కెనరా బ్యాంక్‌ నికర లాభం రూ.214కోట్లు | Canara Bank posts Rs 214 cr net profit | Sakshi
Sakshi News home page

కెనరా బ్యాంక్‌ నికర లాభం రూ.214కోట్లు

Published Mon, May 8 2017 4:00 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

Canara Bank posts Rs 214 cr net profit

ముంబై: కెనరా బ్యాంక్ క్యూ4 ఫలితాలు  సోమవారం ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.214.2 కోట్ల నికరలాభాన్నినమోదు చేసింది.  మొత్తం ఆదాయం రూ.48,942 కోట్లుగా ఉంది.  , గత ఏడాది ఇదే కాలంలో రూ .3,905.49 కోట్లు నష్టపోయింది.

గ్రాస్ ఎన్‌పిఏలు ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ బేసిస్‌లో 9.97 నుంచి 9.63శాతానికి తగ్గాయ్. ఇక క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ బేసిస్‌లో   6.72 నుంచి 6.33శాతానికి తగ్గాయ్. నికర ప్రొవిజన్లు రూ.2708కోట్లుగా నమోదవ్వగా, నికర ఎన్‌పిఏలు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో రూ.34202కోట్లుగా  నిలిచాయ. ఇవి గత ఏడాదిలో రూ.34338.7కోట్లుగా ఉన్నాయి. ఇక క్వార్టర్‌ బేసిస్‌లో చూస్తే  నికర ఎన్‌పిఏలు రూ.21649కోట్లుగా నమోదు అవగా..గతేడాది ఇదే సమయానికి అవి రూ.22295కోట్లుగా ఉన్నాయి.

మరోవైపు  రిజల్ట్స్ ఇచ్చిన ఉత్సాహంతో కెనరా బ్యాంక్ ఇంట్రాడేలో  దాదాపు 3శాతం లాభాలను ఆర్జించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement