Rose Valley chit fund scam
-
భారీ స్కాంలో ప్రముఖ నటికి నోటీసులు
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో సంచలనంగా మారిన రోస్‌వ్యాలీ కుంభకోణంలో ఒక్కొక్కరూ బయటపడుతున్నారు. ఈ భారీ స్కాంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను అరెస్ట్ చేసిన అధికారులు విచారణను మరింత ముమ్మరం చేశారు. తాజాగా బెంగాల్ ప్రముఖ సినీ నటి రీతూపర్ణ సేన్‌గుప్తాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారేచేసింది. విచారణ నిమిత్తం వారంలోపు తమ ముందు హాజరుకావాలంటూ ఆదేశించింది. బాలీవుడ్, బెంగాలీతో పాటు టాలీవుడ్లో కూడా రీతుపర్ణ నటించిన విషయం తెలిసిందే. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన 'ఘటోత్కచుడు' సినిమాలో నటించి ఆమె ప్రేక్షకులను అలరించింది. కాగా ఇదే కుంభకోణంలో ప్రముఖ నటుడు, బెంగాల్ సూపర్ స్టార్ ప్రసేన్‌జిత్ ఛటర్జీకి హస్తముందంటూ మంగళవారం ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రోస్‌వ్యాలీ కంపెనీ నేతృత్వంలో 2010-12 మధ్య కాలంలో పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారితో ఛటర్జీతో పాటు పలువురు భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపారని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. దీనిపై జూలై 19లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలని ఛటర్జీని ఆదేశించింది. ఈ పరిణామం బెంగాల్ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. బెంగాల్లో సంచలనంగా మారిన రోజ్‌వ్యాలీ స్కాంలో ఇప్పటికే అనేక రాజకీయ, సినీ ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ముందు కూడా రోజ్‌వ్యాలీ కుంభకోణం పెద్ద దుమారమే చెలరేగింది. శారదా, రోజ్‌వ్యాలీ కుంభకోణాల కేసుల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న రాజీవ్‌కుమార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. బెంగాల్ ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ మోహతా కూడా ఈ స్కాంలో ఉన్నారని.. రూ. 25కోట్లు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. -
భారీ కుంభకోణంలో సూపర్‌స్టార్‌కు నోటీసులు
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ ప్రకంపనలకు వేదికైన రోజ్ వ్యాలీ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది. ఈ స్కాంలో ప్రముఖ నటుడు, బెంగాల్ సూపర్ స్టార్ ప్రసేన్‌జిత్ ఛటర్జీకి హస్తం ఉందంటూ.. మంగళవారం సమన్లు జారీచేసింది. రోస్‌వ్యాలీ కంపెనీ నేతృత్వంలో 2010-12 మధ్య కాలంలో పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారితో ఛటర్జీ భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపారని ఈడీ పేర్కొంది. దీనిపై జూలై 19లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ పరిణామం బెంగాల్ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. బెంగాల్లో సంచలనంగా మారిన రోజ్‌వ్యాలీ స్కాంలో ఇప్పటికే అనేక రాజకీయ, సినీ ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ముందు కూడా రోజ్‌వ్యాలీ కుంభకోణం పెద్ద దుమారమే చెలరేగింది. శారదా, రోజ్‌వ్యాలీ కుంభకోణాల కేసుల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న రాజీవ్‌కుమార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. బెంగాల్ ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ మోహతా కూడా ఈ స్కాంలో ఉన్నారని.. రూ. 25కోట్లు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. -
మమతా బెనర్జీకి కేంద్రం షాక్
కోల్‌కతా: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమాల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్ తగిలింది. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో టీఎంసీ ఎంపీ తపస్ పాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. శుక్రవారం కోల్‌కతాలో కొన్ని గంటల పాటు ప్రశ్నించిన అనంతరం సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రోజ్ వ్యాలీ కంపెనీలో తపస్ పాల్ డైరెక్టర్‌గా ఉన్నారు. 17 వేల కోట్ల రూపాయల మేరకు వేలాది మందిని మోసం చేసినట్టు రోజ్ వ్యాలీపై ఆరోపణలు వచ్చాయి. రోజ్ వ్యాలీ నుంచి పాల్ లబ్ధి పొందినట్టు సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఇదే కేసుకు సంబంధించి టీఎంసీకి చెందిన మరో ఎంపీ సుదీప్ బందోపాధ్యాయకు సీబీఐ సమన్లు జారీ చేసింది. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున కేంద్రం సీబీఐని అడ్డుపెట్టుకుని తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.