగపు డీఎస్పీ శ్రీనివాస్ ఏటీఎం కేంద్రానికి చేరుకుని పరిశీలించారు. కర్నూలు నుంచి డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించారు. బ్యాంక్ అకౌంట్స్ డిప్యూటీ మేనేజర్ బి.ప్రాన్సిస్ రుబిరో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన వ్యక్తి పాత నేరస్తుడా లేక ఏటీఎం మెషిన్ల తయారీ, మెకానిజంలో నైపుణ్యం గల వ్యక్తా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. దొంగను గుర్తించేందుకు పట్టణంలో అన్నివైపులా గల సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
పోలీసుల కళ్లెదుటే వ్యక్తి గుండెల్లో పొడిచి..
సాక్షి, చెన్నై: ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన నలుగురు యువకులు పోలీసుల కళ్లెదుటే ఓ వ్యక్తిని గుండెల్లో పొడిచి చంపేశారు. శనివారం వేకువజామున తిరువారూర్–తిరుత్తురై పూండి మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి కూడూరు గ్రామంలో ఓ జాతీయ బ్యాంక్ ఏటీఎం ఉంది. శుక్రవారం అర్ధరాత్రి నలుగురు యువకులు ఏటీఎంలో చోరికి సిద్ధం అయ్యారు. అదే సమయంలో ఆ ఏటీఎంకు ఎదురుగా ఉంటున్న మదన్ అనే వ్యక్తి దీనిని పసిగట్టాడు. ఏటీఎం గదికి యజమాని అయిన తమిళరసన్, పోలీసులకు సమాచారం అందించాడు. తమిళరసన్ ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశాడు. ఏటీఎం వద్ద జనం చేరడంతో ఆ నలుగురు యువకులు మేల్కొన్నారు. తప్పించుకునే యత్నం చేశారు. ఇందులో ఓ యువకుడు పోలీసులకు చిక్కాడు. మెరుపు దాడి తప్పించుకుని వెళ్లిన ముగ్గురు యువకులు కాసేపటి తర్వాత హఠాత్తుగా మెరుపు దాడి చేశారు. గస్తీలో ఉన్న ఇద్దరు పోలీసుల వైపుగా ఆయుధాలతో దూసుకొచ్చారు. తమను అడ్డుకునే ప్రయత్నం చేసిన తమిళరసన్‌ను పొడిచి చంపేశారు. తమ సహచరుడిని విడిపించుకుని వెళ్లారు. దీంతో తిరువారూర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కుర్తానల్లూరులో దాగి ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్కు ఒక యువకుడి కుడి కాలు, మరో యువకుడి ఎడమ కాలు, మిగిలిన ఇద్దరికి చేయి విరిగింది. వీరిని ఆస్పత్రికి తరలించి పిండి కట్టు వేశారు. నలుగురు యువకులు ఓ కళాశాలలో చదువుకుంటున్నట్టు విచారణలో తేలింది. మోటారు సైకిళ్లను చోరీ చేయడం, దారి దోపిడీలకు పాల్పడడం చేస్తున్నట్లు విచారణలో తేలింది. -
కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని.. చివరికి జైలు పాలయ్యారు
హైదరాబాద్: ఇటీవల నగరంలో కూకట్ పల్లి ఏటీఏం సెంటర్ వద్ద కాల్పులు జరిపిన ఏ1, ఏ2 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సైబరాబాద్ సీపీ వారిని మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ‘‘ పొట్టకూటి కోసం బీహార్‌కు చెందిన ఏ1 నిందితుడు అజిత్ కుమార్, ఏ2 నిందితుడు ముఖేష్ కుమార్‌లు 2011లో నగరానికి వచ్చారు. నగరంలోని దుండిగల్ ప్రాంతంలో ప్యాకేజీ అండ్ ఇండస్ట్రీలో కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలు పని చేసిన వీళ్లిద్దరు జల్సాలకు అలవాటు పడ్డారు. తొలిసారి ఏ1 నిందితుడు అజిత్ కుమార్ దుండిగల్‌లోని ఓ ఏటీఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తూ జైలు పాలయ్యాడు. విడుదల అనంతరం నేరాల్ని తన వృత్తిగా ఎంచుకున్నాడు. అడ్డదార్లలో డబ్బులు సంపాదించి జల్సాలు చేసేవాడు. దొంగతనాలు చేస్తూ పోలీసుల కన్నుగప్పి తప్పించుకునేవాడు. చిన్నాచితకా దొంగతనాలు చేయగా వచ్చే డబ్బులు సరిపోవడం లేదని ఈ సారి ఏకంగా ఏటీఎంలలో డబ్బులు నింపే వాహనాల్ని టార్గెట్ చేశాడు. అందుకు ముఖేష్ కుమార్ సపోర్ట్ తీసుకున్నాడు. బీహార్ నుంచి ముఖేష్‌తో నాటు తుపాకి తెప్పించుకుని ఏప్రిల్ 29న కూకట్ పల్లి ఏటీఎం చోరీకి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్ 29న కూకట్ పల్లి ఏటీఎం సెంటర్ చోరీకి పాల్పడ్డారు నిందితులు. ఏటీఎం నుంచి డబ్బుల్ని దొంగిలించేందుకు ఏటీఎం సెంటర్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ అలీ బేగ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ఏటీఎం డోర్లపై థంబ్ ప్రింట్స్ ఆధారంగా పాతనేరస్తులపై కన్నేశారు. అయితే కూకట్ పల్లి ఏటీఎం దొంగతనంలో పాల్గొన్న నిందితుల చేతిగుర్తులు.. గతంలో దొంగతనాలకు పాల్పడ్డ నిందితుల చేతి గుర్తులు ఒకేలా ఉండడంతో అజిత్ కుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో నిందితులు గుండపోచంపల్లి ప్రాంతానికి చెందిన ఓ గదిలో తలదాచుకున్నారన్న సమాచారంతో దాడులు చేసిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులు కలిసి సైబరాబాద్ లిమిట్స్‌లో ఐదు నేరాలు చేశారు. వారి వద్ద నుండి రూ. 6,31,000/- నగదు, ఒక పిస్తోల్, ఒక మ్యాగజైన్, పల్సర్ బైక్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఏటీఎం సెక్యూరిటీగా పెద్ద వయస్సు ఉన్నవారు విధులు నిర్వహించడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై ఆర్బీఐతో మాట్లాడుతున్నాం. సెక్యూరిటీల వద్ద యువకులు విధులు నిర్వహిస్తే ఇలాంటి దారుణాలు జరగవు’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
సీసీటీవీ కెమెరాకు ముసుగు కప్పి మరీ..!
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండలో దొంగ హల్చల్ చేశాడు. పెనుకొండలో ఉన్న యాక్సెస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశాడు. మొదట ముఖానికి ముసుగు తొడుక్కొని వచ్చిన దొంగ ఏటీఎంలోకి ప్రవేశించి.. ఏటీఎం మెషిన్ ఎక్కి మరీ.. అక్కడ ఉన్న సీసీటీటీ కెమెరాకు ముసుగు కప్పేశాడు. ఆ తర్వాత ఏటీఎం మెషిన్ నుంచి డబ్బు దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం ఏకంగా గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేశాడు. అయినా, ఏటీఎం క్యాష్ బాక్స్ తెరుచుకోలేదు. దీనికితోడు గ్యాస్ కట్టర్ల కారణంగా ఏటీఎం మెషిన్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో భయభ్రాంతులకు గురైన దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఏటీఎంలోని డబ్బులు భద్రంగా ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
టాటా ఇండి క్యాష్ ఏటీఎంలో చోరీ
సాక్షి, నల్గొండ: నిత్యం రద్దీగా ఉండే విజయవాడ-హైదరాబాద్ రహదారి పక్కనే ఉన్న ఇండి క్యాష్ ఏటీఎంలో గురువారం అర్ధరాత్రి ఆగంతకులు చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మిషన్ ని కట్ చేసి డబ్బులు అపహరించుకుపోయారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు జాతీయ రహదారి పక్కనే చోటు చేసుకున్న ఈ ఘటనలో షట్టర్ కిందికి లాగి.. సిసి పుటేజ్ కెమెరా వైర్లను కట్ చేసి చోరీకి పాల్పడ్డారు.కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్,క్లూస్ టీం తో విచారణ చేపట్టారు.ఎంత డబ్బు పోయిందనే విషయం పై బ్యాంక్ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఏటీఎం వద్ద సెక్యూరిటీ లేకపోవడం తో తెలిసిన వ్యక్తులే పక్కా ప్లాన్ తో చోరీ కి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. -
దోచుకుంది 58 లక్షలు.. రీకవరి 4 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో ఏటీఎం నుంచి రూ. 58 లక్షలను దొంగిలించి, ఆటోలో పరారైన కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ దోపిడీని చేసింది తమిళనాడుకు చెందిన రాంజీ గ్యాంగ్ అని పోలీసులు తేల్చారు. ఈ కేసులో నలుగురుని అరెస్ట్ చేసి.. వారి నుంచి మొత్తం రూ. నాలుగు లక్షలు రికవరీ చేశారు. మే 7న వనస్థలిపురం పనామా దగ్గర యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన మనీ లోడింగ్ సిబ్బంది దృష్టి మరల్చి కొందరు దుండగులు రూ. 58 లక్షలను ఎత్తుకొని ఆటోలో పరారయ్యారు. కేసును సవాల్‌గా తీసుకొన్న రాచకొండ కమిషనర్, ఎల్బీ నగర్ పోలీసులు మూడు నెలలుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో వాటి ఆధారంగానే ఈ కేసును చేధించినట్టు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, కొన్ని టెక్నీకల్ ఎవిడెన్స్‌ను బట్టి ఈ చోరీలో దీపక్, సత్యరాజు పేర్లు బయటకి రావడంతో నిందితులను గుర్తించామని గ్యాంగ్‌కు సంబంధించిన వివరాలను సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. అంతేకాక రాంజీ నగర్ గ్యాంగ్ సభ్యుడు దీపక్ అలియాస్ దీపు ముఠాని పట్టుకున్నామని, నిందితుల నుంచి మొత్తం 4 లక్షలు నగదు, కారు, 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ఏటీఎం చోరీ కేసులో మొత్తం 14 మంది నిందితులు ఉన్నారని చెప్పారు. అందులో 11 మంది తమిళనాడుకి చెందిన వారు కాగా, ముగ్గురిది పశ్చిమ బెంగాల్ అని, దొంగిలించిన తర్వాత దుండగులు అక్కడ నుంచి ట్రైన్లో తమిళనాడులోని వారి స్వస్థలాలకు వెళ్లారని తెలిపారు. వీరందరిది రాంజీ నగర్ అని, ఈ ఊరిలో చాలామంది ఇలాంటి నేరాలు చేస్తున్నట్లు విచారణలో తేలిందని సీపీ వివరించారు. చెడ్డి గ్యాంగ్ తరహాలోనే రాంజీ గ్యాంగ్ కూడా దృష్టి మరల్చి చోరీలు చేస్తారని, ఇలాంటి గ్యాంగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. గతంలో ఓ కేసులో ఇన్ఫార్మర్ అనే నేపంతో ఓ వ్యక్తిని ఈ గ్యాంగ్ హత్య చేసిందని తెలిపారు. రాంజీ గ్యాంగ్ ప్రతి ఏడాది ఓ రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకుంటారని వ్యాఖ్యానించారు. పక్కా ప్లాన్ ప్రకారం, చార్ట్ గీసుకొని దోపిడీలు చేస్తారని గ్యాంగ్ వివరాలను వెల్లడించారు. -
ఏటీఎం చోరీ కేసులో పురోగతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో సంచలనం సృష్టించిన ఏటీఎం మాయం కేసులో పురోగతి లభించింది. ఎచ్చెర్ల పోలీసు క్వార్టర్స్ ఆవరణలో గత నెల 5న ఎస్బీఐ ఏటీఎం రూ. 8,23,900తో ఎత్తుకుపోయిన విషయం విదితమే. ఇది పోలీసుల వైఫల్యంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత పెద్ద స్థాయిలో చోరీకి పాల్పడిన తీరును బట్టి అంతర్రాష్ట్ర ముఠాగానే మొదట్నుంచి భావించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి వెల్లడించారు. వివరాలు ఇలా... ఏఎస్పీ గంగరాజు, డీఎస్పీలు సత్యనారాయణ, చక్రవర్తిల పర్యవేక్షణలో జేఆర్‌పురం సీఐ మల్లేశ్వరరావు, ఎచ్చెర్ల ఎస్సై జీ రాజేష్ కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనకు ముందు నిందితులు రెక్కీ నిర్వహించారు. చోరీకి పాల్పడుతున్న సమయంలో ఏటీఎం కేంద్రంలో సీసీ కెమెరాకు ప్లాస్టర్ అంటించారు. ఈ ప్లాస్టర్ అంటించే ముందు ఓ నిందితుని చిత్రం సీసీఫుటేజీలో నమోదు అయ్యింది. దీన్ని ఆధారంగా చేసుకుని టోల్‌గేట్‌ల్లో సీసీఫుటేజీలను పరిశీలించారు. రెండు చోట్ల ఏటీఎంలో కనిపించే నిందితుని చిత్రంతో సరిపోలడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు పలాస సమీపంలో నిందితుడు వెళ్తున్న వాహనాన్ని తనిఖీలు చేపట్టగా గుర్తించారు. తరువాత వాహన రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందినవారుగా తేలింది. వీరు దొంగిలించిన మొత్తం ఖర్చుకాగానే మరలా చోరీలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో చోరీకి పాల్పడిన వారిలో నిందితుల్లో ఒకరైన సమయుద్దీన్ నరసన్నపేట టోల్గేట్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు ఆదుపులోకి తీసుకుని ప్రశ్నంచారు. దీంతో నేరాన్ని అంగీకరించాడు. ఇటువంటి చోరీలకు పాల్పడటంలో ఫకృద్దీన్ అనే మరో నిందితుడు ఆరితేరాడని, ఇతను మరికొందరిని మచ్చిక చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు వివరించాడు. ఫకృద్దీన్‌తోపాటు నజీర్, నయామత్, ముల్లీ, షేఖుల్, సద్దాన్ పరారీలో ఉన్నారు. వీరిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని, ప్రస్తుతం అరెస్ట్ అయిన వ్యక్తి నుంచి రూ. లక్షతోపాటు సెల్‌ఫోన్, మారుతీ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. పోలీసులకు రివార్డులు కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు ఎస్పీ రివార్డులను ప్రకటించారు. ఈ మేరకు జేఆర్‌పురం సీఐ మల్లేశ్వరరావు, ఎచ్చెర్ల ఎస్సై రాజేష్, ఏఎస్సై కృష్ణ, హెచ్‌సీ రమణ, కానిస్టేబుళ్లు భాస్కరరావు, మహామ్మద్‌బషీర్, లక్ష్మణ, రవికుమార్, సూర్యనారాయణలకు రివార్డులు అందజేశారు. -
ఏటీఎంల ఇన్ఛార్జే దొంగ..
నేరేడ్మెట్ : కోటక్ మహేంద్ర బ్యాంకు ఏటీఎం లూటీ కేసులో సీసీ కెమెరా ‘ఇంటి దొంగ’ను పట్టించింది. కుషాయిగూడ పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుషాయిగూడ ఏసీపీ కష్ణమూర్తితో కలిసి మల్కాజిగిరి డీసీపీ సీహెచ్.ఉమామహేశ్వర శర్మ కేసు వివరాలు వెల్లడించారు. జనగాం జిల్లాకు చెందిన తూడి విఘ్నేష్(28) 15ఏళ్లుగా కీసర మండలం నాగారంలో నివసిస్తున్నాడు. ఐదేళ్లుగా కోటక్ మహేంద్ర గ్రూప్‌లో మల్కాజిగిరి రూట్లో క్యాష్ కస్టోడియన్‌తో పాటు రూట్ ఇన్చార్జిగా పని చేస్తున్నాడు. ఇటీవల విఘ్నేష్‌కు కుషాయిగూడ–ఈసీఐఎల్ రూట్ కోటక్ మహేంద్ర బ్యాంకు ఏటీఎంల ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. తన సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదనే అసంతృప్తితో ఉన్న విఘ్నేష్.. విలాసవంతంగా బతకాలని భావించాడు. ఇందుకు ఏటీఎంలో నగదు చోరీ చేయాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా ఈ నెల 9న కుషాయిగూడ ఠాణా పరిధిలోని కమలానగర్ (ఈసీఐఎల్ ప్రధాన రోడ్డు)లోని ఏటీఎంకు వెళ్లాడు. ఏటీఎం తాళాన్ని పగులకొట్టి, అందులోని సుమారు రూ.3,54,500 నగదును దోచుకెళ్లాడు. ఇంటికెళ్లి ఒక బ్యాగ్‌లో డబ్బును దాచిపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా విధులకు హాజరయ్యాడు. ఏటీఎంలో నగదు రావడం లేదని బ్యాంకు అధికారులకు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయమై అధికారులు ఏటీఎంను సందర్శించగా చోరీ జరిగినట్టు తేలింది. ఈ నెల 11న అధికారులు కుషాయిగూడ పోలీసులకు చోరీ విషయమై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏటీఎం కేంద్రం వద్ద సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా ఏటీఎం నుంచి నగదు చోరీ చేసింది క్యాష్ కస్టోడియన్ విఘ్నేష్‌గా తేలింది. బుధవారం నిందితుడిని అరెస్టు చేసి, ఇంట్లో దాచిపెట్టిన రూ.3,54,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో కుషాయిగూడ డీఐ రాములు, సీఐచంద్రశేఖర్ పాల్గొన్నారు. -
నగదు విత్‌డ్రా కోసం వచ్చి, ఏకంగా ఏటీఎంనే..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సోమాజీగూడ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో విచిత్ర సంఘటన జరిగింది. నగదు విత్‌డ్రా కోసం వచ్చిన వ్యక్తి ఎవరూ లేరు అనుకొని ఏకంగా ఏటీఎం చోరీ చేయడానికి యత్నించాడు. అయితే సెక్యూరిటీ అలారం మోగడంతో దుండగుడు వెనక్కి తగ్గాడు. నగదు డ్రా చేసుకొని వెళ్లిపోయాడు. ఈ దృష్యాలన్నీ సీసీ కెమరాలో నమోదయ్యాయి. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
అడ్డంగా దొరికిన మహిళ
-
ఏటీఎంలో చోరీకి యత్నం.. అడ్డంగా దొరికిన మహిళ
సాక్షి, విజయవాడ: ఆదివారం, ఏటీఎం ఖాళీగా ఉంది, అదే అదునుగా ఓమహిళ అక్కడికు వచ్చింది. తను తెచ్చుకున్న వస్తువులతో ఏటీఎంలో చోరీకి ప్రయత్నించింది. ఆసమయానికి స్థానికులు రావడంతో అడ్డంగా దొరికిపోయింది. వివరాల్లోకి వెళ్తే నగరంలోని బందరు రోడ్డులో గేట్‌వే హోటల్ ఎదురుగా ఉన్న హెచ్డీఎఫ్సి బ్యాంక్ లో చోరీకి యత్నించిన మహిళను స్థానికులు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి జనసంచారంలేని సమయంలో గుర్తుతెలియని మహిళ ఏటీఎంలోకి ప్రవేశించి చేతికి గ్లౌజ్‌లు తొడుక్కుని చోరీకి యత్నించింది. తన బ్యాగ్‌లో తెచ్చుకున్న కటింగ్ ప్లేయర్లతో ఏటీఎంలోని విద్యుత్ వైర్లను కత్తిరించింది. అదే సమయానికి నగదు విత్ డ్రా కోసం ఏటీఎంకు వచ్చిన వ్యక్తులు ఆ మహిళను పట్డుకున్నారు. ఆమె తెచ్చుకున్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా యాసిడ్ బాటిల్, కటింగ్ ప్లేయర్, కట్టర్, స్ర్కూడ్రైవర్ వంటి పరికరాలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు ఆమెను పోలీసులకు అప్పగించారు. కాగా పోలీసులు మహిళను రామవరప్పాడువాసిగా భావిస్తున్నారు. -
కేరళలో ‘ఏటీఎం’ హైటెక్ చోరీ !
తిరువనంతపురం: వినియోగదారులకు తెలియకుండానే వారి ఖాతాల నుంచి కొన్ని వేల రూపాయల నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం ద్వారా కొట్టేసినట్లు భావిస్తోన్న ఘటన కేరళ లో జరిగింది. తిరువనంతపురంలో వెల్లాయాంబాలమ్లో ఉన్న ఓ ప్రభుత్వ బ్యాంకు ఏటీఎంను 16 మంది వినియోగించుకున్నారు. సోమవారం తమ మొబైల్‌కు వచ్చిన సందేశాలు చూసుకుని వారు షాక్‌కు గురయ్యారు. తాము ఉపసంహరించుకున్న మొత్తం కన్నా అధికంగా నగదు బయటకు వెళ్లినట్లు వాటిలో ఉంది. వెంటనే బాధితులు బ్యాంకు మేనేజర్, పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఏటీఎం కేంద్రంలో రహస్యంగా ఉంచిన ఎలక్ట్రానిక్ పరికరాలతో వినియోగదారుల కార్డు నెంబర్, పిన్‌లను పసిగట్టి నేరగాళ్లు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఏటీఎం నుంచి పోలీసులు ఓ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఏటీఎంలో చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్ట్
ఝరాసంగంరూరల్ : మెదక్ జిల్లా ఝరాసంగంలోని సిండికేట్ బ్యాంకు ఏటిఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ రూరల్ సిఐ రఘు తెలిపారు. సోమవారం ఝరాసంగం ఠాణాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బర్దీపూర్ గ్రామంలో ఈ నేల 6 వ తేదిన సాయంత్రం గ్రామానికి చెందిన బండమిది మహేష్ ఎవరు లేని సమయంలో సిండికేట్ బ్యాంకు ఏటిఎంలోకి చోరబడి అక్కడి సీసీ కెమెరాను ధ్వంసం చేసి ఏటీఎం నుంచి నగదు దొంగలించేందుకు విఫలయత్నం చేశాడు. చోరీ యత్నం గమనించిన సిండికేట్ బ్రాంచి అసిస్టెంట్ మేనేజర్ పాండరినాథ్ 7వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. సీసీ కెమెరాలో ఉన్న చిత్రాల ఆధారంగా బండమిది మహెష్ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు. -
ఏటీఎం చోరికి యత్నం
హైదరాబాద్: తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ బ్యాంక్ ఏటీఎంలో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి యత్నించారు. ఆల్వాల్‌లోని కెనరా బ్యాంకు ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు మిషన్‌ను ధ్వంసం చేసి, డబ్బును తీసేందుకు ప్రయత్నించారు. అది విఫలం కావటంతో పరారయ్యారు. శుక్రవారం ఉదయం కొందరు వినియోగదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. -
4 ఏటీఎంలలో భారీ చోరీ
-
4 ఏటీఎంలలో భారీ చోరీ
లింగంపేట: నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలంలో ఏటీఎం దొంగల ముఠా కలకలం సృష్టిస్తోంది. మంగళవారం తెల్లవారుజాము సమయాల్లో నిజామాబాద్‌లో 4 ఏటీఎంలపై దొంగల ముఠా విజృభించింది. సుమారు 43 లక్షల రూపాయల వరకు చోరీ జరిగినట్లు తెలుస్తోంది. అదే విధంగా బుధవారం వేకువజామున మెదక్ ఆటోనగర్‌లోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను తెరిచేందుకు దుండగులు యత్నించగా ఏటీఎం నుంచి మంటలు చెలరేగాయి. దీంతో దొంగల ముఠా పరారయింది. బొలెరో వాహనంలో పారిపోతున్న దొంగలను పోలీసులు వెంబడించారు. అనంతరం లింగంపేట పోలీసులకు సమాచారం అందించారు. నాగిరెడ్డి పేట ఎస్సై దొంగల ముఠాను వెంబడించగా తప్పించుకున్నారు. దీంతో ఆయన మాకు ఫోన్ చేసి సమాచారం అందించారని నిజామాబాద్ జిల్లా లింగంపేట ఎస్సై రమేష్ రమేష్ తెలిపారు. అప్రమత్తమైన ఆయన లింగంపేట మండలం మెంగారం వద్ద రోడ్డుకు అడ్డంగా వాహనాన్ని ఉంచగా దుండగులు తమ వాహనంలో వేగంగా వెళుతూ తప్పించుకోవడానికి యత్నించారు. దీంతో ఎస్సై రమేష్ నిందితులపై కాల్పులు జరిపారు. కానీ, నిందితులు చాకచక్యంగా పరారయ్యారు.పెట్రోలింగ్ పోలీసులు ఏటీఎం వద్దకు చేరుకుని చూడగా అప్పటికే దాదాపు రూ.10లక్షల విలువైన నోట్లు కాలి బూడిదయ్యాయి. అప్పటికే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఏటీఎంలో ఇంకా రూ.10 లక్షలు భద్రంగా ఉన్నట్లు సమాచారం. అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని, మహారాష్ట్రకు చెందిన ముఠా ఈ దొంగతనానికి పాల్పడి ఉంటుందని ఎస్సై రమేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయా బ్యాంకు మేనేజర్ల ఫిర్యాదు మేరకు వర్నీ, కోటగిరి ఎస్సైలు కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. -
ఫిర్యాదుదారుడే ప్రధాన నిందితుడు..
కాకినాడ(తూర్పుగోదావరి) : రావులపాలెంలోని ఓ ఏటీఎమ్ లో చోరికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏమంటే.. ఫిర్యాదుచేసిన వ్యక్తే చోరీకి పాల్పడటం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం.. ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి రావులపాలెంలోని ఓ ఏటీఎమ్ కేంద్రంలో చోరీకి పాల్పడ్డాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో చోరీ విషయంపై ఫిర్యాదు చేశాడు. అయితే, ఫిర్యాదుదారుడిపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. చోరీకి పాల్పడ్డట్లు ప్రదీప్ కుమార్ అంగీకరించాడు. ఇందులో ప్రమేయమున్న మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.31.73 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏటీఎంలో నగదు చోరీకి యత్నం
నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో గత అర్థరాత్రి ఏటీఎంలో నగదు చోరీకి ఇద్దరు దొంగలు యత్నించారు. పట్టణంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు అనుమానించి ఏటీఎంలోకి ప్రవేశించగా వారిని తోసివేసి అక్కడి నుంచి పరారైయ్యారు. దాంతో పోలీసులు వెంటనే సహచర సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఆ క్రమంలో ఇద్దరు దొంగలను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి... తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
అనంతపురం జిల్లాలో కలకలం
-
కొవూరు ఏటీఎంలో నగదు చోరీ
నెల్లూరు జిల్లా కొవూరులో గత అర్థరాత్రి దోపిడి దొంగల బీభత్సం సృష్టించారు. పట్టణంలోని ఓ ఏటీఎంను పగలకొట్టి, అందులో ఉన్న నగదును అపహరించుకుపోయారు. ఆ క్రమంలో ఏటీఎంలోని సీసీ కెమెరాలను దొంగలు ధ్వంసం చేశారు. ఆ ఘటనపై స్థానికులు వెంటనే స్పందించి ఈ రోజు తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, బ్యాంక్ అధికారులకు సమాచారాన్ని అందించారు. అయితే ఏటీఎంలో దొంగలు ఎంత నగదు అపహరించుకుపోయారు అనేది బ్యాంక్ అధికారులు వస్తే కాని తెలియదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. -
పోలీసుల అదుపులో ఏటిఎం నిందితుడు