కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ప్రకంపనలకు వేదికైన రోజ్ వ్యాలీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది. ఈ స్కాంలో ప్రముఖ నటుడు, బెంగాల్ సూపర్ స్టార్ ప్రసేన్‌జిత్ ఛటర్జీకి హస్తం ఉందంటూ.. మంగళవారం సమన్లు జారీచేసింది. రోస్‌వ్యాలీ కంపెనీ నేతృత్వంలో 2010-12 మధ్య కాలంలో పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారితో ఛటర్జీ భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపారని ఈడీ పేర్కొంది. దీనిపై జూలై 19లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ పరిణామం బెంగాల్ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
బెంగాల్‌లో సంచలనంగా మారిన రోజ్‌వ్యాలీ స్కాంలో ఇప్పటికే అనేక రాజకీయ, సినీ ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ముందు కూడా రోజ్‌వ్యాలీ కుంభకోణం పెద్ద దుమారమే చెలరేగింది. శారదా, రోజ్‌వ్యాలీ కుంభకోణాల కేసుల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న రాజీవ్‌కుమార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. బెంగాల్ ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ మోహతా కూడా ఈ స్కాంలో ఉన్నారని.. రూ. 25కోట్లు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment