good work
-
ట్రెండ్ మారింది, గుడ్‌వర్కర్ నుంచి డిజిటల్ వాకిన్ ఇంటర్వ్యూ ప్లాట్‌ఫాం
న్యూఢిల్లీ: కార్మికులు మొదలుకుని ఉన్నతోద్యోగుల వరకు వివిధ రకాల ఉద్యోగుల నియామకానికి సంబంధించి దేశీయంగా తొలి డిజిటల్ వాకిన్ ఇంటర్వ్యూ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించినట్లు గుడ్‌వర్కర్ సంస్థ వెల్లడించింది. ఓడ బ్ల్యూవీఐ ప్లాట్‌ఫాంతో సాంప్రదాయ ఆఫ్‌లైన్ వాకిన్ అనుభూతిని తమ గుడ్‌వర్కర్ యాప్‌లో ఆన్లైన్ విధానంలో పొందవచ్చని పేర్కొంది. ఇంటర్వ్యూ చేసే వారు, ఉద్యోగార్థులు వ ర్చువల్‌గా ముఖాముఖి భేటీ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని గుడ్‌వర్కర్ తెలిపింది. దీనితో భౌతికంగా ప్రయాణాలు చేయాల్సి న భారం తగ్గుతుందని, రిక్రూట్మెంట్ వ్య వస్థకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది. -
పిల్లల కథ: మంచి పని.. ఈ కిరీటం నీకే!
విజయపురి రాజు వద్ద రకరకాల కిరీటాలు ఉండేవి. ఒకసారి అడవిలో గుర్రం మీద లేడిని వెంబడిస్తూ వేటాడసాగాడు. ఆ సమయంలో కిరీటం జారి కిందపడింది. రాజు ఆ విషయాన్ని పట్టించుకోకుండా లేడిని తరుముతూ ముందుకెళ్ళిపోయాడు. నక్క, తోడేలు కలసి వస్తూ కిరీటాన్ని చూశాయి. ‘నేను ముందు చూశాను. ఇది నాకు చెందాలి’ అంది నక్క. ‘కాదు.. నేను ముందు చూశాను. నాకే చెందాలి‘ అంది తోడేలు. అలా వాదులాడుకుంటూ న్యాయం కోసం సింహం దగ్గరకు వెళ్లాయి. వాటి సమస్య విన్న సింహం.. జంతువులన్నింటిని సమావేశపరచింది. విషయాన్ని వివరించింది. ‘కిరీటం అడవిలో దొరికింది కాబట్టి.. ఈ అడవికి రాజునైన నాకే చెందుతుంది. ఈ అడవిలోని జంతువులన్నిటికీ ఏడాది సమయం ఇస్తున్నాను. ఈ ఏడాదిలో ఎవరైతే మంచి పనులు చేస్తారో వారికి ఈ కిరీటాన్నిచ్చి గౌరవిస్తాను. అంతవరకూ ఇది నాదగ్గరే ఉంటుంది’ అని చెప్పింది సింహం. సమావేశం ముగిశాక జంతువులన్నీ వెళ్లిపోయాయి. వేట ముగించుకుని రాజు తిరిగి వస్తూ కిరీటం కోసం చూశాడు. ఎక్కడా కనిపించక పోవడంతో నిరాశతోనే రాజ్యానికి వెళ్లిపోయాడు. సంవత్సర కాలం పూర్తయింది. సింహం జంతువులన్నీటినీ సమావేశపరచింది. ‘మహారాజా! నేను కోతిచేష్టలు, ఆకతాయి పనులు మానుకున్నాను. మంచిగా ఉంటున్నాను’ అంది కోతి. ‘మాంసాహారం మానుకుని చిన్నజంతువులను దయతో చూస్తున్నాను’ అంది తోడేలు. నక్క మరికొన్ని జంతువులు కూడా తోడేలు చెప్పిన మాటనే చెప్పాయి. ‘బురదగుంటలో చిక్కుకున్న గాడిదను కాపాడాను’ అంది ఏనుగు. ‘నేను నాట్యంతో ఆనందాన్ని పంచాను’ అంది గుర్రం. ‘నేను కొన్నింటికి చెట్లెక్కడం నేర్పాను’ అంది చిరుత. ‘పిల్లజంతువులను నా వీపు మీద ఎక్కించుకుని అడవంతా తిప్పుతూ ఆనందాన్ని పంచాను’ అంది పెద్దపులి. ఉలుకు.. పలుకూ లేకుండా ఉన్న ఎలుగుబంటిని చూసి సింహం ‘నువ్వేం చేశావో చెప్పు?’ అని అడిగింది. ‘మన అడవి గుండా విజయపురి వైపు వెళ్తున్న ఒక మునితో విజయపురి రాజు వేటకు వచ్చి మమ్మల్ని చంపుతున్నాడు. ఆ క్రమంలోనే ఆయన కిరీటం జారి ఈ అడవిలో పడిపోయింది. కాబట్టి ఇక్కడకు వేటకు రావడం ఆ రాజుకు అరిష్టమని చెప్పి భయపెట్టి.. మా వైపు రానివ్వకుండా చేయండి అని కోరాను. దానికి ఆ ముని.. ఈ అడవికే కాదు ఏ అడవికీ వేటకు వెళ్లకుండా చేస్తానని మాటిచ్చాడు. ఆ ముని వెళ్లి రాజుకు ఏంచెప్పాడో కానీ ఆరోజు నుంచి విజయపురి రాజు వేట మానుకున్నాడు. మన అడవిలో చెట్లు తక్కువగా ఉన్నాయి. నిండుగా చెట్లుంటే అనేక లాభాలు. అందుకే వందలసంఖ్యలో పండ్లమొక్కలను నాటి పెంచుతున్నాను’ అని చెప్పింది ఎలుగుబంటి. ‘ఇతరుల మేలు కోరడం, మొక్కలను పెంచడాన్ని మించిన మంచి పనులేమున్నాయి! ఈ కిరీటం నీకే’ అని ప్రశంసించింది సింహం. ‘మృగరాజా.. బహుమతి కోసం నేను ఈ పనులు మొదలుపెట్టలేదు. చాలా కాలం నుంచే చేస్తున్నాను. మీ ప్రశంసలు అందుకున్నాను. అది చాలు నాకు’ అంటూ వినయంగా కిరీటాన్ని తిరస్కరించింది ఎలుగుబంటి. ఆ రోజు నుంచి ఆ అడవిలోని జంతువులన్నీ ఎలుగుబంటిలా పదిమందికి ఉపయోగపడే పనులు చేయసాగాయి. (క్లిక్: పిల్లల కథ.. ఆనందమాత) -
మంచిని విత్తండి
వీధి చివర కుక్కపిల్లకు దెబ్బతగిలితే సుధాకర్రావుగారి అబ్బాయికి అయిదేళ్లు ఉంటాయేమో దాన్ని తీసుకెళ్లి కట్టుకట్టించాడు. టీ కొట్టు అతను అక్కడ పనిచేసే కుర్రాడిని బాదుతుంటే రమణిగారి అమ్మాయి ఏడేళ్లు కూడా ఉండవు అతనికి అడ్డం పడిందట. చూశారా... పిల్లల పేర్లు ఎవరికీ తెలియవు. కాని, పిల్లలు చేసిన మంచి పనితో ఆ తల్లిదండ్రులకు ఎంత మంచి పేరు వచ్చిందో. నిజానికి దీనికి రివర్సే కరెక్ట్. ఆ తల్లిదండ్రుల పెంపకంలో ఆ పిల్లలు నేర్చుకున్న మంచితనం అది. తల్లిదండ్రుల ఉపదేశాలకన్నా వారి చేతలను చూసే పిల్లలు మంచి తనాన్ని నేర్చుకుంటారు. అందుకేనేమో పుట్టినప్పుడు అమ్మపోలికో, నాన్నపోలికో అంటారు. పెరిగేటప్పుడు అమ్మ మంచితనమో, నాన్న మంచితనమో అంటారు. ‘ఎందుకు నాన్నా ఆ గింజలన్నీ అలా భూమిలో నాటుతున్నావు?’ ఆశ్చర్యంగా అడిగాడు కొడుకు. ‘ఇవి మొలకెత్తి, పెద్ద మొక్కలై మరిన్ని గింజలు వస్తాయి. వాటిని విత్తితే ఇంకా ఎక్కువ గింజలు వస్తాయి.. అలా అలా మన ఊళ్లో అందరికీ సరిపోయినన్ని గింజలను పండించుకోవచ్చు’ తండ్రి సమాధానం. ‘వీటిలాగే మన దగ్గర ఉన్న బుల్లెట్లను నాటితే ఇంకా బోలెడన్ని బుల్లెట్లు వస్తాయా! వాటితో మనల్ని పీడించే ఆంగ్లేయులందరినీ చంపేయచ్చా?’ ఆవేశంగా అడిగాడు కొడుకు. బ్రిటీష్ ఆధిపత్యం నుంచి భారతీయులను కాపాడుకోవాలనే ఆలోచన ఆ చిట్టి మెదడులో అప్పుడే రూపుదిద్దుకుంది. ఆ పిల్లాడే భగత్‌సింగ్. ఆ పేరే ఆంగ్లేయులను పరుగులు పెట్టించింది. ‘ఏంటి, స్కూల్ టైమ్ అయిపోయింది, ఇప్పుడా నువ్వు వచ్చేది’ బెత్తం ఆ విద్యార్థినిపై నాట్యం చేసింది. శిక్ష పూర్తయ్యాక... ‘ఇంతకీ ఎందుకు లేటయింది?’ అడిగింది టీచర్. ‘రోడ్డు దాటలేక అవస్థపడుతున్న ముసలి అవ్వను దగ్గరుండి రోడ్డు దాటించి వచ్చాను, అందుకే లేటయింది’ బదులిచ్చిందా విద్యార్థిని. బాధించిన బెత్తం చిన్నబోయింది. ఆ చిన్నారి పాఠాలకన్నా గొప్పగా ఎదిగిపోయింది. విశ్వమంతా విస్తరించింది. ప్రపంచాన్నే సేవా మార్గం పట్టించింది. చిన్నవయసులోనే ఎంతో మానవత్వాన్ని చూపిన ఆ మానవతామూర్తే ఆగ్నస్. ప్రపంచ జనులందరూ అమ్మగా ఆరాధించే మదర్ థెరిస్సా. ‘మనిషి సంఘజీవి’ అన్నాడు అరిస్టాటిల్. అందరూ ఆనందంగా, సుఖసంతోషాలతో జీవించాలంటే అందరూ అందరికోసం అన్నట్టుగా జీవించాలి. అక్కడే భద్రత ఉంటుంది, అక్కడే శాంతి ఉంటుంది. అక్కడే ఇరుకు గోడలు విశాలమై రేపటి భావి జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి. సామాజిక బాధ్యత నుంచే సేవాతత్పరత, మానసిక వికాసం నుంచే మానవత్వం జనించాలి. దీనికి ఇల్లే సరైన పాఠశాల. మొక్కదశలోనే మానవత్వాన్ని, సేవాతత్పరతను పెంపొందించడానికి తల్లిదండ్రులే ఉపాధ్యాయులు కావాలి. చుట్టూ ఏం జరుగుతోంది? నా వంతు సాయం ఎంత వరకు చేయగలను? అనే భావనను వారి మెదళ్లలో నాటుకుపోయేలా చేయడం పెద్దల బాధ్యతే. ఇంట్లో వున్న చెత్తను వీధి బయట పడేస్తే కేవలం మన ఇల్లే శుభ్రమౌతుంది. అదే వీధి చివర్లో ఉన్న చెత్తకుండీ దాకా తీసుకెళ్లి పారబోస్తే? ఆ వీధి మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది. ఆ వీధిలో ఉన్న వారికి అసౌకర్యాన్ని దూరం చేయడం దగ్గర్నుంచే మొదలుపెట్టచ్చు. చేసే పనికి సామాజిక బాధ్యత జోడిస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయనేది పిల్లలకు బాల్యదశలో ఇంటి వద్ద నేర్పే పాఠాలుగా మారాలి. చిన్న మార్గం... సమాజసేవ అనగానే ‘డబ్బుతో ముడిపడి ఉంది, అది బాగా సంపన్నులు మాత్రమే చేసే పని అని, సాయం చేయాలంటే మన స్థాయి సరిపోదు’ అనే ఆలోచన సరికాదు. మీరలాంటి భావాలతో ఉంటే అది మీ పిల్లలపై కూడా ప్రభావం చూపిస్తుంది. తనకు నిరుపయోగంగా మిగిలినవి, తోటివారికి ఉపకరించేవి ఉంటే వాటిని పిల్లల చేతులమీదుగానే అవసరంలో ఉన్న వారికి అందజేయచ్చు. నేటి బాలలే రేపటి సంఘసేవకులు కావడానికి ఓ చిరు మార్గం చూపినట్టుంటుంది. స్కూళ్లు మొదలయ్యే నాటికి పిల్లలు వాడేసిన దుస్తులు, పుస్తకాలు బీదపిల్లలకు ఇప్పించవచ్చు. టీచర్లు తమకు నేర్పిన విద్యని ఎవరికైనా చెప్పాలని విద్యార్థులు ఉబలాటపడుతుంటారు. దీనిని అనుకూలంగా మార్చుకుని వారిచేత నిరుపేద పిల్లలకు చదువు చెప్పిస్తే ఆ కళ్లల్లో కనిపించే ఆనందం దేనితోను సరితూగదు. పసిపిల్లవాడు తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఆ అడుగులను చూసి ఆనందిస్తూ, వాటిని సరిదిద్దుతాం. అలాగే వారు జీవితంలో ఎదగడానికి, సమాజం గురించి అవగాహన కలగడానికి, చేతనైనంత సేవచేయడానికి పొరపాట్లను దిద్దుతూ మార్గనిర్దేశకం చేసేది తల్లిదండ్రులే. పిల్లలు పెద్దయ్యాక తమ తల్లిదండ్రుల్లా కావాలనుకునే విధంగా ఆదర్శంగా నిలవాలి. అలా చేయగలిగితే తల్లిదండ్రులు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించినట్టే. చెప్పకుండా చెప్పే విషయాలు పెద్దలు ఏ పని చేస్తే పిల్లలు అది చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అమ్మ వంట చేస్తే తామూ చేయాలని ఉబలాటపడే పిల్లలు, నాన్నలా మోటార్‌బైక్ నడపాలని ఉత్సాహపడతారు. వారికి మంచేదో, చెడేదో తెలియదు. ఇంట్లో పెద్దల ప్రవర్తన ఎలా ఉంటే పిల్లలు అదే నేర్చుకుంటారు. ఇవేవీ పుస్తకాల్లో ఉండవు, చదివి నేర్చుకోవడానికి. తమ చుట్టూ ఉన్న పరిసరాలను, వ్యక్తులను ప్రాక్టికల్‌గా చూసి నేర్చుకుంటారు. తామూ పెద్దయ్యాక అలాగే అవ్వాలని కోరుకుంటారు. తండ్రి తన తల్లిని గౌరవిస్తే అది చూసి పిల్లవాడు నేర్చుకుంటాడు. అమ్మను ఎంత బాగా చూసుకోవాలో తెలుసుకుంటాడు. దేశాన్ని కూడా కన్నతల్లిలా చూసుకోవాలన్న భావన పెరిగేది కూడా ఇక్కడే. ఇంటి నుంచే సమాజసేవ చేయాలన్న ఆలోచన పుడుతుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కూరగాయల తొక్కలు తీసుకెళ్లి మొక్కలకు వేయండి. దీనివల్ల పిల్లలు మొక్కలకు వేస్టేజ్ ఎరువుగా పనిచేస్తుందన్న మాట అని అర్థం చేసుకొని అదేవిధంగా చేస్తారు. ట్యాప్ విప్పి పనులు చేయడం కాకుండా బకెట్లోనో, గిన్నెలోనో నీటిని పట్టి అవసరమైనంతే వాడుకోవాలి. ఇది చూసి పిల్లలు కూడా నీటి విలువ తెలుసుకుంటారు. ఇంట్లో ఎక్కడ తీసిన వస్తువులను అక్కడ పెడుతూ ఉంటే పిల్లలు కూడా అలా చేయడం అలవర్చుకుంటారు. గదిలో నుంచి బయటకు వెళ్లేటప్పుడు కరెంట్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లాలి. అది చూసి పిల్లలకు కరెంట్ ఆదా చేయాలని తెలుస్తుంది. పొట్టిగా అయిపోయిన దుస్తులు, చెప్పులు, షూస్, బ్యాగులు... మొదలైనవి బాగుచేసి పనివాళ్లకు ఇవ్వడం, లేదంటే పేదవాళ్లకు ఇవ్వడం చేయాలి. ఇది చూసి పిల్లలకు ‘లేనివాళ్లకు సహాయపడాలి’ అన్న ఆలోచన కలుగుతుంది. పిక్నిక్, సినిమా, పార్కులకు వెళ్లినప్పుడు చాక్లెట్ రాపర్లు, ఐస్‌క్రీమ్ కప్పులు లాంటివి తప్పకుండా డస్ట్‌బిన్‌లో వేయాలి. పెద్దలను పిల్లలు అనుసరిస్తుంటారని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.బస్సులో వెళ్లినప్పుడు, ఏదైనా బిల్లు కడుతున్నప్పుడు వయసులో పెద్దవాళ్లు, అంగవికలురు, గర్భవతులు ఉంటే వారికి సీట్ ఇవ్వడం, దారి ఇవ్వడం వంటివి చేయాలి. పిల్లలకు అలాంటి వాళ్లకు హెల్ప్ చేయాలనే ఆలోచన కలుగుతుంది.అంగవైకల్యంతో ఎవరైనా బాధపడుతుంటే మనం వారి గురించి చులకనగా, జాలిగా మాట్లడం చేయకూడదు. వాళ్లని మనుషుల్లానే భావించి సరైన గౌరవం ఇస్తే పిల్లలు కూడా అదేవిధంగా గౌరవించడం నేర్చుకుంటారు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సేవలతో మెరి‘షి’
సావిత్రీ బాయి ఫూలే అవార్డు అందుకున్న ఉపాధ్యాయినులు తొలిమహిళా ఉపాధ్యాయినిగా, మహిళా పాఠశాలను స్థాపించి ఎందరో మహిళా విద్యావేత్తలను సమాజానికి అందించిన ఆదర్శ ఉపాధ్యాయిని సావిత్రీబాయి ఫూలే. మహాత్మా జ్యోతిరావు పూలే సిద్ధాంతాలను, ఆయన ఆశయాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఆదర్శ సతీమణి. ఆమెను ఆదర్శంగా తీసుకున్న జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయినులు అభాగ్యులకు ఆసరాగా.. బడి బయట పిల్లలకు దిక్సూచిలా.. విధి వంచించిన అబలలకు మార్గదర్శిలా నిలిచి అరుదైన పురస్కారాలకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సావిత్రీబాయి పూలే రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్నారు. వారే తళ్లా ఉమారాజ మంగతాయారు, బచ్చు ఉమాశ్రీదేవి. – భానుగుడి(కాకినాడ) తళ్లా..సేవలు భళా స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో ఉన్న తళ్లా ఉమారాజ మంగతాయారు 28 ఏళ్లుగా జీవశాస్త్ర ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్నారు. బాల కార్మిక నిర్మూలన, మహిళా సాధికారికత, బాలికా విద్య, బాల్యవివాహాల నిర్మూలన వంటి అంశాలపై జిల్లాలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. కాకినాడ జనశిక్షణ సంస్థ ద్వారా వంద మంది మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా శిక్షణ నిచ్చి ఉపాధి చూపారు. బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు, నిరక్షరాస్యత నిర్మూలనకు అక్షర గోదావరి, అక్షర భారతి, అక్షర సంక్రాతి వంటి కార్యక్రమాల్లో పాల్గొని సేవలందించారు. కమ్యూనిటీ మొబలైజేష¯ŒS ద్వారా పాఠశాలల నిర్మాణం, సమాజంలో మహిళలు, బాలికల వివక్ష పట్ల గ్రామాల్లో పలు అవగాహన కార్యక్రమాలు సొంతంగా నిర్వహిస్తున్నారు. సత్కారాలెన్నో..! 2008లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినిగా, లయ¯Œ్స క్లబ్, రోటరీ క్లబ్, రాజమండ్రి కళాక్షేత్రంS ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. ఉపాధ్యాయినిగా చేబ్రోలు, వీరవరం, గొల్లప్రోలు, తాటిపర్తి తదితర పాఠశాలల్లో పనిచేసి ఉత్తమ బోధనతో పాటు, విద్యాభివృద్ధిలో ఆమె చేసిన ప్రగతికిగాను సావిత్రీబాయి ఫూలే అవార్డును అందుకున్నారు. సేవల సిరి.. ఉమాశ్రీ సావిత్రీబాయి çఫూలే ఆదర్శంగా 23 ఏళ్ల పాటు ఎస్జీటీగా జిల్లాలో సేవలందిస్తున్న బచ్చు ఉమాశ్రీదేవి పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఈస్ట్ చోడవరంలో ఉద్యోగవృత్తిని ప్రారంభించారు. బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన ఈమె ఎస్జీటీ కేడర్‌లో అవార్డును అందుకున్నారు. కాకినాడ రూరల్ మండలం పండూరు, కొవ్వూరు, కాజులూరు మండలం ఐతిపూడి, పెదపూడి మండలం లక్షీ్మనరసాపురంలలో పనిచేశారు. 23 ఏళ్లుగా రామకృష్ణ మఠంలో శాశ్వత సభ్యురాలిగా పలు సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే కోకనాడ అన్నదాన సమాజంలో మేజర్డోనర్గా అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. అలయ¯Œ్స క్లబ్ జిల్లా కార్యదర్శిగా సేవలందిస్తూ, ఓలే్డజ్ హోమ్‌ల నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. 2013 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా, 2015 పడాల ఛారిటబుల్ ట్రస్ట్ పురస్కారం, 2016 రాజమండ్రి ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆ««దl్వర్యంలో బెస్ట్ టీచర్‌గా, ఫియలాజికల్ వర్సిటీ హైదరాబాద్ వారిచే ఇంటర్నేషనల్ లైఫ్ ఎచీవ్మెంట్, మధర్ థెరిస్సా ఫౌండేష¯ŒSచే ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డులను అందుకున్నారు. -
బీసీ నాయకుల వితరణ
ఓదూరు (రామచంద్రపురం రూరల్): గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో ఇటీవల మరణించిన ఒకరికి, అదే సంఘటనలో ఇద్దరిని కాపాడిన ఓ బాలుడికి బీసీ నాయకులు వితరణ చేశారు. అనపర్తిలో ములగపాక శివరాం సంతోష్ ఇటీవల గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో మరణించగా అతని తల్లికి శుక్రవారం ఓదూరులోని బీసీ నాయకులు బుల్లెట్ రాము మీడియా గ్రూపు తోడ్పాటుతో గల్ఫ్ బీసీ యూత్ అందించిన రూ. 25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదే సంఘటనలో తన ప్రాణాలకు తెగించి ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడిన బాలుడు దుర్గా రమేష్‌ను అభినందించి అతనికి రూ. 7 వేల నగదు బహుమతి, జ్ఞాపికను అందజేశారు. సీనియర్ బీసీ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి సూర్యచంద్రరావు, బీసీ యువజన సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు రెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘సంకురాత్రి’ సేవలు అభినందనీయం
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కాకినాడ రూరల్: సంకురాత్రి ఫౌండేషన్ అధినేత సంకురాత్రి చంద్రశేఖర్ జీవిత భాగస్వామితో పాటు సర్వం కోల్పోయి ఆత్మసై్థర్యంతో లోకమంతా తన కుటుంబమేనని ప్రజా సేవలో నిమగ్నమవడం ఆనందదాయకమని సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం పెనుమర్తిలోని కిరణ్‌కంటి ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గత ఎనిమిది దేళ్లుగా కిరణ్‌కంటి ఆసుపత్రి ద్వారా చంద్రశేఖర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎంతో మంది అనాథలకు, బడుగు వర్గాల ప్రజలకు ప్రాథమిక విద్యతో పాటు ప్రాథమిక ఆరోగ్యం అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయడం సామాన్య విషయం కాదన్నారు. గత 26 ఏళ్లలో 2.50 లక్షల మందికి కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి, 25 లక్షల మందికి సేవలందించడం ప్రశంసనీయమన్నారు. చంద్రశేఖర్ పాదాలకు అభివందనం చేశారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో చదువుతున్న విద్యార్థులతో పవన్ కొద్దిసేపు ముచ్చటించారు. ముందుగా ఆసుపత్రి ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం జిల్లా రోటరీక్లబ్, మిచిగన్ రోటరీ క్లబ్ ద్వారా గ్లోబల్ గ్రాంట్ 1,000 కంటి శస్త్ర చికిత్సల కార్యక్రమాన్ని, జిల్లాలో ఏర్పాటు చేసే రెండు విజన్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. తుమ్మలపల్లి సాయి చంద్రశేఖర్, ముమ్మిడి మురళి, తుమ్మలపల్లి బాబు, సంగీతసాయి గుణరాజన్, కడలి శివ, కాద సతీష్, కామిరెడ్డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
వదంతులకు వేగం ఎక్కువ: మమత
కోల్‌కతా: వదంతులు వ్యాపించినంత వేగంగా మంచి వార్తలు జనంలోకి వెళ్లడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వాపోయారు. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులు గురించి ఎవరూ చెప్పుకోవడం లేదని అన్నారు. చిన్న విషయాలను మాత్రం పెద్దవి చేసి చూపుతున్నారని పేర్కొన్నారు. "మంచి పనులు గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఏమీ లాభం లేకపోయినప్పటికీ చిన్న విషయాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. మన ప్రమేయం లేకపోయినప్పటికీ వదంతులు వేగంగా వ్యాపిస్తాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి' అని మమత వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎంపీ తపస్ పాల్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో పరోక్షంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.