
సాక్షి, నల్గొండ: నిత్యం రద్దీగా ఉండే విజయవాడ-హైదరాబాద్ రహదారి పక్కనే ఉన్న ఇండి క్యాష్ ఏటీఎంలో గురువారం అర్ధరాత్రి ఆగంతకులు చోరీకి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మిషన్ ని కట్ చేసి డబ్బులు అపహరించుకుపోయారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు జాతీయ రహదారి పక్కనే చోటు చేసుకున్న ఈ ఘటనలో షట్టర్ కిందికి లాగి.. సిసి పుటేజ్ కెమెరా వైర్లను కట్ చేసి చోరీకి పాల్పడ్డారు.కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్,క్లూస్ టీం తో విచారణ చేపట్టారు.ఎంత డబ్బు పోయిందనే విషయం పై బ్యాంక్ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఏటీఎం వద్ద సెక్యూరిటీ లేకపోవడం తో తెలిసిన వ్యక్తులే పక్కా ప్లాన్ తో చోరీ కి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment