మమతా బెనర్జీకి కేంద్రం షాక్‌ | Tapas Pal Arrested In Chit Fund Case | Sakshi
Sakshi News home page

మమతా బెనర్జీకి కేంద్రం షాక్‌

Published Fri, Dec 30 2016 5:09 PM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

మమతా బెనర్జీకి కేంద్రం షాక్‌

మమతా బెనర్జీకి కేంద్రం షాక్‌

కోల్‌కతా: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమాల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్‌ తగిలింది. రోజ్‌ వ్యాలీ చిట్‌ ఫండ్‌ కుంభకోణం కేసులో టీఎంసీ ఎంపీ తపస్‌ పాల్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. శుక్రవారం కోల్‌కతాలో కొన్ని గంటల పాటు ప్రశ్నించిన అనంతరం సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రోజ్‌ వ్యాలీ కంపెనీలో తపస్‌ పాల్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

17 వేల కోట్ల రూపాయల మేరకు వేలాది మందిని మోసం చేసినట్టు రోజ్‌ వ్యాలీపై ఆరోపణలు వచ్చాయి. రోజ్‌ వ్యాలీ నుంచి పాల్‌ లబ్ధి పొందినట్టు సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఇదే కేసుకు సంబంధించి టీఎంసీకి చెందిన మరో ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయకు సీబీఐ సమన్లు జారీ చేసింది. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున కేంద్రం సీబీఐని అడ్డుపెట్టుకుని తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement