వారు ముగ్గురు స్నేహితులు. వీరికి సులువుగా డబ్బు సంపాదించుకోవాలనే ఆశ కలిగింది. గుప్తనిధుల వేటలో పడ్డారు. అందుకు అవసరమైన సామగ్రితో పాటు మంచినీరు, ఆహారం, మజ్జిగ తీసుకుని బయల్దేరారు. ఇంకే ముంది ఎవరు చెప్పారో ఏమో ముగ్గురు కలిసి తర్లుపాడు మండలం తాడివారిపల్లె సమీపంలోని వెలిగొండ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. గత ఆదివారం రాత్రి అడవిలోకి వెళ్లిన వీరు తిరిగి వచ్చేందుకు రహదారి కనుగొనలేక ముగ్గురూ మూడు దారుల్లో వెళ్లారు. ఒకరు దాహార్తికి తట్టుకోలేక మృత్యువాత పడగా మరొకరు చెట్టు, పుట్టను పట్టుకుని రోడ్డుకెక్కారు. ఇంకొకరి కోసం పోలీసులు అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు.