డిపాజిట్ రేట్ల పెంపు.. | Punjab National, Canara Bank raise fixed deposit rates by up to 0.5% | Sakshi
Sakshi News home page

డిపాజిట్ రేట్ల పెంపు..

Published Sat, Nov 9 2013 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM

Punjab National, Canara Bank raise fixed deposit rates by up to 0.5%

 న్యూఢిల్లీ:  పీఎన్‌బీ, కెనరాబ్యాంక్‌లు స్థిర డిపాజిట్‌లకు సంబంధించి కొన్ని మెచ్యూరిటీలపై వడ్డీరేట్లను పెంచాయి.  ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సర్దుబాటు అవసరాల దిశలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. వేర్వేరుగా చూస్తే...
 
 పీఎన్‌బీ...: డిపాజిట్ రేట్లు 50 శాతం వరకూ పెరిగాయి. తాజా రేట్లు 11వ తేదీ నుంచీ అమల్లోకి రానున్నాయి. కోటి రూపాయల లోపు 271 రోజులు-ఏడాది మధ్య డిపాజిట్ రేటు 7.50 శాతం నుంచి 8 శాతానికి పెరిగింది. 91-179 రోజుల మధ్య డిపాజిట్ రేటు 6.75 శాతం నుంచి 7 శాతానికి ఎగసింది. ఏడాది నుంచి 10 యేళ్ల మధ్య డిపాజిట్ రేటు వరకూ రేటు 9 శాతంగా ఉంటుంది. ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్ రేటు ఏడాది నుంచి 3యేళ్ల మధ్య 8.75 శాతం నుంచి 9 శాతానికి చేరింది. కాగా కోటి రూపాయల నుంచి రూ.10 కోట్ల వరకూ 180-270 రోజుల డిపాజిట్‌పై  వడ్డీరేటు 8.25 శాతం నుంచి 8 శాతానికి దిగింది. కనీస రుణ రేటు పెంపు విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని బ్యాంక్ సీఎండీ కేఆర్ కామత్ పేర్కొన్నారు.
 
 కెనరాబ్యాంక్: ఈ బ్యాంక్ కూడా డిపాజిట్‌పై వడ్డీరేటు అరశాతం వరకూ పెరిగింది. తక్షణం ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి. 46-60 రోజులు, 61-90 శ్రేణి డిపాజిట్ రేటు 7శాతం నుంచి 7.50 శాతానికి చేరింది. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య డిపాజిట్ రేటు 8.75 శాతం నుంచి 9.05శాతానికి చేరింది. 7 నుంచి 8 యేళ్ల మధ్య డిపాజిట్ రేటు 8.75 శాతం నుంచి 9.05 శాతానికి ఎగసింది. అధిక రేటు 9.05 శాతంగా ఉండనుంది. ఏడాది నుంచి 10 యేళ్ల డిపాజిట్లకు ఈ రేటు వర్తిస్తుంది.  వృద్ధులకు అరశాతం అదనపు వడ్డీరేటు అందుబాటులో ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement