కొవూరు ఏటీఎంలో నగదు చోరీ | ATM robbery at kovru in nellore district | Sakshi
Sakshi News home page

కొవూరు ఏటీఎంలో నగదు చోరీ

Published Wed, Dec 18 2013 9:13 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

ATM robbery at kovru in nellore district

నెల్లూరు జిల్లా కొవూరులో గత అర్థరాత్రి దోపిడి దొంగల బీభత్సం సృష్టించారు. పట్టణంలోని ఓ ఏటీఎంను పగలకొట్టి, అందులో ఉన్న నగదును అపహరించుకుపోయారు. ఆ క్రమంలో ఏటీఎంలోని సీసీ కెమెరాలను దొంగలు ధ్వంసం చేశారు. ఆ ఘటనపై స్థానికులు వెంటనే స్పందించి ఈ రోజు తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, బ్యాంక్ అధికారులకు సమాచారాన్ని అందించారు. అయితే ఏటీఎంలో దొంగలు ఎంత నగదు అపహరించుకుపోయారు అనేది బ్యాంక్ అధికారులు వస్తే కాని తెలియదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement