నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో గత అర్థరాత్రి ఏటీఎంలో నగదు చోరీకి ఇద్దరు దొంగలు యత్నించారు. పట్టణంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు అనుమానించి ఏటీఎంలోకి ప్రవేశించగా వారిని తోసివేసి అక్కడి నుంచి పరారైయ్యారు. దాంతో పోలీసులు వెంటనే సహచర సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఆ క్రమంలో ఇద్దరు దొంగలను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి... తమదైన శైలిలో విచారిస్తున్నారు.