వదంతులకు వేగం ఎక్కువ: మమత | Canards being spread: Mamata Banerjee | Sakshi
Sakshi News home page

వదంతులకు వేగం ఎక్కువ: మమత

Published Thu, Jul 3 2014 8:33 PM | Last Updated on Tue, Aug 27 2019 4:29 PM

వదంతులకు వేగం ఎక్కువ: మమత - Sakshi

వదంతులకు వేగం ఎక్కువ: మమత

కోల్కతా: వదంతులు వ్యాపించినంత వేగంగా మంచి వార్తలు జనంలోకి వెళ్లడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వాపోయారు. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులు గురించి ఎవరూ చెప్పుకోవడం లేదని అన్నారు. చిన్న విషయాలను మాత్రం పెద్దవి చేసి చూపుతున్నారని పేర్కొన్నారు.

"మంచి పనులు గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఏమీ లాభం లేకపోయినప్పటికీ చిన్న విషయాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. మన ప్రమేయం లేకపోయినప్పటికీ వదంతులు వేగంగా వ్యాపిస్తాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి' అని మమత వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎంపీ తపస్ పాల్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో పరోక్షంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement